News
News
X

Munugode TDP : మునుగోడులో టీడీపీ తరపున టీఆర్ఎస్ సీనియర్ నేత పోటీ చేస్తారా ? అదేం లేదంటున్న లీడర్ ! ఇంతకూ ఎవరాయన ? ఏం జరిగింది ?

మునుగోడులో టీడీపీ తరపున పోటీ చేయడం లేదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

FOLLOW US: 

Munugode TDP :  మునుగోడు ఉపఎన్నికల్లో  పోటీ చేయాలా వద్దా అన్నదానిపై తెలుగుదేశం పార్టీ ఇంకా నిర్ణయించుకోలేదు. 13వ తేదీన ఫైనల్ చేద్దామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఓకే అంటే తాము పోటీ చేయడానికి రెడీ అంటూ కొంత మంది నేతలు కూడా సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా సోషల్ మీడియాలో మునుగోడులో టీడీపీ తరపున ఫలానా అభ్యర్థి అంటూ ప్రచారం ఊపందుకుంది. ఆయనెవరో సాదాసీదా నేత అయితే పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ.. టీఆర్ఎస్ సీనియర్ నేత కావడంతో వైరల్ అయింది. టీడీపీ తరపున ప్రచారంలోకి వచ్చిన  ఆ అభ్యర్థి పేరు బూర నర్సయ్య గౌడ్. భువనగిరి మాజీ ఎంపీ. 

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయగానే మునుగోడు ఉపఎన్నికల్లో పోటీకి బూర నర్సయ్య గౌడ్ ఆసక్తి చూపారు. టీఆర్ఎస్ హైకమాండ్‌కు కూడా తన ఆసక్తిని తెలిపారు. మునుగోడులో బీసీ ఓటర్లు అత్యధిక మంది ఉన్నారని అన్ని పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తున్నాయని..  టీఆర్ఎస్ తరపున బీసీ అభ్యర్థినైన తనకు చాన్సిస్తే మంచి మెజార్టీతో గెలుస్తానని ఆయన ప్రతిపాదన పెట్టారు. ఓ దశలో బీసీకే టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా తీసుకు వచ్చారు. అయితే సర్వేల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే సానుకూలత వచ్చిందని కేసీఆర్ ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు.  భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని చెప్పి బూర నర్సయ్య గౌడ్‌ను బుజ్జగించారు. 

కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి బీఫాం ఇచ్చే సమయంలో బూర నర్సయ్య గౌడ్‌ను కూడా కేసీఆర్ పిలిపించి కలిసి పని చేయాలని సూచించారు. దానికి నర్సయ్య గౌడ్ కూడా అంగీకరించారు. ఆయన టీఆర్ఎస్ తరపున మునుగోడులో ప్రచారం చేస్తున్నారు కూడా. అయితే  అనూహ్యంగా ఆయన పేరు టీడీపీ అభ్యర్థిగా ప్రచారంలోకి రావడంతో రాజకీయవర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఈ అంశంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అంతకంతకూ పెరుగుతూండటంతో ఆయన క్లారిటీ ఇచ్చారు.  తాను మునుగోడు ఉప ఎన్నిక‌లో పోటీ చేయ‌డం లేద‌ని తేల్చిచెప్పారు. ఆ వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేస్తాననే ప్ర‌చారంలో నిజం లేదు.. అలాంటి వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారాన్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి కోసం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప‌ద‌వులు, డ‌బ్బుల కోసం పాకులాడే వ్య‌క్తిని కాద‌ని బూర న‌ర్స‌య్య గౌడ్ తేల్చిచెప్పారు.

News Reels

నర్సయ్య గౌడ్ క్లారిటీతో తెలుగుదేశం పార్టీ తరపున ఆయన  అభ్యర్థి కాదని స్పష్టమయింది.  అయితే అసలు ఈ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో లేదో స్పష్టత లేదు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మునుగోడులో తెలుగుదేశం పార్టీకి  ఉమ్మడి రాష్ట్రంలోనూ  మెరుగైన ఫలితాలు సాధించలేదు. కానీ పొత్తుల ఉన్నప్పుడు కమ్యూనిస్టులు గెలిచారు. గురువారం చంద్రబాబు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటే అభ్యర్థిని కూడా అప్పుడే ఖరారు చేసే అవకాశం ఉంది. 

Published at : 11 Oct 2022 04:05 PM (IST) Tags: Munugodu Munugodu By Election Munugodu by-election Boora Narsaiya Goud Munugodu TDP candidate

సంబంధిత కథనాలు

Batti Vs Revant :  రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు  ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Batti Vs Revant : రేవంత్ వర్సెస్ భట్టి విక్రమార్క - తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్ర చిచ్చు ! కాంగ్రెస్‌ ఇక కోలుకోదా ?

Ganta In YSRCP : వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

Ganta In YSRCP :  వైఎస్ఆర్‌సీపీలో చేరే యోచనలో గంటా - డిసెంబర్ 1న నిర్ణయం ప్రకటించే అవకాశం !

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

AP TDP: బీసీ మంత్రులను డమ్మీలను చేసి, వైసీపీ బీసీ ఆత్మీయ సమ్మేళనాలా?: టీడీపీ నేతలు ఫైర్

YSRCP BC Leaders : డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

YSRCP BC Leaders :  డిసెంబర్ 8న బెజవాడలో బీసీ బహిరంగసభ - వైఎస్ఆర్‌సీపీ నేతల నిర్ణయం !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

వైసీపీలో ఆ వారసులకు లైన్ క్లియర్‌- ఎమ్మిగనూరు నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీ !

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి