రాహుల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్దరణ, 4 నెలల తరువాత పార్లమెంట్ కు కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల విషయంలో విధించిన శిక్షపైస్టే విధించిన సుప్రీంకోర్టు..ఆయనను తిరిగిఎంపీగా కొనసాగనివ్వాలని సూచించింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. కొంతకాలం కిందట మోడీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో విధించిన శిక్ష పై స్టే విధించిన సుప్రీంకోర్టు...ఆయనను తిరిగి ఎంపీగా కొనసాగనివ్వాలని సూచించింది. దీంతో రాహుల్ నిషేదాన్ని లోక్ సభ రద్దు చేసింది. సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ పునరుద్దరించడంతో సుమారు 4 నెలల తరువాత రాహుత్ లోక్ సభకు వచ్చారు.
ఆయన పార్లమెంట్ ఆవరణలో అడుగుపెట్టిన తరువాత అక్కడ ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులు ఆర్పించారు. ఆయనను కాంగ్రెస్ నేతలతో పాటు, ప్రతిపక్షాల నేతలు కూడా సాదరంగా పార్లమెంట్ లోపలికి ఆహ్వానించారు. ఎంపీగా తిరిగి సభ్యత్వం రావడంతో రాహుల్ ట్వీట్టర్ బయోలో కూడా కొన్ని మార్పులు చేశారు.
రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం లభించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని సెలబ్రెట్ చేసుకున్నారు. ఖర్గే తన సహచర నేతలందరికీ స్వీట్లు పంచిపెట్టారు.
గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓ బహిరంగ సభలో మోడీ ఇంటి పేరు గురించి రాహుల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని గురించి గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశారు. దీంతో మార్చి 24న కోర్టు రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్షను కూడా విధించింది.
ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పై సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించారు. దీనికి సంబంధించి ఇటీవల రెండేళ్ల జైలు శిక్ష పై సుప్రీం కోర్టు స్టే విధించడంతో రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్.. సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంతో రాహుల్ పార్లమెంటులో అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే పార్లమెంట్ కు వచ్చిన రాహుల్ కు మద్దతుగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమి సభ్యులు కూడా పెద్దగా రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. సుప్రీం స్టే విధించిన సంగతి తెలిసిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధరీ స్వీట్లు తినిపించుకున్నారు.
మార్చి 24 వ తేదీన వయనాడ్ ఎంపీగా ఉన్న ట్విటర్ బయోను డిస్‌క్వాలిఫైడ్ ఎంపీగా మార్చారు. తాజాగా తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంతో మరోసారి మార్పు చేశారు. నిన్నటి వరకు డిస్ క్వాలిఫైడ్ ఎంపీగా ఉన్న తన బయోను ఈరోజు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా మార్చుకున్నారు.
వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి మణిపూర్ అంశంపై వాయిదాలతోనే పార్లమెంటు సభలు నడుస్తుండగా.. తాజాగా విపక్షాల నిరసనలతో లోక్‌సభ మరోసారి వాయిదా పడింది. రాహుల్ లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నిండింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని సెలబ్రెట్ చేసుకున్నారు.