News
News
X

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీని నియమించాలని కాంగ్రెస్ అధినేత్రి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది.

FOLLOW US: 

Priyanka Gandhi For South :   ప్రియాంకా గాంధీ దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమయ్యారు.  దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్యవహరించనున్నారు. త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్‌ కమిటీ భేటీ తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రియాంకా గాంధీ ఇప్పటి వరకూ యూపీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. దక్షిణాదిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ కూడా ఇంత వరకూ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. అయితే హఠాత్తుగా ఆమెను దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ గా నియమించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. 

దక్షిణాదిలో పట్టు కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ ప్రయత్నం

ఉత్తరాదిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి.. ప్రాంతీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. కర్ణాటకలో బీజేపీతో పోటీ పడుతోంది. అయితే దక్షిణాదిలోనూ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి అధికారం దక్కించుకోవడంలో రెండు సార్లు విఫలం కావడమే కాకుండా ఇప్పుడు మరింతగా బలహీనమవుతోందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ మీద వస్తున్నాయి. దీంతో స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

కీలక రాష్ట్రాల్లో విజయం కోసం ప్రియాంకా గాంధీ నియామకం

అలాగే కేరళలో వరుసగా రెండో సారి అధికారాన్ని కోల్పోయింది. అక్కడ మరోసారి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అధికారపార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది. కర్ణాటకలో త్వరలో ఎన్నికలుజరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి చాన్సులు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో పార్టీ హైకమాండ్ తరపున బలమైన నాయకుడు వ్యవహారాలు పర్యవేక్షిస్తే.. ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అంచనాలు పార్టీ పెద్దల నుంచి వచ్చాయి. ఈ కారణంగా ప్రియాంకా గాంధీ కూడా దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. 

పార్టీ పరిస్థితిని ప్రియాంకా గాంధీ మార్చేస్తారా ? 

అదే సమయంలో ప్రియాంగా గాంధీకి మొదటి టాస్క్‌గా తెలంగాణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక ముంచుకొస్తోంది. వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం అంతా రచ్చ రచ్చగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడమే ఆయన సోదరుడు వెంకటరెడ్డి పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎంట్రీతో వీటన్నింటికీ చెక్ పెట్టే అవకాశం ఉందని అనుకోవచ్చు. ప్రియాంకా గాంధీ ఇటీవల రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆమె ఎంట్రీతో దక్షిణాదిలో కాంగ్రెస్ రాత మారుతుందేమో చూడాలి !

టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?

Published at : 13 Aug 2022 04:01 PM (IST) Tags: Priyanka gandhi congress party Priyanka Vathera Congress in charge of southern states

సంబంధిత కథనాలు

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

నా ఫోన్‌ను మోదీ ట్యాప్‌ చేశారు- నాకంటే ముందే నా ఫైల్స్‌ చదువుతున్నారు - కేటీఆర్ సంచలన ఆరోపణలు

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugode TRS Candidate: మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్, విజయం తమదేనని ధీమా

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు

Munugodu By Election: నేటి నుంచి మునుగోడు ఉపఎన్నికకు నామినేషన్లు

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ - వలస పోతున్న ఉద్యమకారులు

వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ - వలస పోతున్న ఉద్యమకారులు

టాప్ స్టోరీస్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?