అన్వేషించండి

Komatireddy Venkat Reddy: కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ- కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్ నేతలు, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు పంచులకొద్ది పంచులు పేలుస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికార పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలోని కూర్గ్‌లో జరుగుతున్న బొగ్గు గనులు, ఉక్కు ఆధారిత పరిశోధన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ స్టడీ టూర్‌లో కోమటిరెడ్డి మాట్లాడారు.  సూర్యాపేట సభలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కోమటి రెడ్డి స్పందిస్తూ.. 50 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందో సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్‌ పార్టీ నుంచేనని, కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. 

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మించింది కాంగ్రెస్‌ హయాంలోనే అని కేసీఆర్‌కు తెలియదా అని ఎద్దేవా చేశారు. శ్రీశైలం, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ లాంటి ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ అభివృద్ధి కోసం కోట్లాడింది తామేనని, ఎస్ఎల్‌బీసీని కేసీఆర్ అటకెక్కించారని కోమటిరెడ్డి విమర్శించారు. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు వచ్చాయన్నారు. 1వ తేదీన పెన్షన్‌లు ఇచ్చామని, కేసీఆర్‌లాగా 15వ తేదీన ఇవ్వలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 

బీఆర్‌ఎస్ మొదటి విడత అభ్యర్థుల జాబితాపై వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్‌ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు.. ఎమ్మెల్యేలు కాకముందు ఎంత, అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలు సేకరించి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాలని కార్యకర్తలు, ఉద్యమకారులు, నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉచిత కరెంటును వ్యతిరేకించిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో మొదటి సారి ఉచిత విద్యుత్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 

టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు ఇదే కేసీఆర్ చంద్రబాబుతో కలిసి ఉచిత విద్యుత్‌పై జోకులు వేశారని, కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ బకాయిలు, రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే అయ్యాయన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చేసిన ఘనత కాంగ్రెస్‌దే అన్నారు. డబ్బుల కోసం మద్యం టెండర్లు మూడు నెలల ముందే వేశారని మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తుందన్నారు. 

సూర్యాపేట జిల్లాలో జరిగిన ప్రగతి నివేదన సభలో సీఎం చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏంచేసిందని ప్రశ్నించారు. మరరోసారి కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సీఎం కేసీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
తమిళ తంబీల రాజకీయంలో నోట్ల రచ్చ - విజయ్ ప్రభుత్వాన్ని కూల్చాలని డీఎంకే అప్పుడే ఫిక్సయిందా?
Kavitha Vs KTR: కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
కవిత పోరాటాలతో కేటీఆర్‌కు చిక్కులు - రోడ్డెక్కి చేసే రాజకీయాలు ఎప్పటి నుండి ?
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget