News
News
X

Vizag YSRCP : విశాఖ వైఎస్ఆర్సీపీలో "భూ లకటక " - రాజ్యసభ, లోక్‌సభ ఎంపీల మధ్య రాజకీయంలో నలిగిపోతున్న అధికార పార్టీ !

విశాఖలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన రాజ్యసభ, లోక్ సభ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరి భూ

FOLLOW US: 
 


Vizag YSRCP :   ఓ వైపు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ..గర్జనలు నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు మరో వైపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ నేతల్ని అయోమయానికి చేసింది. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, లోక్ సభ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మధ్య పార్టీలో ఇంత కాలం ఉన్న అంతర్గత కలహాలు ఇప్పుడు ఒక్క సారిగా బయటపడ్డాయి. ఇరువురూ మీడియా ఎదుట ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారు. దీంతో విశాఖ వైఎస్ఆర్‌పీసీలో కలకలం బయలుదేరింది. 

విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంవీవీ సత్యనారాయణ 

దసపల్లా భూముల వ్యవహారం, విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె కలిసి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంపై గత వారం రోజులుగా విస్తృతమైన చర్చ  జరుగుతోంది. దీనికి వివరణ ఇచ్చే సమయంలో విజయసాయిరెడ్డి .. కూర్మన్న పాలెంలో ఓ బిల్డర్ భూయజమానికి కేవలం ఒక్క శాతమే ఇచ్చి..99 శాతం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ..దాని గురించి మీడియా ఎందుకు ప్రశ్నించదన్నారు. ఆ బిల్డర్ ఎవరో కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణే.  దాంతో ఆయన  వ్యవహారంపైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎంవీవీ సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. 

తనపై ఆరోపణలు చేసే ముందు విజయసాయి నిజాయితీని నిరూపించుకోవాలన్న  సత్యనారాయణ !

News Reels

ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో  విశాఖ ఎంపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గూండాగిరి చేసి విజయసాయిరెడ్డి భూములు రాయించుకుటున్నారని ఆరోపించారు. ఆ విషయం అందరికీ తెలుసన్నారు. తనపై చేసిన ఆరోపణలు తప్పన్నారు. భూములు కొనాలనుకున్న వారి ఆస్తులపై దాడి చేయడం.. వారి భూములను 22ఏలో పెట్టడం.. తర్వాత భూములు రాయించుకుని తీసేయడం వంటివి చేశారన్నారు. ఒక్క శాతం మాత్రమే ల్యాండ్ ఓనర్లకు ఇచ్చి..తాను 99 శాతం తీసుకుంటూ నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గురించి కూడా మాట్లాడారు. అది తాను రాజకీయాల్లోకి రాక ముందు 2017లో సెటిలైపోయిన విషయం అన్నారు. లోక్ అదాలత్‌లో ఆ విషయం తెలిందన్నారు. ఇప్పుడు దానిపై విజయసాయిరెడ్డి రచ్చచేయడం రాజకీయమేనని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేశారని.. ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిందేమిటని ప్రశ్నించారు. తాను ప్రైవేటు భూముల్లో .. ఆ యజమానులతో ఒప్పందం చేసుకున్నానని ప్రభుత్వ భూములతో కాదని.. స్పష్టం చేశారు.  దసపల్లా భూములు ప్రభుత్వానివేనని.. వాటిని విజయసాయిరెడ్డి కొట్టేశారన్నట్లుగా పరోక్షంగా ఎంపీ చెబుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణల నుంచి విజయసాయిరెడ్డి నిజాయితీగా బయటకు రావాలన్నారు. ఎంవీవీ సత్యనారాయణ స్పందన .. నేరుగా విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేయడంతో విభేదాలు రోడ్డున పడినట్లయ్యాయి. 

వైఎస్ఆర్‌సీపీ ఉత్తారంధ్ర ఇంచార్జ్‌గా తప్పించినా విశాఖలోనే విజయసాయి మకాం !

వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. విజయసాయిరెడ్డిని తప్పించారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ మాత్రమే. ప్రత్యేకమైన ప్రాంతం ఉండదు. కానీ ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీ. పార్టీ పరంగా కానీ సాంకేతికంగా కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి విశాఖతో సంబంధంలేదు. కానీ ఆయన ప్రభుత్వ విధఆన నిర్ణయాలపై మాట్లాడుతున్నారు. దీనిపై వైఎస్ఆర్‌సీపీలోనే విస్మయం వ్యక్తవుతోంది. ఆయనను విశాఖ నుంచి తప్పించినా మొండిగా అక్కడే తన కార్యక్షేత్రం అని అంటున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి ఇతర వైఎస్ఆర్‌సీపీ నేతలకు పెద్దగా సరిపడేది కాదు.అందుకే ఈ భూ వివాదాల్లో కూడా ఆయనకు మద్దతుగా ముందుకు వచ్చి మాట్లాడేవారు లేరు. 

కొసమెరుపేమిటంటే తనపై ఆరోపణలు చేస్తున్న మీడియాకు వ్యతిరేకంగా మీడియాను.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఎంపీకి వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్‌ను విజయసాయిరెడ్డి ప్రారంభిస్తామని  ప్రకటించారు. ఆయన కావాలనుంటే సొంత పార్టీ కూడా పెట్టుకోవచ్చని..ఎంపీ సత్యనారాయణ సలహా ఇస్తున్నారు. 
 

Published at : 13 Oct 2022 02:03 PM (IST) Tags: YSRCP Visakha Rajya Sabha MP Vijayasai Reddy Lok Sabha MP Satyanarayana

సంబంధిత కథనాలు

నెక్స్ట్‌ ఏంటి? సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత సమావేశం!

నెక్స్ట్‌ ఏంటి? సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్సీ కవిత సమావేశం!

Delhi Liquor Scam: ఆ ముగ్గుర్ని వదిలి కవితను ఎందుకు టార్గెట్‌ చేశారు?

Delhi Liquor Scam: ఆ ముగ్గుర్ని వదిలి కవితను ఎందుకు టార్గెట్‌ చేశారు?

Two States Poitics : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక ! "దత్తత" రాజకీయం వర్కవుట్ అవుతోందా ?

Two States Poitics  : ఏపీలో దత్తపుత్రుడు - తెలంగాణలో దత్తపుత్రిక !

AP Politics : ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

AP Politics :  ఏపీలో మొదలైన 'కాపు' రాజకీయం, ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న పార్టీలు!

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Gujarat Elections: ప్రచార సభలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఒవైసీ - వైరల్ వీడియో

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

Zero Cost Term Insurance: డబ్బు ఖర్చు లేకుండా బీమా- కట్టిన ప్రీమియాన్ని తిరిగిచ్చే 'జీరో కాస్ట్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌'

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు