AP Political News : ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షాలేనా ? మమతా బెనర్జీ ఎవర్నీ ఎందుకు ఆహ్వానించలేదు ?
ఏపీలో రాజకీయ పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షాలేనని మమతా బెనర్జీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహిస్తున్న సమావేశానికి ఏపీ నుంచి ఎవర్నీ ఆహ్వానించలేదు.
![AP Political News : ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షాలేనా ? మమతా బెనర్జీ ఎవర్నీ ఎందుకు ఆహ్వానించలేదు ? Mamata Banerjee seems to think that not all political parties in the AP are BJP allies. DNN AP Political News : ఏపీ రాజకీయ పార్టీలన్నీ బీజేపీ మిత్రపక్షాలేనా ? మమతా బెనర్జీ ఎవర్నీ ఎందుకు ఆహ్వానించలేదు ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/15/0b32d1f8920ae64a3f98e774b3c83324_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AP Political News : రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని విపక్ష పార్టీలు ఢిల్లీలో సమావేశం అవుతున్నాయి. మమతా బెనర్జీ బీజేపీయేతర ముఖ్యమంత్రులకు.. ఇతర ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాశారు. స్వయంగా ఫోన్లు చేసి ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. అయితే ఆయన వెళ్తున్నారా లేదా అన్నది తర్వాతి విషయం కానీ ఏపీ పార్టీలను అసలు మమతా బెనర్జీ పరిగణనలోకి తీసుకోలేదు. ఏపీలో ఉన్న అన్ని పార్టిలు కూడ బీజేపికి దగ్గరగా ఉన్నాయనే భావన లో మమత ఉన్నట్లుగా భావిస్తున్నారు.
బీజేపీ మిత్రపక్షంగానే వైఎస్ఆర్‌సీపీని పరిగణిస్తున్న మమతా బెనర్జీ !
రాష్ట్ర పతి ఎన్నిక పై చర్చించేందుకు దేశ వ్యాప్తంగా బీజేపి ఎతర పార్టిలను కలుపుకునేందుకు మమత ప్రయత్నాలు చేశారు..ఇందులో భాగంగా సమావేశం ఏర్పాటు చేశారు.అయితే ఈ సమావేశానికి ఎపీలోని వైఎస్ఆర్‌సీపీ , టీడీపీ , జనసేన పార్టిలను మమత బృందం అసలు పట్టించుకోలేదు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉండటమే కాకుండా అత్యధిక ఎంపీ పదవులను దక్కించుకుంది. దీంతో రాష్ట్రపతి ఎన్నికలో వైఎస్ఆర్‌సీపీ ఓట్లు కీలకంగా మారాయి. అయినప్పటికీ మమతా బెనర్జీ ఆ పార్టీని పరిగణనలోకి తీసుకోలేదు. బీజేపీ మిత్రపక్షంగానే నిర్ణయించుకుంది.
టీడీపీకి ఓటింగ్ బలం పరిమితం - తటస్థంగా ఉండేందుకు ప్రయత్నం
ఇక ప్రదాన ప్రతిపక్షం టీడీపికి కూడ మమత నుండి కనీసం ఆహ్వనం కూడ రాలేదు.ఇప్పటికే చంద్రబాబు జిల్లాల పర్యటన టూర్ షెడ్యూల్ ను ఖరారు చేసుకొని, విశాఖ పర్యటలో బిజిగా ఉన్నారు . దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో అవసరం అయినప్పుడు తన పాత్ర,ప్రమేయం ఉంటుందని చంద్రబాబు బహిరంగ వేదికల్లో చాలా సార్లు ప్రకటనలు చేశారు. అయితే ఈ సారి మాత్రం బీజేపికి దగ్గరగా ఉంటున్ననేపద్యంలో బాబు కూడ సైలెంట్ అయిపోయారని ప్రచారం జరుగుతుంది. పైగా ఓటింగ్ పరంగా చూసినా టీడీపీకి అతి తక్కువ ఓట్లు మాత్రమే ఉన్నాయి. 23 మంది ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడితో కలుపుకుని నలుగురు ఎంపీల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మాత్రం ప్రభావ ంచూపేవి కావు. అందుకే టీడీపీ తాము తటస్దంగా ఉన్నామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఓటింగ్ బలం లేని జనసేననూ పట్టించుకోని మమతా బెనర్జీ
ఇప్పటికే జనసేన బీజేపితో దోస్తీ కట్టి ముందుకు వెళుతుంది.వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పని చేయాలని నిర్ణయించినట్లుగా ఇరు పార్టిల నేతలు ప్రకటించారు. జనసేనకు కూడా ఓటింగ్ బలం లేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీలో అనధికారికంగా చేరిపోయిన ఆ ఎమ్మెల్యే కూడా పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా ఓటు వేస్తారో లేదో తెలియదు. అందుకే మమతా బెనర్జీ జనసేన పార్టీని కూడా పరిగణనలోకి తీుకోలేదని తెలుస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)