అన్వేషించండి

Danam Nagender BRS re entry: దానం నాగేందర్ బిగ్ ట్విస్ట్! కాంగ్రెస్‌పై అసంతృప్తి.. మళ్లీ బీఆర్ఎస్ గూటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే?

Danam Nagender praising KCR: ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసెంబ్లీలో ఫైర్. కేసీఆర్‌పై ప్రశంసలు, బీఆర్ఎస్‌లోకి రీ-ఎంట్రీ సాధ్యమేనా?

Revanth Reddy Congress vs Danam Nagender:   హైదరాబాద్ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహార శైలి ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం, గడిచిన కొన్ని రోజులుగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపైనే బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక డ్రా కార్యక్రమంలో తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని ప్రోటోకాల్ రచ్చ చేయడం, అసెంబ్లీ సాక్షిగా తన స్నేహితుడు పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడటం రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ పాలనను, ఆయన విజన్‌ను పొగుడుతూ కామెంట్లు చేయడం చూస్తుంటే.. దానం నాగేందర్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది.

కాంగ్రెస్‌లో చేరి పొందిందేమీ లేదన్న భావనలో దానం

కాంగ్రెస్‌లో చేరి తనకు దక్కిందేమీ లేదనే తీవ్ర తీవ్ర నైరాశ్యంలో దానం ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత, ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే డిగ్రేడ్ ఇమేజ్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ముప్పు కత్తిలా వేలాడుతుండటం, హైదరాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో సొంత పార్టీ నేతల నుంచే వస్తున్న ఆధిపత్య పోరుతో దానం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌లో ఉండి సాధించేది ఏమీ లేకపోగా, నియోజకవర్గంలోనూ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందనే భావనతోనే ఆయన తిరిగి పాత గూటికి వెళ్లేందుకు సంకేతాలు ఇస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి.

దానం వస్తానంటే కేటీఆర్ అంగీకరిస్తారా? 

అయితే, ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానం నాగేందర్‌ను మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తారా లేదా అనేది? 2023 ఎన్నికల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ మొదటి వరుసలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వెళ్లగానే మరోలా మారిన నేతలను తిరిగి చేర్చుకుంటే పార్టీ క్యాడర్‌కు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనే ఆలోచన బీఆర్ఎస్ అధిష్ఠానంలో ఉంది. దానం లాయలిటీ  పై కేసీఆర్‌కు ఏమాత్రం గురి లేకపోతే, ఆయనను కనీసం ఫార్మ్‌హౌస్‌లోకి కూడా రానివ్వరనే అభిప్రాయం ఉంది.

బలమైన బీసీ లీడర్ దానం

మరో కోణంలో చూస్తే బీఆర్ఎస్‌కు హైదరాబాద్‌లో బలమైన మాస్ లీడర్ల అవసరం   ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దానం నాగేందర్‌కు దశాబ్దాలుగా సొంత క్యాడర్ ఉంది. నగరంలో బీఆర్ఎస్ బలాన్ని నిలబెట్టుకోవడానికి, బిసి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతగా దానం సేవలు ఉపయోగపడతాయని గులాబీ దళం భావిస్తే ఆయనకు తలుపులు తెరిచే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేయడానికి దానం లాంటి నేత తిరుగుబాట పట్టడం బీఆర్ఎస్‌కు రాజకీయంగా పెద్ద విజయం అవుతుంది.  ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ దానం మళ్లీ పార్టీలోకి వస్తే, ఇన్నాళ్లూ ఆయనను విమర్శించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు ఆయనతో కలసి పనిచేస్తారా అనేది మరో సవాలు.   కాంగ్రెస్‌లో ఇమడలేక, ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్న దానం నాగేందర్ బీఆర్ఎస్ వైపు వంగి చూడటం హైదరాబాద్ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కేసీఆర్ మనసు కరిగి దానంకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేక నమ్మకం లేని నేత అని పక్కన పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget