అన్వేషించండి

AP BJP : సీటు మార్పిడి కోసం టీడీపీతో రూ. 3 కోట్ల బేరం - ఆదోనీ బీజేపీ నేత ఆడియో కలకలం !

Andhra News : సీట్ల పంపకాల్లో కొందరు బేరాలు ఆడటం బీజేపీకి తలనొప్పిగా మారింది. ఆదోని సీటు వదులుకుంటాం.. మూడు కోట్లు ఇవ్వాలంటూ ఓ బీజేపీ నేత బేరం పెట్టడం కలకలం రేపుతోంది.

Three Crores For Seat Giveup :   ఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3 కోట్లు డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నాయకుడు మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే  మీనాక్షి నాయుడు ప్రస్తుతం టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఆయన అక్కడ్నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే ఆ సీటును బీజేపీ కోరుతోంది. ఇంకా ఫైనల్ కాలేదు. ఆదోని లేదా ఆలూరు సీట్లలో ఏదో ఒకటి తీసుకోవాలని తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో  ఆదోని  సీటు వదులు కావాలంటే  3 కోట్ల రూపాయలు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. 

బీజేపీలో సైతం కలకలం రేపుతున్న ఈ ఆడియో సంభాషణ  బీజేపీ నాయకుడు అయిన కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కునుగిరి నీలకంఠ సోదరుడు నాగరాజు , టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మేనల్లుడు మధ్య  జరిగింది. ఎవరు లీక్ చేశారో కానీ.. ఈ వ్యవహారం అటు ఆదోనిలో.. ఇటు ఆలూరులోనూ కలకలం రేపుతోంది. ఈ అంశంలో పురందేశ్వరిని కూడా తీసుకు రావడంపై.. బీజేపీ అగ్రనేతలు సైతం ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ కి కేటాయించిన సీట్ల విషయంలో అభ్యర్థుల మధ్య పోటీ ఉందనుకుంటే.. ఇలా సీట్లు వదిలేస్తాం డబ్బులు ఇవ్వాంటూ టీడీపీ నేతలతో కొంత మంది బీజేపీ నేతలు బేరాలాడటం సంచలనంగా మారింది. 
 
విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కాలేదు.  పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు.  సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ  చేయాల్సి వచ్చినప్పుడు... పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లభిస్తోంది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో  పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.  

బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు.  పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న  పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా  హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. అందుకే కీలక సమావేశాలకు దూరం పెడుతున్నారు.                                

రూ. మూడు కోట్ల బేరం ఆడియో విషయంలో..  లోతుగా పరిశీలిస్తే.. సంచలన విషయాలు బయట పడతాయని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు. పొత్తుల్లో భాగంగా పార్టీకి లభించిన టిక్కెట్ల విషయంలో.. అనేక తెర వెనుక రాజకీయాలు.. అక్రమాలు చోటు చేసుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు.                 

టాప్ హెడ్ లైన్స్

Jharkhand Rajya Sabha Elections 2026: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా - రేసులోకి విజయసాయిరెడ్డి -ఆ ‘ఆరు’ ఓట్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ చదరంగం!
Congress North vs South Strategy: రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
రేవంత్ దక్షిణాదివాదం - ఉత్తరాదిన కాంగ్రెస్‌కు ఇబ్బంది కాదా?
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?
కర్ణాటకం ముగిసింది.. ఇక తెలంగాణ కేబినెట్ పంచాయతీ - మార్పు చేర్పుల సిగ్నల్ రేవంత్‌కు అందిందా?

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Steel Plant Fire Accident: వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం - ద్రవ ఉక్కు ఒలికి భారీగా ఎగసిపడిన మంటలు - భారీ ప్రాణనష్టం?
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Chandrababu Naidu Siddhantam tour: 1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
1500 కోట్ల భూ కబ్జా కేసులో అరెస్టయిన లీడర్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు - వైసీపీపై చంద్రబాబు విమర్శలు
Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?
టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget