News
News
X

KCR Faces Challenges : ఓ వైపు బీఆర్ఎస్ - మరో వైపు వివాదాలు ! తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెరుగుతున్న సవాళ్లు

ఓ వైపు పార్టీ నేతలపై కేసుల వల్ల బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలపై ప్రభావం పడుతోంది. ఈ వివాదాలతో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, పార్టీ కమిటీల్ని నియమించలేకపోయారు.

FOLLOW US: 
Share:

KCR Faces Challenges : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సవాళ్లు చుట్టుముడుతున్నాయి. ఓ వైపు భారత రాష్ట్ర సమితిని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయాలని ఆయన అనుకుంటున్నారు. కానీ వరుసగా వస్తున్న వివాదాలు, పార్టీ నేతలపై కేసులు, తెలంగాణ ఆర్థిక సమస్యలు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సి రావడం వల్ల .. దేనిపైనా పూర్తి సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో అనుకున్న పనులన్నీ వాయిదా పడుతున్నాయి. ఇది బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ గందరగోళానికి కారణం అవుతోంది. తాజాగా ఎమ్మెల్యేలకు ఎర కేసులో బాధితురాలిగా ఉన్న బీఆర్ఎస్ .. కేసు సీబీఐకి వెళ్లడం వల్ల మరింత టెన్షన్ కు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేసీఆర్ దీనిపైనా దృష్టి  పెట్టాల్సి ఉంది. 

పార్టీ నేతలను చుట్టు ముడుతున్న వివాదాలు !

బీఆర్ఎస్ పార్టీ నేతలను వరుసగా కేసులు చుట్టు ముడుతూండటం కేసీఆర్‌కు ఇబ్బందికరంగా మారింది. వారికి న్యాయ సహాయం అందించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేుకుంటున్నారు. ఫామ్ హౌస్ కేసులో ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అంశాన్ని టేకప్ చేశారు. దాదాపుగా ప్రతీ రోజూ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తున్నారు. మరో వైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలోనూ ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఫామ్ హౌస్ కేసు పూర్తిగా సీబీఐకి చేతుల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌కు లేదా సుప్రీంకోర్టుకు  వెళ్లి న్యాయపోరాటం చేయాల్సి ఉంది. లేకపోతే.. ఈ కేసు అనేక మలుపులు తిరిగి రాజకీయంగా కేసీఆర్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కేసీఆర్ తన సమయాన్ని వెచ్చించక తప్పదని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 

బీఆర్ఎస్ విస్తరణ ప్రణాళికలు ఆలస్యం !

క్రిస్మస్ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాలనుకున్నారు. కానీ వెళ్లలేకపోయారు. ఆరు రాష్ట్రాలకు కిసాన్ సెల్ కమిటీలను ప్రకటించాలనుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. ఢిల్లీలో ప్రకటించి.. అక్కడే మీడియాతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఢిల్లీ పర్యటనే వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ఢిల్లీకి  వెళ్తారన్నదానిపై స్పష్టత లేదు. అదే సమయంలో బీఆర్ఎస్  తరపున అన్ని రాష్ట్రాలకు కన్వీనర్లను నియమించాలని అనుకుంటున్నారు. ఈ కసరత్తు చేయాల్సి ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు ప్రగతి భవన్ కు వచ్చి కలుస్తున్నారు. అయితే ఎవర్ని ఎంపిక చేయాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ భావజాలాన్ని మరింతగా తీసుకెళ్లడానికి సాహితీ  వేత్తలతోనే సంప్రదింపులు జరుపుతున్నారు.  ఇవన్నీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. 

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలూ నిర్వహించలేకపోయారు !

కేంద్రం వల్ల తెలంగాణకు రూ. 40వేల కోట్లకుపైగా ఆదాయ నష్టం జరిగిందని..ఈ విషయాన్ని అసెంబ్లీలో కూలంకుషంగా చర్చించి ప్రజల ముందు ఉంచారని కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్‌లో వారం పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలని ఆదేశించారు.అయితే ఈ నెల  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించలేకపోయారు. దీనికి కారణం.. బీఆర్ఎస్‌కు అధికారికంగా ఆమోద ముద్ర పడటం..  లిక్కర్ స్కాం కేసు, ఫామ్ హౌస్ కేసుల్లో ఈడీ జోక్యం వంటి ఘటనలు చోటు చేసుకోవడమే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగోలేదన్న చర్చ జరుగుతోంది. దానిపైనా కేసీఆర్ దృష్టి పెట్టాల్సి లఉంది. వీటిపైనే కేసీఆర్ ఎక్కువ దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో .. తాను ఓ పిలుపు ఇస్తే మిగతా మొత్తం పార్టీ నేతలు చూసుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రతీ అంశాన్ని తానే చూసుకోవాల్సి వస్తూండటంతో.. కేసీఆర్ కు  అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.
 
Published at : 29 Dec 2022 04:34 AM (IST) Tags: BRS KCR Telangana Politics

సంబంధిత కథనాలు

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

టీడీపీ నేతలకు షాక్ - పరువు నష్టం దావా వేసిన రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

కృష్ణా  జిల్లా వైఎస్‌ఆర్‌సీపీలో రచ్చరచ్చ-  ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

BRS Parliamentary Party Meeting: బీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ - ముఖ్యంగా ఆ విషయాలపైనే ఫోకస్ !

టాప్ స్టోరీస్

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

BJP Govt: మోడీ సర్కార్‌కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు

Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు