అన్వేషించండి

Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?

Congress Cabinet Issues: రేవంత్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయ లోపం పతాక స్థాయికి చేరింది. జూపల్లి కృష్ణారావు వివాదం, కొండా సురేఖ లేఖాస్త్రంతో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

Telangana Congress Ministers Internal Rift:  తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు, మంత్రుల మధ్య సమన్వయ లోపం  ఇప్పుడు పతాక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  కీలక నిర్ణయాల్లో  ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. అదే సమయంలో మంత్రులను కాదని ఇతర నేతల్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సీనియర్ మంత్రులకు గ్యాప్ పెరిగింది. ముఖ్యంగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ వ్యవహారాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లోకి  నెట్టేయడమే కాకుండా, దిల్లీ దాకా వివాదం ముదిరేలా చేస్తున్నాయి.

బీఆర్ఎస్‌కు సవాల్ చేసి ఇరుక్కున్న జూపల్లి

ఈ వివాదాల పరంపరలో మొదటగా ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరుక్కుపోయారు. తన పరిధిలో లేని ఆర్థిక శాఖ  వ్యవహారాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు సవాల్ విసిరి, తెలంగాణ భవన్‌కు వస్తానని ఛాలెంజ్ చేయడం జూపల్లికి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అత్యంత తెలివిగా వాడుకుని కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో పడేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ..  ఛాలెంజ్ చేసినవాడు నేరుగా చర్చకు వెళ్లి తేల్చుకోవాలి కానీ, పార్టీని ఇరకాటంలో పెట్టడం ఎందుకు అని అంతర్గత సమావేశాల్లో వ్యాఖ్యానించినట్లు లీకులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జూపల్లి, సోమవారం సీఎం నిర్వహించిన పర్యాటక శాఖ  అధికారిక సమీక్షకు కూడా డుమ్మా కొట్టి, కొల్లాపూర్ బావిలో ఈత కొడుతున్న వీడియోలు రిలీజ్ చేశారు. 

కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి

మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కడియంపై అసంతృప్తి లేఖ రాసినప్పటికీ..కడియంకు సీఎం ప్రోత్సాహం ఉందని ఆమె నమ్ముతున్నారు. అదే సమయంలో  యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం వంటి అంశాల్లో కనీసం దేవాదాయ శాఖ మంత్రి అయిన తనకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై ఆమె కినుక వహించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర క్యాబినెట్‌లో ఏకైక బీసీ మహిళా మంత్రిగా ఉన్న తనను ఒకేసారి రెండు ప్రధాన అంశాల్లో టార్గెట్ చేస్తూ, తీవ్ర అవమానానికి గురిచేస్తున్నారనే భావనలో కొండా సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ వరంగల్ రాజకీయాల్లో ఇన్‌ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో, స్థానిక ఎమ్మెల్యేలతో కొండా కుటుంబానికి గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా తన స్వంత శాఖలోనే ముఖ్యమంత్రి కార్యాలయం   నేరుగా జోక్యం చేసుకుంటూ బోర్డులను ఖరారు చేయడంపై ఆమె  తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  ఈ వరుస పరిణామాలతో తీవ్రంగా కలత చెందిన కొండా సురేఖ.. రాష్ట్ర నాయకత్వం తీరుపై నిరసన తెలుపుతూ ఏఐసీసీ హైకమాండ్‌కు నేరుగా ఒక ఘాటు లేఖ రాయడానికి సిద్ధమవుతున్నట్లు పార్టీ అంతర్గత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రేవంత్ శైలి మార్చాల్సిందేనా ?

  ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న  సెంట్రలైజ్డ్ పవర్ శైలియేనని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలంగా ఉన్న సీనియర్ నేతలు, తాము రేవంత్ కంటే సీనియర్లమని భావించే మంత్రులు.. సీఎంవో నుంచి వచ్చే ఆదేశాలను సులభంగా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి వారు కూడా కొన్ని విషయాల్లో అసంతృప్తితో ఉన్నప్పటికీ బహిర్గతం చేయడం లేదు. కానీ జూపల్లి, కొండా సురేఖలు తమ అసంతృప్తిని పరోక్షంగా, ప్రత్యక్షంగా బయటపెట్టడం చర్చనీయాంశమైంది.

సమన్వయంలోపంతో సమస్యలు 

 తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య అంతర్గత సమన్వయం పూర్తిగా దెబ్బతిన్నదనే విషయాన్ని ఈ తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో.. క్యాబినెట్ సహచరులే ఇలా తిరుగుబాటు జెండా ఎగరేయడం,   లేఖలు రాయడం రేవంత్ రెడ్డి నాయకత్వ పటిమకు సవాల్‌గా మారింది. మరి ఈ అంతర్గత చిచ్చును అధిష్ఠానం జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేస్తుందా.. లేక రాబోయే రోజుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ద్వారా అసంతృప్తులకు చెక్ పెడతారా అనేది వేచి చూడాల్సిందే.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Ongole Politics: కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
కూటమి ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తున్న బాలినేని - కోవర్ట్ అంటున్న దామచర్ల - టీడీపీ, జనసేనకు మరో గండం తప్పదా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
AP Assembly: అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
అసెంబ్లీకి రాకుండా ముట్టడి అంటే అనర్హతే - వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కఠిన చర్యలకు రెడీ అయ్యారా?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget