అన్వేషించండి

AP Local Body Unanimous Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాల రచ్చ - వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణలపై లభించని సానుభూతి - నాడు ఇలా చేయడమే కారణమా?

Unanimous Polls AP: ఏపీ స్థానిక సంస్థల్లో ఏకగ్రీవాలపై వైసీపీ ఆరోపణలకు పెద్దగా మద్దతు లభించడం లేదు. గతంలో జగన్ హయాంలో ఇంత కంటే ఎక్కువగా ఏకగ్రీవాలు జరగడమే కారణమా?

AP Politics Public Sympathy Jagan:  ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవాల అంశం  దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రస్తుత వేళ, పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం,  కొన్ని చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ,  ఉపసంహరణలు జరగడంపై వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం, నామినేషన్ రిగ్గింగ్ జరుగుతోంది  అంటూ విచారణాధికారులు, కేంద్ర బలగాల పర్యవేక్షణ కావాలని వినతులు ఇచ్చే స్థాయికి వైఎస్‌ఆర్‌సీపీ పోరాటాన్ని తీసుకెళ్లింది. అయితే, సాధారణంగా ఇలాంటి విషయంలో ప్రతిపక్షానికి దక్కాల్సిన  సానుభూతి  మాత్రం క్షేత్రస్థాయిలో వైఎస్‌ఆర్‌సీపీకి లభించడం లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం.

గతంలో ఇదే తరహాలో ఏకగ్రీవం చేసుకున్న  వైఎస్ఆర్‌సీపీ

ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. గడిచిన వైఎస్‌ఆర్‌సీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జరిగిన పరిణామాలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2021 స్థానిక సంస్థల  ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు రికార్డు స్థాయిలో వేలాది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో విపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు నామినేషన్లు వేయకుండా బెదిరించారని, నామినేషన్ పత్రాలను చింపేశారని, పోలీసు బలగాలను ఉపయోగించి అభ్యర్థులను అడ్డుకున్నారని ఆరోపించినప్పుడు.. వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం దానిని  జగన్ మార్క్ ప్రజా సంక్షేమానికి లభించిన అపారమైన ప్రజా తీర్పు  గా అభివర్ణించింది. నాటి ఏకగ్రీవాలను ప్రజాస్వామ్య విజయంగా గంభీరంగా సమర్థించుకున్న అదే పార్టీ, నేడు ప్రతిపక్షంలోకి రాగానే అదే ఏకగ్రీవాలను  రాజ్యాంగ విరుద్ధం  అని సంబోధించడం ప్రజల్లో ఆత్మరక్షణ వైఖరిగా కనిపిస్తోంది.

అప్పట్లో అలా చేయడం వల్లనే సమస్యలా? 

ప్రస్తుతం సోషల్ మీడియా,  పొలిటికల్ డిస్కషన్లలో వైఎస్‌ఆర్‌సీపీ వాదనలపై తీవ్రస్థాయిలో కౌంటర్లు పేలుతున్నాయి.  మీరు నేర్పిన విద్యయే నీరాజక్షా  అంటూ టీడీపీ, జనసేన శ్రేణులు, సాధారణ నెటిజన్లు పాత వీడియోలను, నాడు ఏకగ్రీవాలపై వైఎస్‌ఆర్‌సీపీ నేతలు చేసిన కామెంట్లను రీ-షేర్ చేస్తున్నారు. గతంలో తాము చేసిన విధానాలనే ఇప్పుడు సరికొత్తగా ప్రశ్నిస్తుండటంతో, జగన్ వ్యాఖ్యలలో నైతిక స్పష్టత లోపించిందనే అభిప్రాయం పబ్లిక్ డొమైన్‌లో బలంగా వ్యాపించింది. ఫలితంగా వైఎస్‌ఆర్‌సీపీ పట్ల సగటు ఓటరులో  సానుభూతి పవనాలు రావడం లేదని స్పష్టమవుతోంది.  ఒకే ప్రక్రియను తాము అధికారంలో ఉన్నప్పుడు  ప్రజాస్వామ్య తీర్పు  అని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హత్య ' అని వ్యాఖ్యానించడం వల్ల ఏదైనా రాజకీయ పార్టీ విశ్వసనీయత దెబ్బతింటుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రస్తుత రోడ్డెక్కి చేస్తున్న పోరాటాలకు, ప్రెస్ మీట్లలో లేవనెత్తుతున్న ఆరోపణలకు ప్రజా స్పందన లేదా పౌర సమాజం నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడానికి ఈ నైతిక వైరుధ్యమే ప్రధాన అవరోధంగా మారింది.

అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ 

 స్థానిక సంస్థల ఎన్నికల తీరు చూస్తే.. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపే మొగ్గు చూపడం లేదా అధికార బలంతో ఏకగ్రీవాలు సాధించడం ఏపీ స్థానిక రాజకీయాల్లో ఒక ప్రతికూల సంప్రదాయంగా మారిపోయిందనే వాదన ఉంది. అయితే, ఈ విధానానికి బలమైన వ్యతిరేకత తెచ్చి ప్రజల్లో ఉద్యమ వాతావరణం సృష్టించాలంటే, గతంలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకునే రీతిలో వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం కూడా వ్యూహాత్మక లోపమే.   ఏకగ్రీవాల వివాదం ఏపీ రాజకీయాల్లో కొత్తదేమీ కాకపోయినా.. వైఎస్‌ఆర్‌సీపీ 'ద్వంద్వ వైఖరి'గా ప్రజలు భావించడం వల్లే వారికి ఆశించిన స్థాయిలో సపోర్ట్ లేదా సానుభూతి దక్కడం లేదు. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో చేసే పోరాటాలు ప్రజామోదం పొందాలంటే, గతం కంటే విభిన్నమైన, పారదర్శకమైన నైతిక వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం వైఎస్‌ఆర్‌సీపీ ముందర స్పష్టంగా కనిపిస్తోంది.
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Telangana El Nino Water Crisis : ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget