YSR Telangana Party : షర్మిలకు తప్పిన "పేరు" టెన్షన్ .. వైఎస్ఆర్‌టీపీకి "ఈసీ" గ్రీన్ సిగ్నల్ !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇతరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఈసీ తోసి పుచ్చింది.

FOLLOW US: 

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ( YSR Telangana Party ) పేరుపై ఏర్పడిన సస్పెన్స్‌కు తెర పడింది. వైఎస్ షర్మిలకు ( YS Sharmila ) ఊరట లభించింది. వైఎస్ఆర్‌టీపీ పేరుపై వ్యక్తమయిన అభ్యంతరాలను ఈసీ ( Election Commision ) తోసి పుచ్చింది. దీంతో పేరు మార్చాల్సిన పరిస్థితుల నుంచి షర్మిల బయటపడ్డారు. తెలంగాణలో రాజకీయం చేయాలని నిర్ణయించుకున్న షర్మిల ( Sharmila ) వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు. ఈసీకి దరఖాస్తు చేశారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని పేపర్ ప్రకటన ఇచ్చింది. ఈసీ ప్రకటనతో కడప జిల్లాకు చెందిన కొంత మంది గతంలో అన్న వైఎస్ఆర్ పార్టీని ( Anna YSR Party ) ప్రారంభించారు. 

తెలంగాణను ఏపీలో కలుపుతారా? కేటీఆర్ ఆ మాటలు మానుకోవాలి: వైఎస్ షర్మిల

వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకునే హక్కు తమకే ఉందని వారు వాదించారు. వైఎస్ఆర్ పేరును ఉపయోగించుకుటున్నారని తమ పార్టీకి అది ఎఫెక్ట్ అవుతుందని  గతంలో ఢిల్లీ హైకోర్టులో  వైఎస్ఆర్‌సీపీపై కేసు వేశారు.ఈ కారణంగా వైఎస్ఆర్ సీపీ నేతలు తమ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా చెబుతున్నారు. లెటర్ ప్యాడ్లలోనూ మార్పులు చేశారు. కొత్తగా వైఎస్ఆర్ పేరుతో షర్మిల పార్టీ ప్రారంభించడంతో వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 

ఏపీలో షర్మిల పార్టీ పెడితే ఆ పది పార్టీల్లో ఒకటవుతుంది... రఘురామ గురించి మాట్లాడటం టైంవేస్ట్...

ఈ కారణంగా వేరే పేరును సూచించాలంటూ ఈసీ షర్మిల పార్టీ ప్రతినిధులకు మాచారం ఇచ్చారు. అయితే చివరికి అన్ని అభ్యంతరాలను షర్మిల పార్టీ ప్రతినిధులను పరిష్కరించడంతో పార్టీ పేరును ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఆమోదముద్ర వేసినట్లుగా సమాచారం పంపింది. దీంతో వైఎస్ షర్మిలకు పేరు టెన్షన్ తప్పినట్లయింది. షర్మిల మళ్ళీ పాదయాత్రను మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు.  మార్చ్ 5 నుంచి పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలో పాదయాత్ర ఆగిపోయింది. 

నా జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉంది..రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. ఏపీలో పార్టీపై మరోసారి షర్మిల స్పందన !

షర్మిల ఏపీలోనూ పార్టీ పెడతారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని తన రాజకీయ జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని ఆమె ప్రకటించారు. తెలంగాణలో యాక్టివ్‌గా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు.  పాదయాత్ర ప్రారంభించిన దగ్గర్నుంచి ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. 

Published at : 23 Feb 2022 04:53 PM (IST) Tags: YS Sharmila sharmila ysrtp YSR Telangana party Easy permission for Telangana

సంబంధిత కథనాలు

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ -  టీడీపీ నిర్ణయం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?

Anna Hazare President Candidate KCR Plan:   రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?

3 Years of YSR Congress Party Rule : మూడేళ్ల పాలన తర్వాత  వైఎస్ఆర్‌సీపీ గ్రాఫ్ పెరిగిందా ? తగ్గిందా ?

3 Years of YSR Congress Party Rule : ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?

3 Years of YSR Congress Party Rule :   ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఏమిటి ? జగన్ విధానాలే నష్టం చేశాయా ?

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!

Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!