అన్వేషించండి

BJP Reaction : సోము వీర్రాజు కూడా కలిశారుగా ? పవన్‌తో చంద్రబాబు భేటీ ఏపీ బీజేపీ రియాక్షన్ ఇదిగో

టీడీపీ అధినేత తో పవన్ భేటీని బీజేపీ సీరియస్‌గా తీసుకోలేదు. పవన్‌కు సంఘిభావం చెప్పడానికి సోము వీర్రాజు కూడా కలిశారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.


BJP Reaction :  భారతీయ జనతా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ వెంటనే చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ సంచలనం అయింది. మిగతా విషయాలేమో కానీ బీజేపీలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో పెద్దగా విశేషం ఏమీ లేదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. చంద్రబాబు - పవన్‌ కల్యాణ్‌ భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోపవన్ కల్యాణ్ పర్యటన విషయంలో జరిగిన పరిణామాల విషయంలో.. సంఘిభావం తెలిపేందుకు  నిన్న సోమువీర్రాజు కూడా పవన్‌ను కలిశారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబును పవన్ అలానే కలిశారని బీజేపీ, పవన్‌ విడిపోవాలనుకునేవారే హైప్‌ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 

జనసేనకు అండగా నలిచిన బీజేపీ 

జనసేన అధినేత పవన్ ను ఒంటరిని చేయాలనే కుట్రను బిజెపి ఖండించి జనసేన కు అండ గానిలిచిందని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. జనసేన కు అండగా సోమూవీర్రాజు నిలబడ్డారు .. రాష్ట్ర ప్రజలు బిజెపి, జనసేనకు మద్ధతివ్వాలని కోరారు. వైసిపి గత మూడు రోజులుగా దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడిందన్నారు.  విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులకు గాయాలైతే గాయపడిన మంత్రుల హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి కదా అని ప్రశ్నించారు.  మీడియా ముఖంగా మంత్రులు  తిడుతున్నారు కదా. ఎందుకీ డ్రామా  అని మండిపడ్డారు. వైసిపి మంత్రులు, అధికారులు జనసేన ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేదు. బిజెపి వారికి అండగా ఉంటుందన్నారు. 

తప్పుడు కేసులు పెడితే భయపడబోమన్న బీజేపీ 

తప్పుడు కేసులు పెట్టి పార్టీని భయబ్రాంతులకు గురి చేస్తే భయపడతామా ...ప్రజా ఉద్యమాలను నిర్మూలిస్తామనేది పిచ్చి నిర్ణయం అవుతుందన్నారు. బిజెపి  జనసేన కలిసి ఉద్యమాలు చేపడుతుందని ప్రకటించారు. తప్పుడు కేసులపై ఎపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.  జనసేన కార్యకర్తల పై అక్రమంగా పెట్టిన కేసులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ‌ జరిపించాలన్నారు.  వైసిపి మంత్రులు ఎపి రాజకీయాల్లో కామెడీగా మారిపోయారు .. జోగి రమేష్, రోజా, అంబటి కామెడీ కే కేరాఫ్ గా మారిపోయారన్నారు. బఫూన్లు, కామెడీ ఆర్టిస్ట్ ల్లా‌ మారొద్దు ..వైసిపి ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోతే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

జనసేనతో  కలిసి ప్రజాపోరాటాలు చేస్తామన్న విష్ణు

బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ విషయంలో పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. బీజేపీతో కటీఫ్‌ను జనసే్న ప్రకటించకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చు. అదే సమయంలో అటు టీడీపీ, జనసేన పొత్తుల గురించి మాట్లాడలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కలిసి పోరాడటానికి రావాలని పిలుపునిచ్చాయి. ఎన్నికల్లో పోటీ గురించి  ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. దీంతో మిత్రుడికి మద్దతుగానే ఉండాలని ఏపీ బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.  అయితే టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వంపై పోరాడుతుందో లేదో మాత్రం స్పష్టత లేదు. 

టాప్ హెడ్ లైన్స్

US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Embed widget