Budda venkanna : విజయవాడ టీడీపీ టిక్కెట్ రేసులో బుద్దా వెంకన్న - పశ్చిమ టిక్కెట్ తనకే ఇవ్వాలని విజ్ఞప్తి !
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేస్తున్నారు.
Budda venkanna : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వెల్లడించారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే ఆయన పార్టీ అదినేత చంద్రబాబు ను కోరినట్లు చెబుతున్నారు. బెజవాడ టీడీపీ లో పోటీ చేసే ఆశావహుల సంఖ్య పెరుగుతుంది.ఇప్పటికే బెజవాడలోని మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యుర్దులకు కోదవ లేదు..అయితే ఇప్పుడు మరో అభ్యర్దిగా మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పోటీలో ఉన్నట్లుగా తనకు తాను ప్రకటించుకున్నారు.
2024లో టీడీపీ ని అధికారంలోకి తీసుకురావటమే ధ్యేయంగా పని చేస్తామని ఇందులో భాగంగానే తాను పోటీ చేయాలనకుంటున్నట్లుగా వెంకన్న స్పష్టం చేశారు.బుద్దా వెంకన్న ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.బీసీ వర్గానికి చెందిన నేతగా ఈ సారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండే పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా బుద్దా వెంటకన్న తన అభిమానుల వద్ద చెబుతున్నారని అంటున్నారు. విజయవాడ పశ్చిమ టీడీపీలో ఇప్పటికే విభేదాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తన కుమార్తెకు సీటు ఇప్పించుకున్నారు. ఇందుకు విజయవాడ ఎంపీ కేశినేని నాని సహకరించారు. అయితే జలీల్ ఖాన్ కాకుండా ఆయన కుమార్తె కు సీటు కేటాయించటం పై టీడీపీలో ఉన్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు వ్యతిరేకించాయి. దూదేకుల కోటాలో నాగుల్ మీరాకు సీటు ఇవ్వాలని లేదంటే, మరెవరికయినా సీటు ఇస్తే పని చేస్తామని బుద్దా, నాగుల్ మీరా వర్గాలు పార్టీ అధిష్టానం కు ఫిర్యాదు చేశాయి. అయినా కేశినేని నాని పంతం పట్టి జలీల్ కుమార్తెకు సీటును ఇప్పించారు. పశ్చిమంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కవుగా ఉండటంతో ఆ ప్రభావం ఉంటుందన్న కోణంలో ఎంపీ కేశినేని నాని జలీల్ కుమార్తెకు సీటు ఇప్పించటం పై అలిగిన బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వర్గాలు ఆ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారనే ప్రచారం కూడ ఉంది.దీంతో టీడీపీ అభ్యర్ది పరాజయం పాలయ్యారని పార్టి వర్గాల్లో చర్చ జరిగింది.
బుద్దా వెంటకన్న బీసీ వర్గానికి చెందిన సామాజిక వర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీ కారణంగానే టీడీపీలో బుద్దా వెంకన్నఅధిక ప్రాధాన్యత లభించింది.ఎమ్మెల్సీగా అవకాశంతో పాటుగా,ఇప్పుడు పార్టీ పరంగా ఉత్తరాంధ్ర కు ఇంచార్జ్ గా కూడ బుద్దా వెంకన్న టీడీపీలో పని చేస్తున్నారు.విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక వర్గం తరువాత బీసీ వర్గానికి చెందిన నగరాల సామాజిక వర్గం ఎక్కువ జనాభాగా ఉంది.ఆ తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ కోణంలో చూసి తనకు పశ్చిమ సీటు ఇవ్వాలని బుద్దా డిమాండ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
గతంలో ఎనాడూ పశ్చిమ నియోజకవర్గం నుండి బీసీలకు అవకాశం ఇవ్వలేదు. కాబట్టి స్దానికంగా స్దిర నివాసం ఏర్పరచుకోని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనకు బలం ఎక్కవగా ఉంటుందని, స్దానికంగా లేని వారికి పార్టీ సీటు కేటాయిస్తే, ఇప్పటి వరకు వచ్చిన ఇబ్బందులను పరిగణంలోకి తీసుకొవాలని బుద్దా పాత లెక్కలను కూడ అధినాయకుల ముందు ఉంచుతున్నారట. అయితే ప్రస్తుతం వైసీపీ నుండి మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహిస్తూ, జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీ కి ధీటుగా అభ్యర్దిని నిలబెట్టాలంటే, తన ప్రోఫైల్ ను టీడీపీ ఖచ్చితంగా పరిశీలించాల్సిందేనని బుద్దా ధీమాగా చెబుతున్నారు.