అన్వేషించండి

Telugu Desam Party 2024: 2024 సంవత్సరంలో చంద్రబాబు చాణక్యానికి, లోకేష్‌ పని తీరుకు లిట్మస్‌ టెస్టు

Telugu Desam Party 2024: తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ.

Telugu Desam Party 2024: తెలుగు దేశం పార్టీ భవిష్యత్‌కి 2024 కీలకం కాబోతోంది. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. తెలుగుదేశం పార్టీకి గడచిన ఫైవ్‌ ఇయర్స్‌లో ముందు నాలుగేళ్లు ఒక ఎత్తైతే ఆఖరి ఏడాది మరో ఎత్తు. 2023 ఏడాదిని టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. 

టీడీపీని ఇబ్బంది పెట్టిన 2023
గతేడాది చంద్రబాబు కేసుల్లో ఇరుక్కున్నారు. జైలుకి కూడా వెళ్లి వచ్చారు. వైఎస్‌ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలని పేరున్న లీడర్లంతా కేసులతో సతమతమైన వాళ్లే. అందుకే గతం గతః అన్నట్టు ఈ ఏడాది అయినా మంచి జరగాల్సిన తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వంతోపాటు కేడర్ కోరుకుంటుంది. 

జనసేనతో పొత్తు
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు కచ్చితంగా జీవన్మరణ సమస్యగా మారిపోయాయి. ఆరునూరైనా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా జారవిడుచుకోకుండా జాగ్రత్త పడుతోందా పార్టీ. ఇప్పటికే జనసేనతో పొత్తు కుర్చుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీ వ్యూహన్ని రచిస్తోంది. 

సీట్ల పంచాయితీ
ఇప్పటివరకు సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా జనసేనతో పొత్తుపై పాజిటివ్‌ వాతావరణం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ముఖ్యంగా సీట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ అందరిలో ఉంది. ఒక వేళ బీజేపీ కూడా కలిసి వస్తే పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. సీట్ల విషయంలో జనసేన కేడర్‌కు భారీగా డిమాండ్లు ఉన్నాయి. వాటిని రెండు పార్టీల అధినాయకత్వాలు ఎలా స్వీకరిస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. 

ఓట్ల మార్పిడీ పెద్ద టాస్క్
ఓటు ట్రాన్స్‌ఫర్ అనేది కూడా ఇక్కడ మరో ముఖ్యమైన అంశం. సీట్ల విషయంలో ఎలాంటి లుకలుకలు లేకుండా ప్రక్రియ సాగిపోతే ఓటు ట్రాన్స్‌ఫర్‌ ఈజీగానే జరుగుతుంది. అయితే కొందరు వైసీపీ లీడర్లు మరికొందరు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు, జనసేనవైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి టికెట్లు ఇవ్వాల్సి వస్తే టీడీపీ ఏం చెప్పనుందో అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్యే జనసేనలో జాయిన్ అయిన వంశీకృష్ణ తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. ఇలాంటి వాళ్లు జనసేనలో చాలా మంది జాయిన్ అవుతున్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద్ క్వశ్చన్ మార్క్. 

ఇది జనసేన సొంత వ్యవహారం అయినప్పటికీ అది టీడీపీపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఇది పొత్తుపై ప్రభావం చూపే ఛాన్స్ లేకపోలేదు. అటు టీడీపీలో కూడా 175 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉన్నారు. జనసేనకు ఇచ్చిన టికెట్లలో టీడీపీ వాళ్లను ఎలా శాంతి పరిచి ఓటు షేర్ అయ్యేలా చేస్తారనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇలా ఉభయోకుశలోపరి అన్నట్టు అటు కేడర్‌ను ఇటు లీడర్లను ఒప్పించి పొత్తులపై ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 

మేనిఫెస్టో సవాల్ 
సంక్షేమం పేరుతో అనేక పథకాలు తీసుకొచ్చిన జగన్ అవే తనకు ఓట్ల వర్షం కురిపిస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఓటు బ్యాంకును తనవైపునకు తిప్పుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడున్న వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పటికే ఐదు గ్యారంటీల పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలక 2500 నిధులు ఇవ్వాలని, నాలుగు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. మరి ఎన్నిక మ్యానిఫెస్టో ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వీటికితోడు లోకేష్‌ పాదయాత్ర టైంలో ఇచ్చన హామీలు, స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో మ్యానిఫెస్టో సిద్ధం చేయాలి. ఎన్నికల తర్వాత మ్యానిఫెస్టో పట్టించుకోరన్న అపవాదును దాటుకొని ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఎలాంటి వ్యూహంతో వెళ్లాల్సి ఉంటుంది. 

వెంటాడుతున్న కేసులు
చంద్రబాబును ఎప్పుడూ లేనంతగా కేసుల వెంటాడుతున్నాయి. గతేడాది నుంచి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సుమారు రెండు నెలల తర్వాత బెయిల్ వచ్చింది. మిగతా కేసుల్లో ఆయన మెడపై కత్తి వేలాడుతోంది. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్స్‌ ఆధారంగా వీటి కదలిక ఉంటుంది. అందుకే ప్రజలను మెప్పించి అధికారం కైవశం చేసుకోవడం టీడీపీ ముందు ఉన్న లక్ష్యం. 

మీటింగ్‌లతో మరింత జోష్
ఈ వారం నుంచి ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు వాటిని విజయవంతం చేసుకోవడం కూడా ముందు ఉన్న టాస్క్. ఐదు నుంచి ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో సమావేశాలు పెట్టనున్నారు. అదే టైంలో లోకేష్ కూడా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను టచ్ చేయబోతున్నారు. ఇటు చంద్రబాబు టూర్, మరోవైపు లోకేష్‌ పర్యటన. రెండింటినీ మేనేజ్ చేసుకొని ప్రజలను మెప్పిండానికి టీడీపీ సర్వశక్తులు పెట్టేస్తోంది. 

షర్మిలతో రాజకీయ ఫైట్ ఎలా 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం వైఎస్‌ఆర్‌సీపీలో ఎంత టెన్షన్ పెడుతోందో తెలుగుదేశం పార్టీకి అంతే తలనొప్పిగా మారబోతోంది. ఒక వేళ షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ఛాన్స్ ఉంటుంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రతి వ్యూహం ఎలా రచిస్తారనేది ఆసక్తిగా మారుతోంది. 

బీజేపీతో వెళ్తారా?
ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ విషయంలో తెలుగుదేశం ఎలాంటి స్టెప్‌ తీసుకోనుందో అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇది కూడా టీడీపీకి ఛాలెంజ్‌. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget