అన్వేషించండి

What Next Komatireddy : కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు ? సోనియా చెబితే తమ్ముడ్ని ఓడిస్తారా ?

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోనియా అపాయింట్‌మెంట్ అడిగారు. బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో సోనియా చెబితే తమ్ముడ్ని ఓడించేందుకు ప్రయత్నిస్తారా?


What Next Komatireddy :  తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రాను రాను పీట ముడి పడుతోంది. నల్లగొండ జిల్లా సీనియర్ నేతగా మునుగోడు ఉపఎన్నిక బాధ్యత ఆయన తీసుకోవాల్సి ఉంది. కానీ అక్కడ సోదరుడు రాజగోపాల్ రెడ్డినే బీజేపీ తరపున పోటీ చేస్తూండటం ఇప్పుడు వెంకటరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఆయన కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ అంటే తాను.. తానంటే కాంగ్రెస్ అని ఆయన చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని కారణంగా చూపిస్తూ తాను మునుగోడు బాధ్యతలు తీసుకోనని చెబుతున్నారు.త అయితే రేవంత్ రెడ్డి ఆయన అడిగినట్లుగా క్షమాపణలు చెప్పారు. అయినా కోమటిరెడ్డి తగ్గలేదు. సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ అడిగినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి 

ముందు నుంచీ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడిన వెంకటరెడ్డి .. అది రేవంత్ రెడ్డికి లభించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. తర్వాత సర్దుకున్నారు. కానీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సోదరుడిని పల్లెత్తు మాట అనడం లేదు కానీ పీసీసీ చీఫ్‌ను మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తనను బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తున్నారని.. రాహుల్, సోనియా వద్దే తేల్చుకుంటానని చెబుతున్నారు. మునుగోడులో తాను ప్రచారం చేయబోనని.. తనను ఎవరూ పిలవలేదని అంటున్నారు. అయితే తాజాగా ఆయన వ్యక్తిగతంగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో పర్యటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి అనుచరులే ఉన్నారు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనపై అసహనం కనిపిస్తోంది. 

వెంకటరెడ్డికి సపోర్టుగా సీనియర్లు 

అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మాజీ ఎంపీ వీహెచ్ .. మునుగోడు బాధ్యతలను కోమటిరెడ్డికే అప్పగించాలని అంటున్నారు. కోమటిరెడ్డికి నల్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉందని.. మునుగోడులో ఆయనకే బాధ్యతలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తెస్తారని అంటున్నారు. నిజానికి గతంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు.. ఉపఎన్నిక వస్తే అభ్యర్థికి కోమటిరెడ్డి వెంకటరెడ్డినే ఖరారు చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత వెంకటరెడ్డి పూర్తిగా సైడ్ కావడంతో ఈ చర్చ ముందుకు సాగలేదు. 

సోనియా చెబితే తమ్ముడ్ని ఓడిస్తారా ?

సోనియా అపాయింట్‌మెంట్‌ను అడిగినట్లుగా కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఈ ప్రకారం.. సోనియా సమయం ఇస్తే ఆయన వెళ్లి కలిసే అవకాశం ఉంది. పార్టీ అధినేతగా సోనియా.. మునుగోడులో పార్టీని గెలిపించమనే సూచిస్తారు. స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చినందున యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కోరుతారు. మరి వెంకటరెడ్డి తన అసంతృప్తిని తొలగించుకుని రంగంలోకి దిగుతారా ? పార్టీని గెలిపిస్తారా ? తమ్ముడ్ని ఓడిస్తారా ?  అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget