అన్వేషించండి

Sania Mirza : ఓవైసీపై సానియా పోటీ చేస్తారా ? కాంగ్రెస్ అదే ఆలోచనలో ఉందా?

Telangana News : హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సానియా మీర్జా పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. నిజంగానే కాంగ్రెస్ ప్రయోగం చేయబోతోందా ?

Sania Mirza will contest as Hyderabad Congress candidate : సానియా మీర్జా రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.  టీం ఇండియా కెప్టెన్ గా పనిచేసి రాజకీయ రంగప్రవేశం చేసిన అజహరుద్దీన్ సానియా మీర్జాకు సమీప బంధువు. గతంలో ఇద్దరూ క్రీడాకారులైనా సానియా చెల్లెలి పెళ్లితో వారి మధ్య బంధుత్వం ఏర్పడింది. అజహరుద్దీన్ గతంలో కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేశారు. అజహరుద్దీన్ తన కుమారుడి అసద్ కు సానియామీర్జా చెల్లెలు ఆనంమీర్జాతో వివాహం జరిపించారు. అసద్-ఆనంమీర్జాల పెళ్లితో అజహరుద్దీన్ సానియామీర్జాకు దగ్గరి బంధువయ్యారు. దీంతో హైదరాబాద్ ఎంపీ బరిలో సానియా మీర్జాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నాయకుడైన అజహరుద్దీన్ ప్రతిపాదించినట్లు హస్తిన కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.                        
  
తెలంగాణ గత బీఆర్ఎస్ పాలనలో సానియామీర్జా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరుగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సానియా పలు సార్లు కలిసినా, అప్పట్లో టెన్నిస్ క్రీడాకారిణిగానే ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో ముస్లిం ఓటర్లు 50శాతానికి పైగా ఉండటంతోపాటు స్టార్ ఇమేజ్ ఉన్న సానియా మీర్జాను ఎన్నికల బరిలోకి దించితే విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.                                                                     

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకుల తర్వాత సానియా మీర్జాకు తాజాగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎన్టీటీవీ వారు అందించిన ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో రెడ్ కార్పెట్ పై ఉన్న తన కుమార్తె సానియామీర్జా ఫొటోను ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా పోస్టు చేశారు. వెలుగు జిలుగుల మధ్య వేదికపై తనదైన మేకప్ తో గ్లామరస్ గా సానియా అవార్డు అందుకుంది.ఈ అవార్డు పొందిన సానియాకు పలువురు అభిమానులు ప్రశంసించారు. 

అయితే సానియా ఇంత వరకూ రాజకీయ పరమైన  కామెంట్లు కానీ.. తనకు ఆసక్తి ఉన్నట్లుగా కానీ ఎక్కడా  బహిరంగంగా చెప్పలేదు. కాంగ్రెస్ నేతల్ని కలిసినట్లుగా కూడా స్పష్టత లేదు. అదే సమయంలో మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అసదుద్దీన్ కు గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థిని నిలబెడతారని అనుకోవడం లేదు. సానియా మీర్జాకు.. ముస్లిం యువతలో క్రేజ్ ఉంటుంది. ఎలా చూసినా..  అసదుద్దీన్ కు.. ముస్లిం ఓట్లు మైనస్ అవుతాయి. మరో వైపు బీజేపీ హిందూ ఓట్లను ఏకం చేస్తే.. అసదుద్దీన్ కు గట్టి పోటీ ఎదురు కావొచ్చు. బీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ కు సహకరించేలా హిందూ అభ్యర్థిని ఖరారు చేసినా ఆయన పలుకుబడి ఉన్న నేత కాదు కాబట్టి.. బీఆర్ఎస్ చీల్చే ఓట్లు స్వల్పమేనన్న అభిప్రాయం ఉంది.        

 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Kavitha Vs KTR: కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget