అన్వేషించండి

AP TDP Janasena Social Media War: ఏపీలో కూటమికి సోషల్ సెల్ఫ్ గోల్ - చంద్రబాబు-పవన్ మైత్రి ఓకే.. మరి సోషల్ సైనికుల యుద్ధమేంటి?

TDP Janasena Social Media War: చంద్రబాబు-పవన్ కళ్యాణ్ భేటీలు సఫలమవుతున్నా, సోషల్ మీడియాలో టీడీపీ-జనసేన శ్రేణుల మధ్య ఆగని ట్రోలింగ్ వార్. కూటమిపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Janasena Sainiks vs TDP IT Cell:  ఆంధ్రప్రదేశ్‌లో పాలనాపరంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత సఖ్యతతో ముందుకు సాగుతున్నారు. కీలక విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల పొత్తుల విషయంలో ఇద్దరు అగ్రనేతలు తరచూ భేటీ అవుతూ కూటమి ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడిపిస్తున్నారు. అయితే, అగ్రనాయకత్వం స్థాయిలో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ, క్షేత్రస్థాయిని ,  ప్రజాభిప్రాయాన్ని శాసిస్తున్న సోషల్ మీడియా వేదికల్లో మాత్రం టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య నిత్యం సైబర్ యుద్దం  సాగుతూనే ఉండటం కూటమి రాజకీయాల్లో సరికొత్త ఆందోళనకు దారితీస్తోంది.

ఏకంగా వార్ చేసుకుంటున్న సోషల్ సైనికులు

రెండు పార్టీల అధినేతలు భేటీలు జరుపుతూ కేడర్‌కు ఐక్యతా సంకేతాలు ఇస్తున్నప్పటికీ, డిజిటల్ వేదికలైన  ఎక్స్ , ఫేస్‌బుక్ , యూట్యూబ్ వేదికలలో రెండు పార్టీల డిజిటల్ వింగ్స్, సానుభూతిపరులు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, హేళనలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాంతిభద్రతలు,  పరిపాలనాపరమైన అంశాలపై ఏ చిన్న వ్యాఖ్య చేసినా, టీడీపీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ భావోద్వేగాలతో రియాక్ట్ కావడం కనిపించే దృశ్యం. దీనికి ప్రతిగా జనసేన  సైనికులు  గతంలో పొత్తు కోసం పవన్ చేసిన త్యాగాలను, సీట్ల సర్దుబాటులో చూపించిన ఉదారతను గుర్తుచేస్తూ విరుచుకుపడుతున్నారు.

క్షేత్రస్థాయి ఆధిపత్యపోరు

ఈ నెట్ వార్ కేవలం డిజిటల్ సైజుకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఆధిపత్య పోరుగా రూపాంతరం చెందుతోంది. కాకినాడ, పిఠాపురం, తాడేపల్లిగూడెం, తెనాలి నుంచి మొదలుకొని విశాఖపట్నం పెందుర్తి వరకు పలు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రాటోకాల్ రగడ,   స్థానిక నగర పాలక వర్గాల సీట్ల కేటాయింపులపై స్థానిక నాయకుల నడుమ తలెత్తుతున్న విభేదాలు సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. ఈ సమస్యలను ఆయా పార్టీల ఐటీ సెల్లు రాజకీయం చేస్తూ పరస్పరం ట్రోలింగ్‌కు తెగబడుతున్నాయి. ఇక్కడ విచిత్రమైన పరిణామం ఏంటంటే.. ఈ రెండు ప్రధాన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని ,  దాని విధానాలను టార్గెట్ చేయాల్సింది పోయి, తమలో తామే అంతర్గత యుద్ధానికి ప్రాధాన్యమిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడంలో చూపించని ఉత్సాహాన్ని పరస్పరం బురదజల్లుకోవడంలో చూపిస్తుండటంతో అధికార కూటమి ప్రాథమిక లక్ష్యానికే గండిపడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత పార్టీల డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికే సమయం సరిపోతోందని నిపుణులు అంటున్నారు.

కంట్రో్ల చేయలేకపోతున్న అధిష్టానాలు

ఈ శ్రేణులను కంట్రోల్ చేయడం ఇటు టీడీపీ అధిష్టానానికి, అటు జనసేన హైకమాండ్‌కు కూడా సాధ్యాసాధ్యాల దాటిన విషయంగా మారింది. రెండు పార్టీల అధినేతలు సమన్వయ కమిటీలు వేసి, విప్ జారీ చేసినప్పటికీ, వికేంద్రీకృతమై ఉన్న ఇండిపెండెంట్ హ్యాండిల్స్, అభిమాన సంఘాల పేజీలు నాయకుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా, అగ్ర నేతలు ఎంత మైత్రీ బంధాన్ని చాటిచెప్పినా, సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే ప్రతికూల ప్రచారం సగటు ఓటరులో కూటమి స్థిరత్వంపై అనుమానాలు రేకెత్తిస్తోంది.  స్థానిక సంస్థల  ఎన్నికల సమయానికి ఈ సోషల్ మీడియా పోరు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. వార్డులు, డివిజన్ల స్థాయిలో టికెట్ల కేటాయింపులు జరిగేటప్పుడు ఈ అంతర్గత విభేదాలు మరింత రచ్చకెక్కే అవకాశాలున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ రాజకీయంగా పుంజుకునేందుకు పావులు కదుపుతోంది.

ఈ ధోరణికి తక్షణమే స్వస్తి చెప్పకపోతే, క్షేత్రస్థాయిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు మానసికంగా విడిపోయి, ఎన్నికల వేళ పరస్పరం ఓటు బదిలీ  కాకుండా పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అధినేతలు కేవలం సమావేశాలకే పరిమితం కాకుండా, తమ డిజిటల్ సైన్యాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసి, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే తప్ప ఏపీ ఎన్డీయే కూటమిలో ఈ  సోషల్ మంటలు చల్లారేలా కనిపించడం లేదు.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Bharat Summit Controversy: హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget