అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బండి సంజయ్‌ అసంతృప్తి- కేంద్రమంత్రి పదవి తీసుకునేందుకు నిరాకరణ!

జీవితంలోని కొన్ని అధ్యాయాలు పూర్తి కాకుండానే ముగించాల్సి ఉంటుందని అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. అధినాయకత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో మరో నాలుగైదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్‌తో బీజేపీ గట్టిగానే పోరాడుతోంది. తామే ప్రత్యామ్నాయం అనే స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించిన బండి సంజయ్‌ని తప్పించడంపై నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. కొందరు నేతలు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నా... సంజయ్‌కు అనుకూలంగా ఉన్న వారిలో మాత్రం ఆ హ్యాపినెస్ లేదు. అంతెందుకు పార్టీ మాటే శిరోధార్యం అన్న బండి సంజయ్‌లో కూడా అసహనం ఉందని తెలుస్తోంది.  

తెలంగాణ అధ్యక్షుడిగా తనను తప్పిస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన్ని రెండు రోజు క్రితమే ఢిల్లీ పిలిపించిన అధినాయకత్వం పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ మార్పు సరైందని కాదని ఆయన వాదించే ప్రయత్నం చేశారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా సపోర్ట్ లభించింది. 

బండి సంజయ్ మాటలు కానీ, ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తులను కానీ బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. మార్పుపై నిర్ణయం తీసుకున్నామని... పార్టీని సక్సెస్‌ఫుల్‌గా నడిపిన బండి సంజయ్‌కు మంచి పదవి ఇస్తామన్నారు. కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు కూడా సంకేతాలు పంపించారు. అయితే ఎన్నికల మూడ్‌లో ఉన్న కేడర్‌ను పార్టీని డిస్టర్బ్‌ చేయడం మంచిది కాదని ఆయన చెప్పుకొచ్చారు. అయినా అధినాయకత్వం వినలేదని సమాచారం. 

కేంద్రమంత్రి పదవి వద్దన్న సంజయ్‌?

అధ్యక్షుడిగా తనను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్‌ అసంతృప్తిగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఆయన ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. ఢిల్లీ వెళ్లి వచ్చినప్పుడు ఎక్కడా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడ్డారు. తనకు ఆఫర్ చేసిన కేంద్రమంత్రి పదవిని కూడా కాదన్నారని తెలుస్తోంది. ఓ సామాన్య కార్యకర్తగానే ఉంటానని అధ్యక్షుడికి చెప్పినట్టు సమాచారం. 

కృతజ్ఞత మెసేజ్

కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియమించిన విషయంపై ఏదో ముబావంగా స్పందించారు బండి సంజయ్‌. ట్విటర్ వేదిగా ఓ మేసేజ్ చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్న టైంలో సహకరించిన వారికి ధన్యవాదాలు చెబుతూనే... కిషన్‌ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తగా పని చేస్తానంటూ ముగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..."నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి నాయకులు & కార్యకర్తలు అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజాసంగ్రామయాత్రలో అడుగడుగునా నన్ను స్వాగతించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ రోజు నన్ను తీర్చిదిద్దిన కరీంనగర్ ఓటర్లకు & కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.

మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు పూర్తి కాకుండానే ముగించాల్సి ఉంటుంది. నా పదవీకాలంలో నేను అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టినట్లయితే మన్నించాలి. నేను విచారకరమైన కథను కానందుకు నేను సంతోషిస్తున్నాను. కానీ మీరందరూ నాకు మరపురాని క్షణాలను అందించారు. అరెస్టుల సమయంలో నాతో ఉండటం, దాడి జరిగినప్పుడు పక్కన నిలబడటం, కేసీఆర్ పాలనపై నేను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులు ఎదుర్కొన్నప్ప టైంలో అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్. వర్షం కురిసినా, పిడుగులు పడినా మీరు నాతో ఉన్నారు, ఎందుకంటే నేను మీలో ఒకడిని, ఎల్లప్పుడూ అలానే ఉంటాను. కిషన్ రెడ్డి సమర్థ నాయకత్వంలో నేను కొత్త ఉత్సాహంతో పార్టీ కోసం పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అని అందరికీ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. 

ఉదయం అభినందన మెసేజ్

ఈ ఉదయం మరో ట్వీట్ చేస్తూ... రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కేంద్ర పర్యాటక, సాంస్కృతిక &ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డికి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అభినందనలు. అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను అని పోస్టు చేశారు. 

Also Read: ఇది న్యూ బీజేపీ, ఏ పార్టీ నుంచి వచ్చినా ప్రాధాన్యత ఇస్తాం- స్పష్టమైన సంకేతాలు పంపిన హైకమాండ్

Also Read: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ హైకమాండ్ వ్యూహంపై అస్పష్టత - అసలేం చేయాలనుకుంటున్నారు ?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget