అన్వేషించండి

Balineni Hot Comments : సొంత పార్టీ పెద్ద నేతలే కుట్ర చేస్తున్నారు - మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆరోపణలు!

సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తనపై కుట్రల విషయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు.


Balineni Hot Comments :  వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంత పార్టీకి చెందిన పెద్ద నేతలే తనపై కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలులో ఇటీవల వరుస వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన... తనపై కుట్ర జరుగుతోందన్నారు. సొంత పార్టీకి చెందిన పెద్ద నేతలే కుట్రలు చేస్తున్నారని వారికి టీడీపీ నేతలు సహకరిస్తున్నారని ్నుమానం వ్యక్తంచేశారు. ఎవరు చేస్తున్నారో కూడా తనకు తెలుసన్నారు. టీడీపీతో వాళ్లు టచ్‌లో ఉన్నారని.. హవాలా మంత్రి అని వాళ్లే అనిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని బాలినేని ఆరోపణలు

ఒంగోలులో ప్రతిపక్ష నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బాలినేని ఆరోపమలుచేస్తున్నారు.  జనసేన నాయకురాలికి  మద్యం సేవించి  అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనకు సంబంధం లేని విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని వాపోయారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. జనసేన నాయకురాలు అరుణకు బాలినేని అనుచరుడు, వైఎస్సార్సీపీ నేత సాంబశివరావు ఇటీవల అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి మాట్లాడటం వివాదాస్పదమైంది.

పవన్ కల్యాణ్ నిజాలు తెలుసుకోవాలన్న బాలినేని 

బాలినేనిపై ఆరోపణలు రావడంతో ఆయన అనుచరులు కేసులు పెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తర్వాత కేసులు వెనక్కి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరడం వల్లే కేసులు వెనక్కి తీసుకున్నామని చెప్పిన బాలినేని.. పవన్ కూడా నిజాలు తెలుసుకోవాలన్నారు. ఈ కుట్రలన్నింటిలోనూ తమ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని..తనపై జరుగుతున్న కుట్రల విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని బాలినేని చెబుతున్నారు.   

మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని చుట్టూ  వివాదాలు

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల క్రితం అల్లూరు వెళ్లిన బాలినేని శ్రీనివాసరెడ్డిని.. కవిత అనే మహిళ రైతు సమస్యలపై ప్రశ్నించింది. దీంతో బాలినేని అనుచరులు ఆమె ఇంటి గేటుకు తాళం వేశారని టీడీపీ ఆరోపించింది. ఈ అంశంపైనా దుమారం రేగుతోంది. ఇటీవల చెన్నైలో పెద్ద ఎత్తున ఒంగోలు నుంచి తరలిస్తున్న హవాలా మనీని పట్టుకున్నారు. ఆ విషయంపైనా టీడీపీ నేతలు బాలినేనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత బాలినేని వివాదాల్లో కూరుకుపోతూండటంతో తన వెనుక కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget