komatireddy Venkatreddy : పార్టీ మారి ఉంటే మంత్రయ్యేవాడిని - కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు!
టీఆర్ఎస్‌లో చేరి ఉంటే మంత్రి అయి ఉండేవాడినని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నార్కట్ పల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తాను టీఆర్ఎస్‌లో చేరి ఉంటే మంత్రయ్యే వాడినని ప్రకటించుకున్నారు. భువనగిరి ఎంపీగా ఉన్న ఆయన నార్కట్‌పల్లిలో కొన్ని అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో పాల్గొన్నారు . ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ ఇప్పటికీ టీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయలేదన్నారు. తనపై కక్షతోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. తాను టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉంటే ప్రాజెక్ట్ పూర్తయ్యేది.. తనకు మంత్రి పదవి వచ్చేదన్నారు. కానీ తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకోవాలనే తాను పార్టీ మారలేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే చర్చను రేకెత్తిస్తున్నాయి.
తెలంగాణ పీఠం దక్కే వరకూ దండయాత్ర - బీజేపీ రాజకీయ వ్యూహం స్ట్రెయిట్ అండ్ స్ట్రైక్ !
కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి యాక్టివ్‌గా రాజకీయాల్లో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో ఆయనకే తెలియనట్లుగా ఉంటారు. ఏ సమావేశానికీ వెళ్లరు. ఈ ఇద్దరు సోదరులు 2018లో ముందస్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేసీఆర్ తర్వాత వారిని చేర్చుకునే విషయంలో ఆసక్తి చూపించలేదని చెప్పుకున్నారు. బహుశా ఆ సమయంలోనే కోమటిరెడడి చెబుతున్న సంప్రదింపులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు.
సీఎం చేసేవి చిల్లర గేమ్స్, సర్వేలో ఎంత మందిని అడిగిండో తెల్వదు, మైండ్ బ్లాక్ అవుడు ఖాయం:RS ప్రవీణ్
ఆ తర్వాత రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనూ ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. తరచూ కేంద్ర మంత్రుల్ని కలుస్తూండటంతో బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఆ వార్తలను ఖండించారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చింది. దీంతో ఆయన సర్దుకుపోయారని కాంగ్రెస్‌లో చెబుతున్నారు. కానీ అప్పుడప్పుడూ ఆయన అసంతృప్తి బయటకు వినిపిస్తూనే ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి .. రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారం చేస్తానంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీనే క్లీన్ స్వీప్ చేస్తుందన్నరు. అంత వరకూ బాగానే ఉన్నా పార్టీ మార్పుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్‌లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి.