అన్వేషించండి

AP Elections 2024: నెల్లూరు సిటీలో నారాయ‌ణ మంత్రం, ఈ సారైనా వ‌ర్క‌వుట్ అయ్యేనా?

నెల్లూరు సిటీ నుంచి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రోసారి మాజీ మంత్రి నారాయ‌ణ‌కు అవ‌కాశం ఇచ్చింది. దీంతో నారాయ‌ణ త‌న స‌తీమ‌ణిని రంగంలోకి దింపి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.

AP Elections: ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు అధికార పార్టీ వైసీపీ(YSRCP), ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ(TDP)ల‌కు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన విష‌యం తెలిసిందే. `వైనాట్ 175` నినాదంతో వైసీపీ, వైనాట్ పులివెందుల‌? నినాదంతో టీడీపీ దూసుకుపోతున్నాయి. ఈ క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎంపిక చేస్తున్న అభ్య‌ర్థుల విష‌యంలోనూ అంతే జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా(Nellore District)కు సంబంధించిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నెల్లూరు సిటీ. ఈ టికెట్‌ను మాజీ మంత్రి, కాపు నాయ‌కుడు, నారాయ‌ణ విద్యాసంస్థ‌ల అధినేత పొంగూ రు నారాయ‌ణకు ఇస్తున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు తెలిపాయి. 

టికెట్‌పై గ్రీన్ సిగ్న‌ల్‌ 
వాస్త‌వానికి ఇప్ప‌టికే ఆయ‌న నెల్లూరు(Nellore city) నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. తాజాగా రెండు రోజుల కింద‌ట జ‌రిగిన చ‌ర్చ‌ల్లో చంద్ర‌బాబు(Chandrababu)... మాజీ మంత్రి నారాయ‌ణ‌(Ex minister Narayana)కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాల‌ని.. గెలిచిన త‌ర్వాతే రావాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేసిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజయం ద‌క్కించుకుని తీరాల‌న్న సంక‌ల్పంతో నారాయ‌ణ ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే ప‌క్కా ప్లాన్‌తో రెడీ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. నారాయ‌ణ‌ స‌తీమ‌ణి ర‌మాదేవి ఇప్ప‌టికే రంగంలోకి దిగారు.  

గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి 
గ‌త 2019 ఎన్నిక‌ల్లో నారాయ‌ణ నెల్లూరు సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయ‌న‌కు ఇదే స్థానాన్ని ఇవ్వ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌న్న‌ది పార్టీ వ‌ర్గాల అభిప్రాయం. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో నెల్లూరు న‌గ‌రంలో చేసిన అభివృద్ధి ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తుంద‌ని అంటున్నారు. దీనికి తోడు.. నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు ఉండ‌డం.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌న్న సానుభూతి కూడా తోడ‌వ‌డంతో  నారాయణ గెలుపు ఖాయ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. 

అనిల్ మార్పుతో.. 
గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి తొలిసారి పోటీ చేసిన మాజీ మంత్రి నారాయ‌ణ‌(అప్ప‌ట్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు).. స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ పోలుబోయిన అనిల్ కుమార్ యాద‌వ్(Poliboina Anilkumar yadav) వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఈ ద‌ఫా మాత్రం అనిల్‌ను ఇక్క‌డ నుంచి గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ఎంపీ అభ్య‌ర్థిగా వైసీపీ పంపించింది. దీంతో నారాయ‌ణ‌పై ఎవ‌రు పోటీ చేస్తార‌నేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో త‌న ఓట‌మి నుంచి గెలుపు కోసం ప‌క్కా వ్యూహంతో ముందుకు సాగాల‌ని.. ఎవ‌రు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ.. గెలుపు గుర్రం ఎక్కాల‌ని నారాయ‌ణ భావిస్తున్నారు.

మిత్ర‌ప‌క్షం క‌లిసి రానుందా! 
2019 ఎన్నిక‌ల్లో పొంగూరు నారాయ‌ణ‌కు 71 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి ఇక‌, ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌కు 74 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. అంటే.. ఇద్ద‌రి మ‌ధ్య ఓట్ల తేడా కేవ‌లం 3 వేలు మాత్ర‌మే. అది కూడా.. ఇక్క‌డ ముక్కోణ‌పు పోటీ జ‌రిగింది. అప్ప‌ట్లో జ‌న‌సేన త‌ర‌పున కేతంరెడ్డి వినోద్(Kethamreddy Vinod) పోటీ చేశారు. ఈయ‌న‌కు 8 వేల పైచిలుకు ఓట్లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌న‌సేన‌-టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌డంతో ఓట్లు చీలే అవ‌కాశం లేదు.

ఇంటింటి ప్ర‌చారం.. 
మ‌రోవైపు.. త‌న‌కు ప్ర‌తికూలంగా ఉన్న మండ‌లాల‌పై నారాయ‌ణ  దృష్టి పెట్టారు. ఈ మండ‌లాల్లో టీడీపీ సానుభూతిపరులు, కేడ‌ర్‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నారు.  పార్టీని గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం వివ‌రిస్తు న్నారు. ఇక‌, ఆయ‌న సతీమ‌ణి(Wife).. ర‌మాదేవి(Ramadevi).. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌తో సంబంధం లేకుండా ఇప్ప‌టికే.. ఇంటింటి ప్ర‌చారంచేస్తున్నారు. మ‌హిళ‌ల‌కు బొట్టు పెట్టి మ‌రీ.. త‌న భ‌ర్త‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు. ఇది వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని పార్టీ అంచ‌నా వేస్తోంది.  వీటికితోడు పొత్తు కూడా క‌లిసి వ‌చ్చి.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నారాయ‌ణ గెలుపు త‌థ్య‌మ‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే.. నారాయ‌ణ‌ను ఓడించి తీరుతామ‌ని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెబుతున్న వైసీపీ పెద్ద‌లు ఎలాంటి నేత‌ను నిల‌బెడ‌తాయో చూడాలి. ఈ క్ర‌మంలో నారాయ‌ణ మంత్రం ఏమేర‌కు ఫ‌లిస్తుందో తేలాలంటే.. ఎన్నిక‌ల వ‌ర‌కు వెయిట్ చేయాలి. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
Dalit Christian Vote Bank Politics: వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?
వైసీపీ ఓటు బ్యాంక్‌పైనే గురి పెట్టిన జడ శ్రవణ్ - ఉపముఖ్యమంత్రి పోస్టుకు కర్చీఫ్ - పెద్ద ప్లానే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradeep Constructions Somajiguda : నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
నిర్మాణం పూర్తయిన భవనానికి అనుమతుల రద్దు - సోమాజిగూడలో ప్రముఖ రియల్ఎస్టేట్ కంపెనీకి షాక్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
2026 Renault Kwidలో ఏ వేరియంట్‌ కొనడం తెలివైన నిర్ణయం - ధరలు, ఫీచర్లపై అనాలసిస్‌
2026 Renault Kwid - ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ఏ వేరియంట్ బెస్ట్ ఛాయిస్‌? పూర్తి విశ్లేషణ
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Black Thread: చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
చేతికి, కాలికి నల్లదానం ఎందుకు? ఆధ్యాత్మిక రహస్యం & సైన్స్ ఏం చెబుతున్నాయ్?
Embed widget