అన్వేషించండి

Pithapuram Politics : పవన్ పోటీ చేయకపోతే నేనే - పిఠాపురంలో మళ్లీ వర్మ రచ్చ !

Andhra Politics : పిఠాపురం పోటీ విషయంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు మిస్ ఫైర్ అవుతున్నాయి. తాజాగా పవన్ వ్యాఖ్యలపై టీడీపీ ఇంచార్జ్ వర్మ భిన్నంగా స్పందించారు.

Pawan Kalyan : పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అమిత్ షా అడిగితే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పవన్ అన్నారు. అప్పుడు పిఠాపురంలో తనకు బదులుగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారన్నారు. ఈ వ్యాఖ్యలపై  పీఠపురం సీటుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ  భిన్నంగా స్పందించారు. ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆయన స్థానంలో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశానని వెల్లడించారు. 

పవన్ తప్ప ఎవరు పోటీ చేసినా బరిలో ఉంటా : వర్మ

పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన తరపున పిఠాపురం నుంచి వేరే వారు పోటీ చేస్తే తాను కూడా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.  పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుంచి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే తాను తప్పుకుండా పొత్తులో భాగంగా పిఠిపురం స్థానంలో పోటి చేస్తానని వెల్లడించారు. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. దాదాపు 20 సంవత్సరాలగా టీడీపీకోసం పనిచేస్తున్నాని తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా తన స్థానాన్ని జనసేన కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఎంతో బాధతో తన స్థానాన్ని వదులుకున్నానన్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయానికి తాను కృషి చేస్తానని తెలిపారు. 

తన కోసం ఉదయ్ శ్రీనివాస్ సీటు త్యాగం చేశారన్న పవన్ 

మంగళవారం తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడీయా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, కాకినాడ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దలు తనకి లోక్ సభ, శాసనసభ స్థానాల్లోనూ పోటీ చేయమన్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే తనకు మాత్రం శాసనసభకు పోటీ చేయడమే ఇష్టం అని తెలిపారు. దీని కారణంగానే తాను పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముందు రాష్ట్రానికి పని చేస్తానని తర్వాత దేశానికి పనిచేస్తానని పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు లోక్ సభకు పోటీ చేయాలని కోరితే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ తన స్థానంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు.

పవన్ వ్యాఖ్యలతో  గందరగోళం పెరుగుతోందా  ? 

పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం స్థానం నుంచి.. పార్టీ పెద్దల నిర్ణయిస్తే తనకు బదులుగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని తెలిపారు.   పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించికున్నాయి. వీరు ఇరువురు చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం పిఠాపురం స్థానంపై రాజకీయ వేడి మొదలైంది. పవన్ కోసమే తాను సీటు వదులుకున్నానని తన స్థానంలో వేరు వారు పోటీ చేస్తే మాత్రం తాను తప్పుకుండా పోటీకి సిద్ధమవుతానని వర్మ కుండబద్దలు కొట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget