By: ABP Desam | Updated at : 16 Mar 2022 01:47 PM (IST)
కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ బాట పడుతున్నారా ?
కోమటిరెడ్డి సోదరుల రాజకీయ అడుగులు మరోసారి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరూ కలిసి ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. గతంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగినా ఎప్పటికప్పుడు అవి ప్రచారంగానే ఉండిపోయాయి. అయితే మరోసారి అలాంటి ప్రచారం ప్రారంభమయింది. దీనికి కారణం వారి వ్యవహారశైలే అనుకోవచ్చు. సోదరులిద్దరూ ఒకరు ఎంపీ.. మరొకరు ఎమ్మెల్యే.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మూడు రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. టీఆర్ఎస్ సర్కార్ తీరుపై ఆయన ఫిర్యాదు చేసినట్లుగా చెప్పుకున్నారు. ప్రధానమంత్రి తనను బాగా రిసీవ్ చేసుకున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై చెప్పిన విషయాలకు ఆశ్చర్యపోయారన్నారు. కోమటిరెడ్డికి ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ లభించడం వెనుక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. కోమటిరెడ్డిని బీజేపీకి దగ్గర చేసే ప్రయత్నంలో కిషన్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ వివేక్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని డిఫెండ్ చేసేలా వాదన వినిపించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరంగా చేయడం లేదని.. కానీ తెలంగాణ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వాదించారు. ఈ అంశంపై టీఆర్ఎస్ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు తేడాగా ఉండటంతో తర్వాత టీఆర్ఎస్ సభ్యులతో జరిగిన వాదనల్లో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడలేదు.
నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికి అనేక సార్లు బహిరంగంగా తాను బీజేపీలో చేరుతానని ప్రకటించారు. గత ఎన్నికల తర్వాత ఆయన బీజేపీ కండువా కప్పుకోవడానికి ఢిల్లీ కూడా వెళ్లారు. కానీ ఆయన మరీ ఎక్కువ ప్రాధాన్యం ఆశిస్తున్నారని.. అది సాధ్యం కాదని హైకమాండ్ చెప్పడంతో ఆగిపోయారు. తర్వాత కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ప్రకటన చేస్తున్నారు. త్వరలో బీజేపీలో చేరుతానని ప్రకటించేశారు. ఇటీవల నాగార్జున సాగర్ ఉపఎన్నికలు జరిగినప్పుడు ఆయన సతీమణిని అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం జరిగింది. కానీ ఆగిపోయారు.
కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ చీఫ్ పోస్టు అశించిన వెంకటరెడ్డి.. అది రేవంత్ రెడ్డికి దక్కడంతో అనేక ఆరోపణలుచేశారు. పీసీసీ చీఫ్ పోస్ట్ అమ్ముకున్నారన్నారు. తర్వాత సైలెంటయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కలిసిపోతున్నట్లుగా కొన్ని సూచనలు ఇచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డిని తన ఇంటికి కూడా ఆహ్వానించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి ఆలోచనలు మార్చుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరి వీరు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Breaking News Live Updates : మాజీ ఎంపీ రేణుక చౌదరి పై కేసు నమోదు!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్ డీల్
Minister Harish Rao : కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో మంత్రి హరీశ్ రావు, డబ్బులడిగిన డాక్టర్ పై వేటు!