Congress Rally : సోనియాపై ఈడీ విచారణ కక్ష సాధింపే - భారీ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్
సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. కక్ష సాధింపులకు వ్యతిరేకంగా భారీర్యాలీ నిర్వహించింది.

Congress Rally : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఈడీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు.
సోనియాగాంధీ @RahulGandhi గార్లపై ఈడి దొంగ కేసులు, మోడీ & అమిత్షా & బీజేపీ దమన నీతికి నిరసనగా కదం తొక్కిన తెలంగాణ కాంగ్రెస్ సైన్యం!
— Telangana Congress (@INCTelangana) July 21, 2022
పీసీసీ అధ్యక్షుడు @revanth_anumula, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహం నుండి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ.
హైదరాబాద్‌లో నేడు కాంగ్రెస్ సునామి. pic.twitter.com/dBLygOfgZR
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ నీ దౌర్జన్యం ఎక్కువ కాలం చెల్లదు! నీ కుటిల, పిరికిపంద చర్యతో మా నాయకురాలి ప్రతిష్ట దెబ్బ తీద్దాం అన్న నీ పాచిక పారదు.
— Telangana Congress (@INCTelangana) July 21, 2022
నీ అబద్దాలు, నయవంచన, నీ తొత్తులకు నువ్వు ఈ దేశాన్ని అమ్మేస్తున్న తీరు, అన్నీ నువ్వ గద్దె దిగిన్నాడు, నువ్వు చేసిన పాపాలు నిన్ను ఊరికే వదిలి పెట్టవు. pic.twitter.com/xohqoK6412
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో నిరసనల తీవ్రత అధికంగా కనిపించింది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు బెంగళూరులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ఢిల్లీకి తరలివచ్చారు.
Vendetta politics by the BJP will not stand on Smt. Sonia Gandhi Ji.
— Revanth Reddy (@revanth_anumula) July 21, 2022
We will not tolerate the blatant misuse of power by ED & fight back until justice prevails. @INCIndia #सत्य_साहस_सोनिया_गांधी pic.twitter.com/dtcRSgXrjs





















