అన్వేషించండి

Revanth Reddy: రేవంత్ రెడ్డి శివుడు vs రాముడు కామెంట్స్ - కాంగ్రెస్ కొత్త హిందూత్వ నరేటివ్ వెనుక అసలు వ్యూహమేంటి?

Telangana Politics: రేవంత్ చేసిన శివుడు పేదల దేవుడు, రాముడు ధనికుల దేవుడు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బీజేపీ హిందూత్వ అజెండాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వేసిన కొత్త ఎత్తుగడగా భావిస్తున్నారు.

 Congress  BJP Hindutva:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   ఢిల్లీ వేదికగా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో శివుడు vs రాముడు  కోణంలో చేసిన వ్యాఖ్యలు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. బీజేపీ హిందూత్వ అజెండాకు విరుగుడుగా కాంగ్రెస్ పార్టీ శైవ, వైష్ణవ సాంప్రదాయాల చుట్టూ కొత్త రాజకీయ నరేటివ్‌ను తయారు చేయడానికి ప్రయత్నిస్తోందనే చర్చకు ఈ వ్యాఖ్యలు బలాన్నిచ్చాయి.

దేవుళ్ల మధ్య విభజనకు ప్రయత్నం

రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో భగవంతుడు శివుడిని పేదలు, శ్రమజీవులు, సామాన్యుల దేవుడిగా అభివర్ణించారు. శివుడు భస్మాన్ని ధరించి, ఆడంబరాలు లేకుండా ఉండే దేవుడని, సమాజంలోని దిగువ వర్గాలకు దగ్గరగా ఉంటాడని పేర్కొన్నారు. అదే సమయంలో రాముడిని ధనికులు, అధికార వర్గాలు, రాజరిక నేపథ్యంతో ముడిపడి ఉన్న దేవుడిగా వ్యాఖ్యానించారు. బీజేపీ కేవలం రాముడి పేరుతో హిందూ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తోందని, కానీ భారతీయ సంస్కృతిలో ప్రాచీన కాలం నుంచి భిన్నమైన భక్తి మార్గాలు ఉన్నాయని ఆయన నొక్కిచెప్పారు.

హిందూ ఓటర్లలో విభజన         

ఈ నరేటివ్ వెనుక కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. రాముడి ఇమేజ్ ఆధారంగా బీజేపీ సాధిస్తున్న ఏకచక్రాధిపత్యానికి గండి కొట్టడం, అలాగే హిందూ ఓటర్లను వర్గాల వారీగా విభజించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఉత్తర భారతదేశంలో రాముడి ప్రభావం ఎక్కువగా ఉంటే, దక్షిణ భారత్‌తో పాటు అనేక ఇతర ప్రాంతాలలో శివారాధన, జానపద రూపంలో లోతుగా పాతుకుపోయి ఉంది. ఈ సాంస్కృతిక వ్యత్యాసాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడం ద్వారా బీజేపీ ఏకీకృత హిందూత్వ కార్డును కౌంటర్ చేయవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది.

సహజంగానే బీజేపీ వైపు నుంచి విమర్శలు

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ నాయకత్వం, హిందూత్వ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ హిందూ సమాజాన్ని కులాలు, వర్గాల వారీగా విభజించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, ఇప్పుడు ఏకంగా దేవుళ్లను కూడా విభజించే స్థాయికి దిగజారిందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. రాముడు, శివుడు వేర్వేరు కాదు.. శివస్య హృదయం విష్ణుః, విష్ణుస్య హృదయం శివః  అనే భావన భారతీయ సనాతన ధర్మంలో ఉందనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ చేస్తున్నరాజకీయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే

 కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఈ శివుడు vs రాముడు  దాడి ఎడ్జ్ ఉన్న కత్తి లాంటిది. శూద్ర, బహుజన, పేద వర్గాలలో శివతత్వానికి ఉన్న ఆదరణను ఉపయోగించుకుని తమ వైపు తిప్పుకోవడం కాంగ్రెస్‌కు కొంత లాభిస్తుందని కొందరు భావిస్తుండగా, దేవుళ్ల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ మాట్లాడటం వల్ల కాంగ్రెస్ "యాంటీ-హిందూ" ముద్రను మరింత బలపరుచుకునే ప్రమాదం ఉందనే అభిప్రాయం కూడా ఉంది.  సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.  కాంగ్రెస్ పార్టీ గతంలోలాగా హిందూత్వ అంశాల నుంచి పారిపోకుండా, ప్రత్యక్షంగా బీజేపీ అజెండాను ఎదుర్కొనేందుకు ధర్మం, సాంప్రదాయాల్లోని అంతర్గత విభేదాలను ఆయుధంగా మార్చుకుంటోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana El Nino Water Crisis : ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Kadapa Polls: కడప జిల్లాలో ఏకగ్రీవాలతో కదిలిపోయిన వైఎస్ఆర్‌సీపీ పునాదులు - మేయర్‌గా గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపిస్తారా ?
కడప జిల్లాలో ఏకగ్రీవాలతో కదిలిపోయిన వైఎస్ఆర్‌సీపీ పునాదులు - మేయర్‌గా గెలిచి ప్రజలు తమవైపే ఉన్నారని నిరూపిస్తారా ?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Gottipati Ravi Kumar: అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను వేళ తెలంగాణ ప్రభుత్వ సాయం కోరిన ఏపీ మంత్రి గొట్టిపాటి
Arnab Effect On AP: ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
ఏపీపై విరుచుకుపడిన 'అర్నబ్‌' తుపాను... భారీగా చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. నిలిచిన రవాణా సేవలు
Flights Cancelled: శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయంపై అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీకి వెళ్లే పలు విమానాలు రద్దు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Telangana Drought Mandals: తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
తెలంగాణలో కరవు కోరలు.. 31 జిల్లాల్లో 365 మండలాల్లో తీవ్ర ప్రభావం.. రూ.20 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ కోసం అభ్యర్థన
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Embed widget