అన్వేషించండి

Only KTR : పాలనా వైఫల్యాలకు కేటీఆర్ ఒక్కరే బాధ్యులా ? ఎందుకిలా జరుగుతోంది ?

తెలంగాణలో పాలనా వైఫల్యాలకు కేటీఆర్ మాత్రమే కారణమా ?కేటీఆర్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?అన్ని బాధ్యతలను చూడటమే కేటీఆర్‌కు ఇబ్బందిగా మారిందా ?

 

Only KTR :    తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి తప్పు జరిగినా ముందు అందరూ మంత్రి కేటీఆర్‌ను విమర్శిస్తున్నారు.  ఆయనకు ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. దానికి తాజాగా ఉాదాహరణ టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారం. నేరుగా కేటీఆర్ ను టార్గెట్ చేశాయి విపక్షాలు.  ఐటీ మంత్రిని అయినంత మాత్రాన కంప్యూటర్లు మొత్తం తన చేతిలో ఉంటాయా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్నారని వంద కోట్ల పరువు నష్టం దావాకు లీగల్ నోటీసులు కూడా పంపారు. అయితే ఒక్క పేపర్ లీకేజీ కేసు మాత్రమే కాదు దాదాపు ప్రతి విషయంలోనూ కేటీఆర్‌నే టార్గెట్ చేస్తున్నారు విపక్ష నేతలు. 

ప్రతీ విషయంలోనూ కేటీఆరే టార్గెట్ !

డ్రగ్స్ కేసులో ఏదైనా జరిగితే ముందుగా కేటీఆర్‌ను విమర్శిస్తారు. ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కేటీఆరే టార్గెట్ అవుతారు. ధరణి వ్యవస్థ లో వెలుగు చూస్తున్న లోపాలకూ కేటీఆరే కారణమని ఆయన భూదందాలకు పాల్పడ్డారని అంటారు. ఇలా ప్రతీ శాఖలో ఏదైనా లోపం జరిగితే కేటీఆర్‌పైనే ప్రధానంగా ఆరోపణలు గుప్పిస్తారు కానీ ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి జోలికి మాత్రం ప్రతిపక్ష పార్టీలు వెళ్లవు.  ఇదంతా చాలా కాలంగా జరుగుతోంది. నిజానికి ఇలాంటివి జరిగినప్పుడు కేటీఆర్ కూడా తనకేం సంబంధం ఫలానా శాఖ మంత్రి ఉన్నారు కదా అని అనరు ఆయనే బాధ్యత తీసుకుంటారు ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తారు. ప్రభుత్వం అంతా మంచిగా చేసిందని విపక్షాలే ఆరోపణలు చేస్తున్నాయని చెబుతూ ఉంటారు. దీంతో తప్పు జరిగిదే ఆయనదే బాధ్యత అని విమర్శించే వారి సంఖ్య పెరిగిపోతోంది.

అన్ని శాఖల బాధ్యతలూ అనధికారికంగా  చూస్తున్నందుకేనా ? 

జనమే  కాదు విపక్షాలు కూడా ఆయనను కేవలం ఆయనకు కేటాయించిన శాఖల మంత్రిగానే చూడటం లేదు. కేటీఆర్ ఇప్పుడు సకల శాఖల మంత్రి అన్ని శాఖలనూ ఆయనే సూపర్ వైజ్ చేస్తూంటారని నమ్ముతుంటూరాు. అందుకే ఎక్కడ ఏం జరిగినా ఆయననే విపక్షాలు గురి పెడుతున్నాయి. పాలనా వ్యవహారాలన్నీ ఇప్పటికే కేటీఆర్ చూస్తున్నారని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చురుగ్గా పర్యటిస్తున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోడ్ల ఓపెనింగ్ అయినా తానే వెళ్తారు. శంకుస్థాపనలు అయినా తానే వెళ్తారు. విద్యా శాఖ ఒప్పందాలకైనా తానే వెళ్తారు. అబ్కారీ శాఖ కీలక సమీక్షలూ తానే చేస్తారు. అయితే ఆయన ఆయన శాఖలకు మంత్రి కాదు కానీ ఎవరూ అభ్యంతరం చెప్పరు  ఇదంతా రొటీనే కదా అనుకుంటున్నారు. అందుకే ఆరోపణలు కూడా ఆయన మీదనే వస్తున్నాయి. ఓ రకంగా హరీష్ రావు నిర్వహించే శాఖలు తప్ప మిగతావన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తాయి ఆయన ఆదేశాల ప్రకారమే పని చేస్తాయి. ఆయా శాఖల మంత్రులు ప్రత్యేకంగా సమీక్షలు చేసే సందర్బాలు తక్కువని అటున్నారు. 

కేటీఆర్ కూడా తనకేం సంబంధం లేదనడం లేదు..  బాధ్యత తీసుకుంటున్నారు ! 

 ఇతర శాఖల విషయంలో జోక్యం విషయంలో  తనపై ఆరోపణలు వస్తే కేటీఆర్ తేలిగ్గా తీసుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో పవర్ ఫుల్ మినిస్టర్‌గా బాధ్యత తీసుకుంటున్నారు. ఏదో ఓ సందర్భంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి కేటీఆర్‌కు బాధ్యతలివ్వబోతున్నారని ప్రచారం జరుగుతూనే ఉంది.   కేటీఆర్ కూడా అందుకు మానసికంగా రెడీ అయినట్లుగా   ఆరోపణలకు సమాధానం ఇస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance Rift: పంచాయతీ ఎన్నికల్లో జనసేన స్వేచ్ఛాపోరాటం.. ఆదినారాయణ రెడ్డి రాజీనామా అల్టిమేటం.. స్థానిక ఎన్నికలు కూటమిలో చిచ్చు పెట్టాయా?
పంచాయతీ ఎన్నికల్లో జనసేన స్వేచ్ఛాపోరాటం.. ఆదినారాయణ రెడ్డి రాజీనామా అల్టిమేటం.. స్థానిక ఎన్నికలు కూటమిలో చిచ్చు పెట్టాయా?
TDP Local Body Elections: టీడీపీ స్థానిక ఎన్నికల టికెట్లలో యువగళం లెక్కలివే.. యువనాయకత్వం అంటే రాజకీయ వారసులేనా?
టీడీపీ స్థానిక ఎన్నికల టికెట్లలో యువగళం లెక్కలివే.. యువనాయకత్వం అంటే రాజకీయ వారసులేనా?
Telangana Congress: పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
పాత సుభాషితాలతో కట్టుతప్పిన కాంగ్రెస్ దారిలోకి వస్తుందా? కొత్త ఇన్‌ఛార్జి బీఎం సందీప్ ముందున్న అసలు సవాల్ ఇదే!
Jagan Sharmila Property Dispute: కుటుంబ కలహాలతో జగన్ రాజకీయ ప్రతిష్టకు గండి.. కోర్టు కేసుల కంటే సామరస్య పరిష్కారమే మేలు - అయినా ఎందుకిలా?
కుటుంబ కలహాలతో జగన్ రాజకీయ ప్రతిష్టకు గండి.. కోర్టు కేసుల కంటే సామరస్య పరిష్కారమే మేలు - అయినా ఎందుకిలా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
HIV Myths vs Facts : దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
దోమ కుట్టినా, కౌగిలించుకున్నా, ఒకే గ్లాసులో నీళ్లు తాగినా HIV వస్తాదా? వీటిలో అపోహలు ఏవి? నిజమెంత?
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Embed widget