అన్వేషించండి

Jana Sena Decision Making: రామ్ తాళ్లూరి, నాదెండ్లపై సోషల్ మీడియాలో జనసైనికుల నెగెటివ్ ప్రచారం - చార్జ్ తీసుకున్న పవన్ - ఇక విమర్శలు వస్తాయా?

Jana Sena : జనసేనలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాదెండ్ల , రామ్ తాళ్లూరిలపై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో సీట్ల సర్దుబాటు, పార్టీ బాధ్యతలను సొంతంగా చూసుకుంటున్నారు.

Jana Sena Cadre Social Media Trolling:  జనసేన పార్టీలో నాయకత్వ నిర్మాణం, నిర్ణయాధికారంపై ఒక ఆసక్తికరమైన రాజకీయ చర్చ నడుస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ భావజాలం, ప్రభుత్వ పర్యవేక్షణ, ఉపముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో బిజీగా ఉంటే.. పార్టీ సంస్థాగత వ్యవహారాలు, స్థానిక సమస్యలను చక్కబెట్టే బాధ్యతలను పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన రామ్ తాళ్లూరి వంటి నాయకులకు అప్పగించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఈ  సెకండ్ లైన్ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రామ్ తాళ్లూరి, నాదెండ్ల మనోహరే ..సోషల్ మీడియా జనసైనికల టార్గెట్ 

పార్టీ తరఫున నిర్ణయాలు తీసుకోగానే, సోషల్ మీడియాలో ముఖ్యంగా జనసేన సానుభూతిపరులు, వీరాభిమానుల నుంచే వీరిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతుంటాయి.  పార్టీని వీరే నియంత్రిస్తున్నారు.. తమ సొంత అజెండాతో స్థానిక సంస్థలు , నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ నిర్ణయాలను తప్పుదారి పట్టిస్తున్నారు అని క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల సర్దుబాటు విషయంలో వీరి ప్రమేయం వల్ల తమకు అవకాశాలు దక్కవని లోకల్ లీడర్లు భయాందోళన చెందడంతో పాటు,  సగానికి పైగా సీట్లలో పోటీ చేయకుండా వీళ్లే వ్యూహాత్మకంగా కుట్ర చేస్తున్నారని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆరోపిస్తున్నారు.  ఈ సోషల్ మీడియా ట్రోలింగ్,  తీవ్ర విమర్శల ప్రభావంతో నాదెండ్ల మనోహర్, రామ్ తాళ్లూరి వంటి అగ్రనేతలు ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకోలేక వెనకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ తమ అంతర్గత నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం వాటిల్లితే, ఆ నిందను మోయాల్సి వస్తుందనే ముందస్తు ఆందోళన వారిని ఆత్మరక్షణలో పడేసింది. పార్టీలో క్షేత్రస్థాయి నిర్ణయాలు తీసుకోవాల్సిన ద్వితీయ శ్రేణి నాయకత్వం స్తంభించిపోవడంతో, పార్టీ నిర్ణయాధికార ప్రక్రియలో ఒక రకమైన శూన్యత ఏర్పడింది.

బాధ్యతలు తీసుకున్న జనసేనాని          

ఫలితంగా, మరో మార్గం లేక జనసేనాని పవన్ కళ్యాణే మళ్లీ స్వయంగా రంగంలోకి దిగక తప్పలేదు. కూటమిలో సీట్ల సర్దుబాటు, స్థానిక సంస్థల ఎన్నికల ప్రణాళిక, కమిటీల నియామకం వంటి కీలక అంశాలను పవన్ తన సొంత చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ అధినేతగా, అపారమైన ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను ప్రత్యక్షంగా స్వీకరించడంతో పార్టీ కమాండ్ స్ట్రక్చర్‌లో మళ్లీ స్పష్టత వచ్చింది. పవన్ కళ్యాణ్ నేరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల పార్టీకి ఒక పెద్ద పొలిటికల్ అడ్వాంటేజ్ లభించింది. ఇప్పటివరకు నాదెండ్ల ,  రామ్ తాళ్లూరిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన వారు, ఇప్పుడు విమర్శించాలంటే నేరుగా అధినేత పవన్ కళ్యాణ్‌పైనే బాణాలు గురిపెట్టాల్సి ఉంటుంది. జనసేన సిద్ధాంతాల ప్రకారం పవన్ నిర్ణయాన్ని ప్రశ్నించే వారు లేదా బహిరంగంగా విమర్శించే వారు ఖచ్చితంగా జనసేన సానుభూతిపరులు కారు  అనే స్పష్టమైన సంకేతం క్యాడర్‌లోకి వెళ్లింది.

ఏ నిర్ణయమైనా విమర్శిస్తే వారు జనసైనికులు కానట్లే

ఈ పరిణామం ద్వారా పార్టీలో అంతర్గత క్రమశిక్షణ దారిలోకి వచ్చింది.   పవన్ కళ్యాణ్ తీసుకునే సీట్ల సర్దుబాటు లేదా ఇతర రాజకీయ నిర్ణయాలను సానుభూతిపరులు, వీరాభిమానులు ,  క్యాడర్ తిరుగులేకుండా ఆమోదించాల్సిందేననే వాతావరణం నెలకొంది. అయితే, ప్రజాదరణ పొందిన నాయకుడిపైనే మొత్తం పార్టీ భారమంతా పడే అత్యధిక కేంద్రీకృత నాయకత్వం  జనసేనలో ఎక్కువ కాలం కొనసాగితే సంస్థాగత బలోపేతానికి అది సవాలుగా మారే అవకాశాలు ఉన్నాయి. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
Tamil Nadu CM Vijay TVK MLAs Controversy: సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
సీఎం విజయ్‌కు సొంత ఎమ్మెల్యేల సెగ - 108 మ్యాజిక్ ఫిగర్ భయంతో కన్ఫెషన్ రూమ్ వ్యూహం - పట్టు కోల్పోయారా?
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
ప్రయాణికులకు TGSRTC బంపర్ ఆఫర్.. బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల రాయితీలు
Vizag CII Summit: రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
రెండో రోజు సైతం ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.1.41 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Matt Henry Sixer: కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
కివీస్ చేతిలో టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. రెండో అతిపెద్ద ఓట‌మి.. హెన్రీ సిక్స‌ర్ తో గర్జ‌న‌
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
Telangana Congress: భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
భారత్ సమ్మిట్ ప్రతినిధుల వీసాల రద్దు అప్రజాస్వామికం: కేంద్రంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫైర్
KFC and Dominos Outlets: ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హైదరాబాద్‌లో కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్‌లెట్స్ క్లోజ్ చేయాలని ఆదేశాలు
Embed widget