Jeevan Reddy: మహిళా కూలీకి కాంగ్రెస్ అభ్యర్థి చెంపదెబ్బ - వీడియో వైరల్, బీఆర్ఎస్ విమర్శలు
Telangana News: నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ మహిళా కూలీని చెంపదెబ్బ కొట్టిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Congress Leader Jeevan Reddy Slaps Woman: కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఓ మహిళా కూలీపై చేయి చేసుకోవడం సంచలనంగా మారింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్ (Armur) మండలంలోని గోవింద్ పేట్, చేపూర్, పిప్రి గ్రామాల్లో జీవన్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జీ వినయ్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు జరుగుతున్న చోటుకు వెళ్లి మహిళా కూలీలతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ మహిళను ప్రశ్నించగా తనకు పింఛన్ ఇప్పించాలని కోరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ కే ఓటు వేశానని.. కాని పెన్షన్ రావడం లేదని.. ఈసారి కమలం గుర్తుకే ఓటేస్తానని సదరు మహిళ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో జీవన్ రెడ్డి ఒక్కసారిగా ఆమె చెంపపై కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయన మహిళా కూలీపై చెంపదెబ్బ వేయగానే చుట్టూ ఉన్న నేతలంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే, తనకు పింఛన్ ఇప్పించాలని సదరు మహిళ వేడుకోవడం వీడియోలో కనిపిస్తోంది. కాగా, నిజామాబాద్ లో జీవన్ రెడ్డికి ప్రత్యర్థిగా సిట్టింగ్ ఎంపీ, బీజేపీ నేత అర్వింద్ పోటీలో ఉన్నారు.
I don’t know what is more disgusting! Nizamabad MP Congress candidate Jeevan Reddy slapping an old woman or all the other men standing around and laughing like it is some kind of a joke?!
— Revathi (@revathitweets) May 4, 2024
On Friday, when former minister and #Nizamabad MP candidate Jeevan Reddy was campaigning… pic.twitter.com/LEtB63p2MG
బీఆర్ఎస్ విమర్శలు
మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 'ప్రభుత్వం రాగానే ఎందుకంత అహంకారం.? ఉపాధి కూలీ మహిళను చెంపదెబ్బ కొడతారా.?. బీజేపీ అభ్యర్థి అర్వింద్ అహంకారానికి మీరేమీ తీసిపోరేమో జీవన్ రెడ్డి గారూ.' అంటూ ఆ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.
Also Read: Gadida Guddu: ఏంటీ గాడిద గుడ్డు? ఈ పదం వాడుకలోకి ఎలా వచ్చింది?