అన్వేషించండి

Konda Surekha BC Card: బీసీ కార్డ్‌తో కొండా సురేఖ ఎదురుదాడి - సీఎం రేవంత్ చర్యలు తీసుకోగలరా!?

Konda Surekha Cabinet Removal Threats: కొండా సురేఖ తనపై చర్యలు తీసుకోకుండా బీసీ కార్డు ప్రయోగిస్తున్నారు. రేవంత్ ఆమెపై చర్యలు తీసుకునేలా పార్టీని ఒప్పించగలరా?

Telangana Politics BC Politics Congress:  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ,  ఆమె కుటుంబ వ్యవహార శైలిపై మొదలైన వివాదం ఇప్పుడు అత్యంత సున్నితమైన సామాజిక, బీసీ సమీకరణాల మలుపు తీసుకుంది. తన కుమార్తె కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ కేటాయింపులపై చేసిన ఆరోపణల తర్వాత, తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సురేఖ.. తనకు ఉన్న ఏకైక ,  బలమైన బీసీ కార్డ్ ను బయటకు తీశారు. క్యాబినెట్‌లోని సీనియర్ బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనపై 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దాడి చేయించడాన్ని బీసీల వేధింపుగా చిత్రీకరించే ప్రయత్నం సురేఖ చేస్తున్నారు.  కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సురేఖ  అంటున్నారు. అంతటితో ఆగకుండా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ జెండా మోసిన తమ కుటుంబాన్ని, ఓట్ల శాతం ఎక్కువగా ఉన్న బీసీ వర్గాన్ని తగ్గించేందుకే ఈ కుట్ర జరుగుతోందనే సంకేతాలను కేడర్‌లోకి పంపేలా ఈ వ్యూహం ఉంది.
 
కొండా సురేఖను కాపాడే పరిస్థితి లేదన్న పీసీసీ చీఫ్ 

పిల్లలు చేసిన వ్యాఖ్యలకు తల్లిగా నన్ను టార్గెట్ చేయడం బీసీ నాయకత్వాన్ని అణచివేసే కుట్రలో భాగమే  అన్న సంకేతాలు ఇవ్వడమే కొండా దంపతుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ బీసీ సెంటిమెంట్ అస్త్రం కొండా సురేఖను పదవి నుంచి కాపాడగలదా అంటే.. ప్రస్తుతానికి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈసారి కొండా సురేఖను కాపాడే పరిస్థితి లేదు, సీఎంపై వ్యాఖ్యలు పార్టీ లైన్ దాటాయి  అని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడే ఈ రకమైన తీవ్రమైన వ్యాఖ్య చేయడం ద్వారా, అధిష్టానం ఇప్పటికే కొండా సురేఖ విషయంలో ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చిందని స్పష్టమవుతోంది.

పార్టీ క్రమశిక్షణ అంశంగా మార్చిన సీఎం రేవంత్

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని కేవలం వ్యక్తిగత విమర్శగా చూడకుండా పార్టీ క్రమశిక్షణ  సమస్యగా మార్చడంలో విజయవంతమయ్యారు. ప్రెస్మీట్‌లో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు . పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు. రేవంత్ సోదరుడి భూములపై సుస్మిత నేరుగా దాడి చేయడం వల్ల, సురేఖకు కేబినెట్‌లో కొనసాగే అర్హత లేదని రేవంత్ అనుకూల ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రెస్మీట్ పెట్టారు.  పైగా, కాంగ్రెస్ హైకమాండ్ ,  ఏఐసీసీ కూడా ప్రభుత్వం సుస్థిరంగా సాగాలంటే సీఎం ప్రాధాన్యతకే మొగ్గు చూపుతాయని చెప్పాల్సిన పని లేదు. 

హైకమాండ్‌కు క్షమాపణలు చెప్పి వివాదాన్ని ముగిస్తారా?

కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమీకరణాలు  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీల ప్రాతినిధ్యం,  సమాన అవకాశాలను  కాపాడటానికి మహేశ్ కుమార్ గౌడ్  ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. అందువల్ల సురేఖను కేబినెట్ నుంచి తప్పించినా, అది  కాంగ్రెస్ మొత్తం బీసీలకు వ్యతిరేకం  అనే ముద్ర పడకుండా అధిష్టానం కవర్ చేసుకోగలదు. కొండా సురేఖ బీసీ కార్డును ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ, పార్టీ డిసిప్లినరీ కమిటీ తుది నివేదిక వచ్చాక ఎఐసిసి ఇచ్చే ఆదేశాలే ఆమె రాజకీయాన్ని తేలుస్తాయి.  కొండా సురేఖకు మిగిలిన ఏకైక మార్గం.. తన కుమార్తె వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, పీసీసీ,  సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పడం లేదా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండటం. లేనిపక్షంలో, బీసీ సెంటిమెంట్ ఎంత పండించినప్పటికీ.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ నాయకత్వం ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించి, పార్టీపరంగా సైడ్ చేయడమే తదుపరి పరిణామంగా మారబోతోంది.

 

టాప్ హెడ్ లైన్స్

Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
Harish Rao vs YS Jagan: పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ లిఫ్ట్ వివాదంతో రచ్చ! - తమ గొప్పతనం కోసం బీఆర్ఎస్ నేతలు జగన్‌ను కించపరుస్తున్నారా?
పల్నాడు వాటర్ గ్రిడ్, రాయలసీమ లిఫ్ట్ వివాదంతో రచ్చ! - తమ గొప్పతనం కోసం బీఆర్ఎస్ నేతలు జగన్‌ను కించపరుస్తున్నారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget