By: ABP Desam | Updated at : 23 Feb 2023 05:59 AM (IST)
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే భుజం కాస్తానంటున్న వంశీ - ఈ సంకేతాల వెనుక ఉన్న పాలిటిక్స్ ఏమిటి ?
Kodali, Vamsi And Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భుజం కాస్తామని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియా ఇంటర్యూల్లో ప్రకటించడం సంచలనంగా మారుతోంది. వైఎస్ఆర్‌సీపీలో ఉండి.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భజం కాస్తామని చెప్పడం అంటే.. ప్రస్తుతం ఉన్న పార్టీపై పెద్దగా ఆసక్తిగా లేరని పరోక్షంగా చెప్పడమేనని అంటున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వల్లభనేని వంశీ పదే పదే ఎందుకు తెస్తున్నారన్న సందేహాలు కూడా వస్తున్నాయి. గతంలో జూనియర్ ఎన్టీఆర్‌తో వల్లభనేని వంశీ, కొడాలి నాని నిర్మాతలుగా సినిమాలు తీశారు.కానీ ఇప్పుడు ఆ సంబంధాలు ఉన్నాయా లేవా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ మధ్య కాలంలో పరస్పరం ఎదురుపడినట్లుగా కూడా వార్తలు రాలేదు. దీంతో వల్లభనేని వంశీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్‌ను వంశీ ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు !
గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఈ విషయాన్ని ఆయనే మీడియాతో కూడా చెప్పుకున్నారు. ఈ దాడికి కారణం ఏమిటన్నదానిపై తనపై నిందలు వేస్తున్నారని చెబుతున్నారు. అయితే టాపిక్‌ను సందర్భం లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు తీసుకెళ్లారు. అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం అయ్యారని.. కానీ చంద్రబాబుకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వంశీ చెబుతున్నారు. అయితే ఇవన్నీ గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి కారణం కాదు.. కానీ ఉద్దేశపూర్కంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనను మీడియా ఇంటర్యూల్లో తీసుకు వస్తున్నారు. ఇది కావాలనే చేస్తున్నారన్న అభిప్రాయం టీడీపీ వర్గీయుల్లో ఏర్పడుతోంది.
రాజకీయాలకూ దూరంగా జూనియర్ ఎన్టీఆర్ !
జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో తన కెరీర్ మీదనే దృష్టి పెట్టారు. ఇప్పటికైతే ఆయన రాజకీయాలపై కనీస ఆసక్తి కూడా చూపించడం లేదు. పొరపాటున కూడా వివాదాస్పదం అయ్యే కామెంట్లు చేయడంలేదు. తప్పనిసరిగా స్పందించాల్సిన వచ్చినప్పుడు కూడా చాలా పొలైట్‌గా స్పందిస్తున్నారు. ఈ విషయంలో తనపై కొంత మంది విమర్శలు చేస్తున్నా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ కు వెళ్లింది. ఆయనతో పని చేసేందుకు కొన్ని హాలీవుడ్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. తన కెరీర్‌లో ఉన్న స్థానానికి .. గ్లోబల్ స్టార్‌గా ఎదిగే అవకాశం వచ్చిన సమయంలో ఆయన రాజకీయాలపై ఆసక్తి చూపిస్తారని అభిమానులు కూడా అనుకోవడం లేదు.
వంశీ, కొడాలి నాని .. జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహాన్ని వాడుకుని టీడీపీని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా ?
గతంలో వంశీ, నాని జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితులన్నది అందరికీ తెలిసిన విషయం. అందుకే వారు మాట్లాడితే మీడియాలో ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌తో తమకు ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన ప్రమేయం లేకుండా.. టీడీపీకి లింక్ పెట్టి ఇలాంటి కామెంట్లు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే..తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఎప్పుడూ ఉన్నతమైన స్థానం రెడీగా ఉంటుందని టీడీపీ క్యాడర్ గుర్తు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఇబ్బంది పెట్టి అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసం తరచూ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతోనే టీడీపీలో టిక్కెట్లు ఇప్పించుకుని ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముందుగా కొడాలి నాని పార్టీ మారారు. చాలా కాలం పాటు టీడీపీకి విధేయంగానే ఉండి.. గత ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైన తర్వాత వంశీ పార్టీ మారారు. అప్పట్నుంచి టీడీపీపై.. చంద్రబాబుపై ఆయన కుటుంబంపై దారుణ విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసుపైనా దాడి చేయించారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.
Nellore Ysrcp : సీఎం జగన్ కి షాకిచ్చిన నలుగురిలో ముగ్గురు నెల్లూరోళ్లే
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
Rahul Gandhi : రాహుల్ గాంధీపై అనర్హతా వేటు ప్రజాస్వామ్యంపై దాడి - తీవ్రంగా ఖండించిన విపక్ష నేతలు !
TSPSC Exams : రాజకీయంలో చిక్కుకుపోతున్న టీఎస్‌పీఎస్సీ - మళ్లీ పరీక్షలు ఎప్పుడు ?
YSRCP Fail : అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పెక్కడ జరిగింది ? - ఎమ్మెల్సీ ఫలితంపై వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం !
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!