News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Singareni Political : ఇక సింగరేణి సమరం ! కేంద్రమంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ - మండి పడిన బీజేపీ !

సింగరేణి ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కేటీఆర్ కేంద్రమంత్రికి ఘాటు లేఖ రాశారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు.

FOLLOW US: 

భారతీయ జనతా పార్టీపై టీఆర్ఎస్ సింగరేణి విషయంలో మరో యుద్ధం ప్రకటించింది. సింగ‌రేణి సంస్థను ప్రయివేటీక‌ర‌ణ చేసేందుకు కేంద్రం కుట్ర‌లు చేస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అలాంటి ఆలోచన చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కేటీఆర్ ఘాటైన లేఖ రాశారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని మంత్రి కేటిఆర్ హెచ్చరించారు.

బొగ్గు గనుల వేలం ఆపాలి ! :  కేటీఆర్ 

సింగరేణిలో ఉన్న జెబిఅర్ఒసి -3, కేకే -6, శ్రవనపల్లీ ఓసీ, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించలేదు. వేలం వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అవుతుందన్నారు. ఈ మేరకు సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్ధ ఇవ్వని విధంగా 29 శాతం లాభాల్లో వాటను ఇస్తున్న ఏకైక సంస్ధ సింగరేణి అని కేటీఆర్ తెలిపారు. లాభాల బాటలో అద్భుతమైన ప్రగతిపథంలో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చి అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రను కేంద్రంలోని బీజేపీ అమలు చేస్తోందని కేటీఆర్ లేఖలో ఆరోపించారు.  

కోల్ మైన్ కాదు గోల్డ్ మైన్ ! ! :  కేటీఆర్ 
 
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కావల్సిన ఐరన్ ఓర్ గనులు ఇవ్వకుండా నష్టాలకు గురిచేసిన కేంద్రం దాన్ని ప్రయివేటీకరించేందుకు రంగం సిద్దం చేసిందన్నారు.  ఇలాంటి కుట్రలనే సింగరేణిపై ప్రయోగించేందుకు రంగం సిద్దం చేస్తున్నదని అందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే గోల్డ్ మైన్ అని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు.  నాలుగు బ్లాకులు మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్ లో వేలం వేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తక్షణం వేలం ఆపాలన్నారు. 

దమ్ముంటే సింగరేణిపై శ్వేతపత్రం ఇవ్వాలి : బీజేపీ 

కేటీఆర్ లేఖపై బీజేపీ మంండిపడింది. చిత్తశుద్ధి ఉంటే సింగరేణిపై శ్వేత పత్రం విడుదల చేసి..  సింగరేణి పరిస్థితి, అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. రూ.20 వేల కోట్లను దారి మళ్లించి సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తున్నారని ఆరోపించారు. త్వరలో సింగరేణి ఎన్నికలు రాబోతుండటంతోనే టీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల వేలంపై సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తన్నారని  బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ విమర్శించారు. లాభాల్లో ఉన్న సంస్థను దివాళా తీయించి జీతాల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే స్థితికి సింగరేణిని చేర్చిన విషయం నిజం కాదా అని బీజేపీ ప్రశ్నించారు.  టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు సంస్థలో 62 వేల మంది కార్మికులుంటే... అందులో 22 వేల ఉద్యోగాలను కోత విధించి.... కేవలం 40 వేల మంది కార్మికులకే పరిమితం చేశారన్నారు.  బొగ్గు గనుల వేలం అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ అని గతంలో ఒరిస్సాలోని 9 బ్లాకులను తెలంగాణ తీసుకుందని గుర్తు చేశారు. 

Published at : 07 Feb 2022 07:10 PM (IST) Tags: telangana minister ktr KTR mining Singareni Privatization Union Minister Prahlad Joshi

సంబంధిత కథనాలు

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Desh Ki Neta : దేశ్‌ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !

Desh Ki Neta :  దేశ్‌ కీ నేత రేసులో కేజ్రీవాల్ - దేశవ్యాప్తంగా పర్యటనలకు రెడీ !

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !

Vijayashanti: పార్టీలో ప్రాధాన్యం లేదు - బీజేపీ నేతల తీరుపై విజయశాంతి అసంతృప్తి !

టాప్ స్టోరీస్

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

Amazon Tiktok: యూట్యూబ్‌కు షార్ట్స్, ఇన్‌స్టా‌కు రీల్స్ - మరి అమెజాన్‌కి? - సూపర్ ఫీచర్ టెస్ట్ చేస్తున్న కంపెనీ!

Amazon Tiktok: యూట్యూబ్‌కు షార్ట్స్, ఇన్‌స్టా‌కు రీల్స్ - మరి అమెజాన్‌కి? - సూపర్ ఫీచర్ టెస్ట్ చేస్తున్న కంపెనీ!