అన్వేషించండి

Roja on Brahmani: అవినీతిపరుడికి మద్దతుగా మోత మోగించాలా ఇదెక్కడి విడ్డూరం- బ్రాహ్మణికి రోజా కౌంటర్

నారా బ్రాహ్మణికి మరోసారి కౌంటర్‌ ఇచ్చారు మంత్రి రోజా. మోత మోగిద్దాం అనే కార్యక్రమంపై సెటైర్‌ వేశారు. చంద్రబాబు అడ్డగోడులా అవినీతి మేత మేస్తే.. మీరు మోత మోగిస్తారా అంటూ ప్రశ్నించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌ అయినప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ నిరసన కార్యక్రమాలు తెలుపుతూనే ఉంది. ఇందులో భాగంగా... మోత మోగిద్దాం  అంటూ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది టీడీపీ. చంద్రబాబుకు మద్దతుగా.. ఇవాళ రాత్రి 7గంటల నుంచి 7గంటల 5నిమిషాల వరకు ఉన్నచోటే శబ్ధం చేస్తూ... మోత  మోగించాలని పిలుపునిచ్చింది. మోత మోగిద్దాం అనే పోస్టర్‌ను ట్విటర్ వేదికగా విడుదల చేశారు నారా లోకేష్‌, బ్రాహ్మణి దంపతులు. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడ ఉన్నా...  బయటకు వచ్చి గంట లేదా ప్లేట్‌పై గరిటెతో కొట్టండి అని సూచించారు. లేదా విజిల్ వేస్తూ సౌండ్‌ చేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. దీనికి  సంబంధించి వీడియో తీసి.. మోత మోగిద్దాం పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ప్యాలెస్‌లో ఉన్న జగన్‌కు వినిపించేలా మోత మోగిద్దాం  అంటూ పిలుపునిచ్చారు.

టీడీపీ మోత మోగిద్దాం ప్రోగ్రామ్‌పై మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌లో ప్రజాసొమ్ము దోచేసి జైలుకు వెళ్లారని.. అలాంటి అవినీతిపరుడి కోసం  ప్రజల మద్దతును కోరడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మీ మామ అడ్డగోలుగా అవినీతి మేత మేసి జైలుకి వెళ్తే మీరేమో ఆ అవినీతిపరుడుకి మద్దతుగా ప్రజలను మోత  మోగించమంటారా..? ఇదెక్కడి విడ్డురం? అంటూ ప్రశ్నించారు. మీ మామ చేసిన మోసానికి.. 2019 ఎన్నికల్లోనే ప్రజలు మోతమోగించారంటూ ట్వీట్‌ చేశారు రోజా. 23 సీట్లతో చంద్రబాబును ఇంటికి పంపారన్నారు. ఇక.. మీ భర్త నారా లోకేష్‌కి మంగళగిరిలో ఎలా మోత మోగించి ఓడించారో గుర్తులేదా..? అని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు. మీ మామ చంద్రబాబు అన్ని రాష్ట్రాల మేనిఫెస్టోలను కాపీ కొడితే.. నువ్వు, నీ భర్త ముద్రగడ గారి పోరాటాన్ని కాపీ కొట్టి.. పళ్లాలు, ప్లేట్లు కొట్టమంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు రోజా. మీ ఫామిలీ అంతా కాపీ కొట్టడమేనా..? అంటూ ప్రశ్నించారు. నీ మామపై ప్రపంచం బెంగ పెట్టుకుందని మీరంతా భ్రమల్లో ఉన్నట్లున్నారు... కానీ నారాకాసురుడు ఇన్నాళ్లకు దొరికాడని ప్రజలంతా ముందుగానే దీపావళి చేసుకుంటున్నారని సెటైర్‌ వేశారు రోజా. 

బకాసురుడిలా ప్రజల సొమ్మును దోచేసిన నీ మామ నారా చంద్రబాబు నాయుడిని కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో పెడితే ఆయనకు మద్దతుగా ఆందోళన చేస్తావా నారా బ్రాహ్మిణి అంటూ ప్రశ్నించారు. అంటే మీరు కోర్టులకంటే గొప్పోల్లా..? న్యాయవ్యవస్థ కంటే అతీతులా..?  కోర్టుల నిర్ణయాలకు వ్యతిరేకం అవుతుందన్న జ్ఞానం లేదా..? అంటూ ట్విట్టర్‌ వేదిగా ఘాటుగా ప్రశ్నించారు మంత్రి రోజా. #TDPGoons అనే హాష్ ట్యాగ్‌ను కూడా ఈ ట్వీట్‌కు జత చేశారు రోజా.

టాప్ హెడ్ లైన్స్

UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Bharat Summit Controversy: హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
N Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హౌస్ అరెస్ట్.. తెలంగాణలో రాజ్యాంగం అమలుపై ప్రశ్నలు 
Cricketer Suicide: ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
ప్రేమ పేరుతో వేధింపులు.. అండర్ 19 క్రికెటర్ ఆత్మహత్య- వికారాబాద్‌లో ఘటన
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Hyundai Grand i10 Nios కొనే ప్లాన్‌లో ఉన్నారా? ముందు ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి
హ్యుందాయ్‌ i10 నియోస్‌ కొనవచ్చా, వద్దా? 3 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు
Gurnoor Brar News: టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాలో అనూహ్య మార్పులు.. స్పిన్నర్ కుల్దీప్ అవుట్ , పేసర్ బ్రార్‌కు పిలుపు, వెల్లింగ్టన్ చేరుకున్న పంత్
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Embed widget