అన్వేషించండి

Hydra Politics : హైడ్రా కూల్చివేతలతో సొంత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి - రేవంత్ రాజకీయంగా ఎలా తట్టుకుంటారు ?

Revanth Reddy : హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తోంది.రాజకీయంగా రేవంత్ బలహీనపడే చాన్స్ కనిపిస్తోంది. ఈ రాజకీయాన్ని రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు ?

Dissatisfaction is seen among Congress MLAs over the demolition of Hydra : తెలంగాణలో రాజకీయం అంతా ఇప్పుడు హైడ్రా  కూల్చివేల చుట్టూ తిరుగుతోంది. హైడ్రాకు మద్దతుగా ప్రజలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ... చెరువుల్ని కబ్జాల నుంచికాపాడకపోతే తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించనట్లేనని.. సొంత వాళ్లు ఉన్నా సరే వదిలి పెట్టబోనని ప్రకటించేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి వరకూ హైడ్రా కూల్చివేతలకు మద్దతుగా మాట్లాడుతున్న వారు చాలా  పరిమితంగానే  ఉన్నారు. కానీ వ్యతిరేకించేవారు మాత్రం..  ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇది రాజకీయంగా కీలకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కూల్చివేతలు ఖచ్చితంగా రాజకీయ అంశమే      

హైడ్రా కూల్చివేతలు చెరువుల్ని కబ్జా చేసిన వారి భరతం పట్టడానికనని చెబుతున్నారు. కానీ ఈ చెరువుల్ని సామాన్యులు ఎవరూ కబ్జా చేయలేరు. సామాన్యులు చెరువు శిఖం భూమిలో చిన్న షెడ్డు కూడా వేయలేడు. కానీ రాజకీయ నేతలు .. చేతిలో అధికారం ఉన్న వారు మాత్రం..  శిఖం భూములే కాదు..  భారీ అంతస్తుల నిర్మాణాలు కూడా  పూర్తి చేస్తారు. వారికి అడ్డం ఉండదు. గత పదిహేను..ఇరవై ఏళ్లుగా వివిధ చెరువులను కబ్జా చేయడం.. శిఖం  భూముల్లో ఉన్న నిర్మాణాలన్నీ రాజకీయ నేతలు.. వారి అనుచరులు... బినామీల నిర్వాకాలే. ఆ  పార్టీ.ఈ పార్టీ అనే తేడా ఉండదు. అందరిదీ అదే పని. అందుకే ఇప్పుడు అలాంటి కట్టడాలను కూలగొడితే ఖచ్చితంాగా పొలిటికల్ ఎఫెక్ట్ వస్తుంది. అది ఇప్పుడు  ప్రాథమిక స్థాయిలో తెలంగాణ సర్కార్ పై కనిపిస్తోంది. 

దానం నాగేందర్ బహిరంగ వ్యతిరేకత 

దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతలపై బహిరంగ వ్యతిరేకత వ్యక్తం చేశారు. నిజానికి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అసంతృప్త్పితో రేవంత్ రెడ్డికి పెద్దగా నష్టం జరిగేమీ ఉండదని అనుుకుంటున్నారు. కానీ హైదరాబాద్‌కు సంబంధం లేకపోయినా అనేక మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. వారి బంధువుల వ్యాపారాలు హైదరాబాద్‌లోనే ఉంటాయి. అవి కూడా ఎక్కువ భూమితోనే ముడిపడి ఉంటాయి. హైడ్రా కూల్చివేతల పరంగా చూస్తే కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్‌లు.. ఇతర వాటిపై విరుచుకుపడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే రేవంత్ చిత్తశుద్ధిపై ప్రజలకు అనుమానాలొస్తాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ఆస్తుల జోలికి వెళ్తే వారికి కోపం వస్తుంది. చాలా మంది సైలెంట్ గా ఉన్నారు కానీ.. కూల్చివేతలపై వ్యతిరేకంగా ఉన్నారు. 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మజ్లిస్ 

మరో వైపు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్  కూల్చివేతలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన మొదట్లో మజ్లిస్ ఎమ్మెల్యే ఆక్రమణలను తొలగించారు. తాజాగా  బండ్లగూడ చెరువులో ఫాతిమా ఓవైసీ కాలేజీ కట్టిన వైనం  సోషల్  మీడియాలో వైరల్ అయింది. దీన్ని ఎప్పుడు కూలుస్తారంటూ ప్రశ్నించడం ప్రారంభించారు. అందుకే ఓవైసీ హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్‌టీఎల్‌లో కట్టారని .. కూల్చేస్తారా అని ఆరోపించారు తమకు నష్టం జరుగుతుందనుకుంటే.. మజ్లిస్ .. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వానికి మద్దతుగా ఉండదు. 

ప్రజా మద్దతు ఉంటుందని రేవంత్ నమ్మకం

అయితే ప్రజల మద్దతు ఉంటే. ఈ అంశంపై ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నా.. గీత దాటి పోరన్న నమ్మకంతోనే.. హైడ్రాకు సూపర్ వపర్స్ ఇచ్చి ముఖ్యమంత్రి  కబ్జాదారులపై ఎటాక్ చేస్తున్నారన్న అబిప్రాయం వినిపిస్తోంది. హైడ్రాకు ఇప్పటికిప్పుడు ప్రజల మద్దతు పెరుగుతోంది. చెరువుల్ని కాపాడాలని చాలా కాలనీల్లో ప్రదర్శలు నిర్వహిస్తున్నారు. రేవంత్ నమ్మకం నిలబడుతుందా.. ఎమ్మెల్యేలంతా వ్యతిరేకమై ఆయన సీటు కిందకు నీళ్లు తెస్తారా అన్నది వేచి చూడాల్సిందే. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం! ఐదుగురు దుర్మరణం
YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YSRCP Leaders Bail: టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట- సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు
Hyderabad News: హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
హైదరాబాద్‌లో ఘోర విషాదం - ఐదేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన స్కూల్ బస్సు
Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు
CM Revanth Reddy: 'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
'శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు' - డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Pawan Kalyan Vacate Office:  ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
ప్రభుత్వం ఇచ్చిన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న పవన్ కల్యాణ్
Roja: నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా  ఇక ఫీల్డులోకి వస్తారా ?
నగరిలో కీలక నేతలపై వైసీపీ సస్పెన్షన్ వేటు - రోజా ఇక ఫీల్డులోకి వస్తారా ?
Embed widget