అన్వేషించండి

Congress Operation Telugu States : వైఎస్ జయంతికి ఇడుపులపాయకు సోనియా, రాహుల్ ? నిజమైతే కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ రెడీ అయినట్లే ?

సోనియా, రాహుల్ తెలుగు రాష్ట్రాలపై గురి పెట్టారా ?వైఎస్ జయంతికి ఇడుపులపాయలో నివాళులు అర్పిస్తారా ? ర్మిల పార్టీని విలీనం చేస్తారా ?ఏపీలో కోల్పోయిన ఓటు బ్యాంక్ ను వెనక్కి తెచ్చుకుంటారా ?

Congress  Operation Telugu States :   వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ కార్యక్రమం కూడా అక్కడా ఇక్కడా కాకుండా ఏకంగా ఇడుపుల పాయలోనే జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం చేస్తూండటం రాజకీయంగా సంచలనం సృష్టించేదే. నిజమో కాదో అధికారికంగా ప్రకటించేదాకా స్పష్టత లేదు కానీ.. నిజంగానే ఇలాంటి పరిణామం జరిగితే మాత్రం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్ భారీ వ్యూహంతో రంగంలోకి దిగుతుందని అనుకోవచ్చంటున్నారు. 

వైఎస్ జయంతికి ఇడుపుల పాయకు రాహుల్ , సోనియా ?

జులై 8న వైఎస్ జ‌యంతి  సంద‌ర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు క‌డ‌పజిల్లాలోని ఇడుపుల‌పాయ‌కు  రానున్నార‌ని, అక్క‌డ వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళులు ఆర్పించ‌నున్నార‌ని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  ఇదే జ‌రిగితే వైఎస్ కుటుంబం మ‌ర‌లా కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని అనుకోవ‌చ్చు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ కొంత‌మేర బ‌లంగా ఉన్న‌ప్ప‌టికీ, ఏపీలో ఆ పార్టీ పూర్తిగా బ‌ల‌హీన‌ప‌డింది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఒక్క‌సీటును కూడా ఆ పార్టీ గెలుచుకోలేక‌పోయింది. మ‌రి వైఎస్ కుటుంబం ఆ పార్టీతో క‌లిస్తే కాంగ్రెస్‌కు మ‌ళ్లి పున‌ర్వైభ‌వం సాధ్య‌మౌతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

కాంగ్రెస్‌లో విలీనానికే షర్మిల మొగ్గు 

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల..  సొంతంగా పార్టీ నడపడం కన్నా జాతీయ పార్టీలో విలీనం చేయడం మంచిదని అనుకుంటున్నారు.  కర్ణాటకకు చెందిన డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు.  వైఎస్ఆర్ టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌కు రాహుల్ గాంధీ  స‌న్నిహితుడు కేసీ వేణుగోపాల్  ఫోన్ చేసి మాట్లాడారని.. విలీనంపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు.  వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి  సీఎం గా ఉన్న రోజుల్లో నాటి ఏఐసీసీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో స‌త్సంబంధాలు ఉండేది. దేశంలో కాంగ్రెస్ పార్టీ   అధికారంలోకి వ‌చ్చేందుకు వైఎస్ఆర్ కీల‌క పాత్ర‌ను పోసించారు. పైగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. ఈ కారణం చెప్పి షర్మిల పార్టీని విలీనం చేయవచ్చని భావిస్తున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలాన్ని పుంజుకునేలా కాంగ్రెస్ ప్రయత్నం 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే.. ఆ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది. వైఎస్ .. తన జీవితాంతం కాంగ్రెస్ నే అంటి పెట్టుకుని ఉన్నారు. కాంగ్రెస్ వల్లే ఆయనకు అత్యున్నత పదవులు లభించాయి. అయితే ఆయన చనిపోయిన తర్వాత..  సోనియాపైనే జగన్ కుటుంబం దారుణ నిందలు మోపింది . వైఎస్ మరణం వెనుక సోనియా హస్తం ఉందని కూడా ఆరోపించారు. తమపై అక్రమ కేసులు పెట్టించారని కూడా విమర్శించారు. సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబం నుంచే అదీ కూడా వైఎస్ వారసుల్లో ఒకరు కాంగ్రెస్ చేరడం చిన్న విషయం కాదని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటు బ్యాంక్‌ను దగ్గరకు తీసుకోవడానికి ఇవి ఇవి ఉపయోగపడాయని అనుకుంటున్నారు. 

ఇప్పటి వరకూ జూలై ఎనిమిదో తేదీన సోనియా, రాహుల్ ఇడుపులపాయకు వస్తారన్న క్లారిటీ లేదు. అదే జరిగితే మాత్రం..  తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడానికి ప్లాన్లు అమలు చేయడం ప్రారంభించిందని అనుకోవచ్చు. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Kadapa Municipal Elections: కడపలో ఏకగ్రీవాల రగడ - కూటమి హవా సరే.. వైసీపీ పునాదులు నిజంగానే కదిలాయా?
కడపలో ఏకగ్రీవాల రగడ - కూటమి హవా సరే.. వైసీపీ పునాదులు నిజంగానే కదిలాయా?
AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Karnataka Political Sting Operation 2026: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget