అన్వేషించండి

KCR National Politics Third Front Entry : కేసీఆర్ మిషన్ ఢిల్లీ - థర్డ్ ఫ్రంట్ దిశగా కదలికలు - కేటీఆర్ హింట్ ఇచ్చేశారా?

BRS Third Front: కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని కేటీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్,కాంగ్రెస్ లేని కూటమిని ఏర్పాటు చేసేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

BRS Third Front Non Congress Non BJP Coalition:  భారత రాష్ట్ర సమితి  అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారి, ఢిల్లీ పీఠాన్ని శాసించే స్థాయిలో రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపాయి. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట్ నియోజకవర్గ నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బలహీనపడుతోందని, అటు ప్రతిపక్ష కాంగ్రెస్ వైఫల్యాల వల్ల దేశంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తుల   అవసరం త్వరలోనే పరాకాష్టకు చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణ రాష్ట్రాానికే పరిమితం కాకుండా, జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో కేసీఆర్ మళ్లీ కీలకపాత్ర పోషిస్తారని స్పష్టం చేయడం గులాబీ శ్రేణుల్లో నయా ఉత్సాహాన్ని నింపింది.

 కేసీఆర్ అసలు వ్యూహం ఏమిటి? 

కేటీఆర్ వ్యాఖ్యల కోసం థర్డ్ ఫ్రంట్ కోసం తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది.  2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి రావడం, మరోవైపు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా  కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడుతుండటం వంటి పరిణామాలను బీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ నాయకత్వం వైఫల్యం చెందిందని భావిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలకు బలమైన, అనుభవజ్ఞుడైన ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరంగా మారింది. ఈ ఖాళీని భర్తీ చేయడానికే కేసీఆర్ జాతీయ వేదికపై నాన్-కాంగ్రెస్, నాన్-బీజేపీ ఫ్రంట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చే వ్యూహంతో ఉన్నారని తెలుస్తోంది.

కేసీఆర్ ఇమేజ్ నేషనల్ వైడ్ అని చెప్పే ఉ్దదేశం

  కేటీఆర్ చేసిన ఈ  నేషనల్ పొలిటికల్స్ వ్యాఖ్యలు కేవలం జాతీయ స్థాయి కోసమే కాకుండా, తెలంగాణ స్థానిక రాజకీయాలకు కూడా ముడిపడి ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి, అనంతరం పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో తీవ్ర నైరాశ్యంలో ఉన్న బీఆర్ఎస్ కేడర్‌ను తిరిగి సమీకరించడానికి ఇది ఒక బలమైన ఆత్మవిశ్వాస అస్త్రంగా ఉపయోగపడుతుంది. త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల సమరంలో శ్రేణులను క్రియాశీలంగా ఉంచేందుకు కేసీఆర్ జాతీయ రీ-ఎంట్రీ,  మళ్లీ కేసీఆరే సీఎం అవుతారు అనే ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా వాడుకుంటోంది.

కొన్ని పార్టీలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారా? 

 ఢిల్లీ పీఠాన్ని ప్రభావితం చేసే సత్తా ఉన్న తతంగం కోసం కేసీఆర్ ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీఎస్, బిజూ జనతాదళ్ , వైఎస్ఆర్‌సీపీ వంటి ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, నిధుల పంపిణీలో రాష్ట్రాలపై జరుగుతున్న వివక్షను ప్రధాన అస్త్రంగా చేసుకుని, ప్రాంతీయ ఆత్మగౌరవ నినాదంతో ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు  తెరవెనుక నెట్‌వర్కింగ్  వేగవంతమైందనే అభిప్రాయాలు ఉన్నాయి.  

తేలికగా తీసుకుంటున్న కాంగ్రెస్ నేతలు

 తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి, అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న బీఆర్ఎస్ నేతలు ప్రజల దృష్టిని మరల్చడానికే జాతీయ రాజకీయాలంటూ కొత్త నాటకాలాడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. బిఆర్ఎస్ ఉనికికే ముప్పు ఏర్పడిన తరుణంలో జాతీయ స్థాయిలో మూడో కూటమిని నిర్మించడం సాధ్యపడదని, గతంలో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినా దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని ప్రత్యర్థులు గుర్తుచేస్తున్నారు.   కేసీఆర్ జాతీయ రీ-ఎంట్రీ ప్రకటన వెనుక అటు జాతీయ స్థాయిలో మారిన రాజకీయ సమీకరణాలను పసిగట్టడమే కాకుండా, ఇటు తెలంగాణలో రాబోయే ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే ద్విముఖ వ్యూహం ఉంది. రాబోయే రోజుల్లో కేసీఆర్ నేరుగా ఢిల్లీ పర్యటనలు చేపట్టి ఇతర ప్రాంతీయ నేతలతో సమావేశమవుతారా లేక కేవలం తెలంగాణ సభలకే పరిమితమవుతారా అనేది తేలితేనే ఈ  థర్డ్ ఫ్రంట్  వ్యూహం ఎంతవరకు కార్యరూపం దాలుస్తుందో స్పష్టత రానుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Bharat Summit Controversy: హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
Sharmila Meets Chandrababu: తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
తన కుమార్తె వివాహానికి ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించిన వైఎస్‌ షర్మిల
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget