అన్వేషించండి

YSRCP Leaders : దాడులు - దౌర్జన్యాలు ! వైఎస్ఆర్‌సీపీకి భారంగా మారుతున్న తూ.గో జిల్లా నేతలు !

తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోంది.


YSRCP Leaders : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.  హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులు వంటి వాటిలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ మీడియాలో హైలెట్ అవుతూండటంతో  వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు !

తానే హత్య చేసానంటూ నిస్సిగ్గుగా  పోలీసులముందు ఒప్పుకుని జైలు పాలైన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరువును నిండా ముంచేశారు..   తన మాజీ డ్రైవర్ను అతి కిరాతకంగా చంపేసి అడ్డంగా దొరికిపోయిన అనంత బాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు.  నేర చరిత్ర కల్గి ఉన్న వారిని పెద్దల సభకు ఎలా పంపించారన్న విమర్శలు..సిఎం జగన్‌పై  ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


పోలవరం ఇంజినీర్‌ను కొట్టిన జక్కంపూడి రాజా !

ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం సద్దుమణగక ముందే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా  పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఏఈ తొత్తాడ సూర్య కిరణ్ ను చెంప చెళ్లు మనిపించేలా మూడు సార్లు కొట్టాడని.. పోలీసులకు ఫిర్యాదు అందింది.  అధికార పార్టీలో ఉండి.. తమ ప్రభుత్వంలోనే పనిచేసే అధికారిపై చేయి చేసుకోవడం  తీవ్ర విమర్శల పాలు కాగా దీనిపై పోలీసు స్టేషన్‌లో సదరు బాధిత ఏఈ సూర్య కిరణ్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు, ఇంజనీర్లంతా జక్కంపూడి రాజా దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండించడం జరిగాయి.  కొందరు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చివరికి సదరు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పించడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సొంత పార్టీ నేతకు మంత్రి కొడుకు బెదిరింపులు!

తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు ఓ ఎంపీటీసీ పై బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఇటీవల జరిగిన అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇళ్లు తగలబడి పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణా రెడ్డి వైసిపికి చెందిన ఓ ఎంపిటిసి పై తీవ్రస్థాయిలో ఫోన్లో రెచ్చిపోవడం.. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనమయ్యింది.. తమ ఇంటిని దగ్ధం చేసిన కుట్ర వెనుక నీ పాత్ర ఉందంటూ మంత్రి తనయుడు కృష్ణా రెడ్డి ఎంపిటిసి అడపా సత్తిబాబు అనే వ్యక్తిపై విరుచుకు పడటం.. చంపేస్తానని సెల్ ఫోన్లోనే బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపింది. 

ఆగని అనంతబాబు దాడులు ! 

ఈ సంఘటనలు మరువకముందే తన మాజీ డ్రైవరు సుబ్రమణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు సహ ఖైదీ ని కొట్టి గాయ పరిచాడంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఇది ఏ మాత్రం వాస్తవం కాదని రాజమండ్రి జైల్ సుపరెం టెండ్ రాజారావు చెబుతున్నారు..  ఏది ఎమైనా గత కొన్ని రోజులుగా అధికార వైసీపీ నేతలు వ్యవహార శైలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశ మవుతోంది ..

 

టాప్ హెడ్ లైన్స్

Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
YSRCP Vote Bank Drop: గ్రామాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు తగ్గిందా? కూటమి విడిగా పోటీ చేసినా అదృష్టం కలసి రాలేదా?
గ్రామాల్లోనూ వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు తగ్గిందా? కూటమి విడిగా పోటీ చేసినా అదృష్టం కలసి రాలేదా?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Telangana Graduate MLC Voter List: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల -భారీగా నమోదైన ఓట్లు.. ఏ పార్టీకి ప్లస్? ఎవరికి మైనస్?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా విడుదల -భారీగా నమోదైన ఓట్లు.. ఏ పార్టీకి ప్లస్? ఎవరికి మైనస్?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Bigg Boss Season 10 Today November 27th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: చివరి కెప్టెన్‌గా లేడీ టైగర్ దేబ్జానీ! మరోసారి క్యారెక్టర్ గొడవ.. హౌస్ సపోర్ట్ మొత్తం త్రిగుణ్‌కే!
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
Embed widget