అన్వేషించండి

Ramachandrapuram constituency: రామచంద్రపురంలో ఈసారి పాగావేసేదెవరు..?

రామ‌చంద్ర‌పురంలో వైసీపీ త‌ర‌పున పిల్లి వార‌సుడు రంగంలో దిగ్గా టీడీపీ త‌ర‌పున ఇంకా సందిగ్ధ‌త వీడ‌డం లేదు. అయితే స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కోట‌గా ఉన్న ఇక్క‌డ‌ ఈసారి ఎవ‌రు పాగా వేస్తారో చూడాల్సి ఉంది.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రెండు ప్రధాన కులాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తున్నాయి.. పార్టీలు ఏవైనా కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల మధ్యనే పోటీగా ఇక్కడ పరిస్థితి మారుతుంటుంది.. ఈనేపథ్యంలోనే ఇక్కడ ఇంతవరకు నెగ్గిన నేతల సామాజికవర్గాలు ఇవే కులాలు కావడం గమనించదగ్గ విషయం కాగా రెండుసార్లు స్వతంత్రులుగా పోటీచేసి నెగ్గిన నేపథ్యం కూడా ఈ నియోజవర్గానికి ఉంది.. అయితే ఇక్కడ ఎప్పుడూ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మధ్య పోటీ రసవత్తరంగా సాగిన పరిస్థితి ఉండేది.. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా రాజోలు ప్రాంతానికి చెందిన మాజీ జడ్పీ ఛైర్మన్‌, ప్రస్తుత మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. టీడీపీ నుంచి పోటీచేసిన ప్రత్యర్ధి తోట త్రిమూర్తులు ఓటమి పాలయ్యారు. అయితే తర్వాత  తోటు త్రిమూర్తులు వైసీపీలో చేరారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకే గూటికి చేరడంతో టీడీపీకు రామచంద్రపురంలో అభ్యర్ధే దొరకని పరిస్థితి ఎదురైంది.. 

తోటను మండపేటకు పంపిన వైసీపీ..
రామచంద్రపురం నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడంతో ఆయనకు వైసీపీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.. అయితే ఆయన 1994లో తొలిసారిగా స్వతంత్య్ర అభ్యర్ధిగా బరిలో దిగి విజయం సాధించారు. ఆ తరువాత తెలుగుదేశంలో చేరిన త్రిమూర్తులు 1999 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసిన సుభాష్‌ చంద్రబోస్‌ విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన సుభాష్‌ చంద్రబోస్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో రామచంద్రపురంలో ఉపఎన్నిక షురూ అయ్యింది.. 2012లో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ తరపున తోట త్రిమూర్తులు పోటీచేయగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన నూతన పార్టీ వైసీపీ తరపున పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీచేశారు. ఈ ఎన్నికలో 11,919ఓట్లు ఆధిక్యంతో తోట త్రిమూర్తులు గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పోటీచేయగా ప్రత్యర్ధిగా వైసీపీ తరపున పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పోటీచేశారు. మళ్లీ తోట త్రిమూర్తులు విజయకేతనం ఎగురవేశారు. 2019 ఎన్నికల్లో ఈసారి పిల్లి ను మండపేట పంపించిన వైసీపీ అధిష్టానం రామచంద్రపురంకు ఈసారి రాజోలుకు చెందిన మాజీ జడ్పీ ఛైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను బరిలో దింపింది. ఈ ఎన్నికల్లో వేణు 5168 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.. 

ఈసారి పిల్లి కుమారుడు బరిలో దింపిన వైసీపీ..
వైసీపీలో సీనియర్‌ నాయకుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌కు మంత్రి వేణుగోపాలకృష్ణకు మధ్య విభేధాలు తారాస్థాయికి రావడంతో ఒక దశలో పార్టీకు అవసరమైతే రాజినామా చేస్తానని పిల్లి హెచ్చరించారు. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన అధిష్టానం రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి కుమారుడు సూర్యప్రకాశ్‌ను నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించి మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కు పంపించింది.. ఇదిలా ఉంటే టీడీపీ తరపున శాసన మండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం ఇంచార్జ్‌గా ఉన్నప్పటికీ ఇక్కడ కొత్త అభ్యర్ధిని బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే శెట్టిబలిజ యూత్‌ ఫోర్స్‌ అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్‌చంద్రబోస్‌ను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
AP Employee Unions: ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
ఏపీ ఉద్యోగ సంఘాల సంచలన నిర్ణయం - పీఆర్‌సీ, ఐఆర్‌ కోసం పోరాటం.. కూటమి ప్రభుత్వానికి సవాలు!
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget