అన్వేషించండి

What next For Venkaiah : వెంకయ్య రాజకీయ శకం ముగిసినట్లేనా ? రిటైర్మెంటే మిగిలిందా?

ఉపరాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తయిన తర్వాత వెంకయ్య ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది. అయితే ఆయనకు అనధికారిక రిటైర్మెంటేనని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.

What next For Venkaiah : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు పదవీ కాలం ఆగస్టుతో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతిగా బెంగాల్ గవర్నర్ ధన్‌ఖడ్‌ ఎంపిక ఖాయం. అందుకే ఇప్పుడు వెంకయ్యనాయుడు  రాజకీయ భవిష్యత్‌పై చర్చ జరుగుతోంది. తర్వాత ఆయనకు  బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎలాంటిపదవులు.. ప్రాధాన్యత లభిస్తుందా ? ఆయన అనుభవాన్ని మోదీ, షాలు ఉపయోగించుకుంటారా?  లేక ఇతర సీనియర్లలా రిటైర్మెంట్ లెక్కలోకి వెళ్లిపోతారా?

75 ఏళ్లు దాటితే బీజేపీలో రిటైర్మెంట్ ! 

వెంకయ్యనాయుడు  వయసు డెభ్బై మూడేళ్లు. బీజేపీ పెట్టుకున్న విధానం ప్రకారం 75 ఏళ్లు రిటైర్మెంట్ వయసు. ఈ కారణంగానే చాలా మంది సీనియర్లను ఇళ్లకు పరిమితం చేశారు . కానీ వెంకయ్యనాయుడు రాజకీయ పరంగా మంచి వ్యూహకర్త. బీజేపీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి అధ్యక్షుడి వరకూ.. ప్రజాప్రతినిధి.. దిగువస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ ఎదిగారు. వెంకయ్యనాయుడు బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నిలబెట్టారు. అయితే రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఇది సరిపోదన్న వాదన వినిపిస్తోంది. 

రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలన్నది వెంకయ్య అభిలాష ! 

వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ  వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. అందుకే నేరుగా కాకపోయినా బీజేపీ కీలక నిర్ణయాల్లో భాగమయ్యే  పరిస్థితి కూడా ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమనిఅంటున్నారు. 

అనధికారిక  రిటైర్మెంటే ! 

వెంకయ్యనాయుడు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనని బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి. ఆయనకు ఇక ఎలాంటి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన మరో పదవి తీసుకోలేరు. ఆయన స్థాయికి తగ్గ పదవిని సృష్టించలేరు కూడా. అందుకే  ఆయన రాజకీయ ప్రస్థానం ఇంతటితో  ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా తన పదవీ కాలం చివరి రోజున భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెంకయ్యను పలు రకాలుగా పొగుడుతున్న బీజేపీ పెద్దలు ఆయన తర్వాత సేవలను ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన దరఖాస్తుకు దరఖాస్తు చేయనివారు అప్లయ్ చేసుకోండి. ఫిబ్రవరిలో నిధులు విడుదలయ్యే అవకాశం
ఫిబ్రవరిలో పీఎం కిసాన్‌ యోజన పథకం నిధులు విడుదల- దరఖాస్తు చేసుకోనివారు త్వరపడండి
CMR College Issue: మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
మేడ్చల్ సీఎంఆర్ కాలేజీకి మూడు రోజుల సెలవులు - వీడియోల షూటింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ 
Mandapeta Rave Party: మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
మండపేటలో న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ ? జనసేన సేతలపై తీవ్ర విమర్శలు
Bihar Youth: ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
ఏకంగా పట్టాలపైనే కూర్చుని పబ్జీ గేమ్ ఆడారు - రైలు ఢీకొని ముగ్గురు యువకులు దుర్మరణం
Allu Arjun vs Siddharth: హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
హీరో సిద్ధార్థ్‌కి మళ్లీ చుక్కలే.. ఇప్పుడప్పుడే అల్లు అర్జున్ వదిలేలా లేడుగా!
CMR College Bathroom Videos Issue: సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి  బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
సొంగ కార్చుకుంటూ చూడాలంటూ ప్రీతి రెడ్డి బూతులు- బాత్రూమ్ లో వీడియోలపై విచారణ: ఏబీపీతో ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి
Sydney Test Live Updates: సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
సిడ్నీ టెస్టులో బ్యాట్లెత్తేసిన బ్యాటర్లు, 185 పరుగులకు ఆలౌట్.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 9/1
Go Goa Gone: టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
టూరిస్టులు లేక బోసిపోతున్న గోవా - బోర్ కొట్టేసిందా ? కొట్టి చంపుతూంటే ఎవరైనా వెళ్తారా?
Embed widget