అన్వేషించండి

Resign Politics : ప్లీజ్ రాజీనామా చేయండి సార్- టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను బతిమాలుతున్నదెవరు ? ఎందుకు ?

తెలంగాణలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వారు రాజీనామా చేస్తే నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందంటున్నారు.


Resign Politics :   తెలంగాణలో ప్రతి ఆరు నెలలకు ఓ ఉపఎన్నిక వస్తుంది. ఉపఎన్నిక వచ్చిన నియోజకవర్గం దశ తిరిగిపోతోంది. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజీనామా చేసిన దగ్గర్నుంచి నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు కనిపిస్తోంది. ప్రజలకు ఓటర్లకు రాచమర్యాదలు అందుతున్నాయి. దీంతో తమ నయోజకవర్గానికీ ఉపఎన్నిక రావాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా ఎమ్మెల్యేలకే కాల్ చేసి అడుగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలా ఫోన్ చేసి అడగడమే కాదు.. ఆ కాల్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఆడియోలు ఒక దాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. 

ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్న ఓటర్లు !

 మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,   నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్,  జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. తమ నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ అందుకున్నారు.  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..మునుగోడు నియోజకవర్గం తరహాలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని వారు ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరాడు. రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశాడు. సీఎం కేసీఆర్ ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే  సర్ది చెప్పాల్సి వచ్చింది.  అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా కోరాడు. ఇప్పటికే తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. సదరు వ్యక్తికి నచ్చజెప్పాడు.

ధర్నాలు చేసి.. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు ! 

కొన్ని చోట్ల జనం రాస్తారోకోలు చేస్తున్నారు.  బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రాజీనామా చేస్తేనే రోడ్డు వేస్తారని  ఆదిలాబాద్​ జిల్లా భీంపూర్ మండలానికి చెందిన ఆరు గ్రామాల ప్రజలు ఆదివారం నిపాని గ్రామం వద్ద రాస్తారోకో చేపట్టారు.  ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే రోడ్డు బాగు పడుతుందన్నారు. నర్సాపూర్​ఎమ్మెల్యే మదన్ రెడ్డికి శనివారం ఫోన్​ చేసి పదవికి రాజీనామా చేయాలని కోరిన బీజేపీ శివ్వపేట మండలం ఉసిరికపల్లి ప్రధాన కార్యదర్శి అశోక్​పై టీఆర్ఎస్​ నాయకులు ఆదివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటివి పెరిగిపోతూండటంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లోనూ అసహనం పెరిగిపోతోంది. కొత్త నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను లిఫ్ట్ చేయడం లేదు. 

ఇదేదో బాగుందని అందుకున్న బీజేపీ నేతలు !

ఎమ్మెల్యేల రాజీనామాలను డిమాండ్ చేయడం.. అలా చేస్తే మునుగోడు ..  హుజురాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతుందని ప్రచారం చేస్తూ..  బీజేపీ నేతలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో .. తమ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాలని కొన్ని చోట్ల నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి. దళిత బంధు పేరుతో ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షలు పంచడంతో.. అలాంటి స్కీమ్ లు ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమకూ వస్తుందనుకున్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. మునుగోడు ఉపఎన్నికతో మల్లీ ఆ పరిస్థితి పెరిగింది. 
   

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget