అన్వేషించండి

AP Local Elections TDP Janasena Seat Sharing: స్థానిక ఎన్నికల్లో బాబు-పవన్ పొత్తు - అగ్రనేతల లెక్కలు ఓకే.. మరి క్షేత్రస్థాయి కేడర్ సమన్వయం సాధ్యమేనా?

AP Local Body Polls: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఫార్ములా చెల్లదంటున్న జనసేన కేడర్, తిరుగుబాటు యోచనలో టీడీపీ నేతలు. సమన్వయం ఎలా ?

TDP Janasena Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న వేళ, అధికార ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుబాటు అత్యంత సంక్లిష్టమైన ఘట్టంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లిలో సమావేశమై పొత్తులు, మేయర్, జెడ్పీటీసీ, చైర్‌పర్సన్ స్థానాల విభజనపై సుదీర్ఘంగా చర్చించారు. అసెంబ్లీ ,  పార్లమెంట్ ఎన్నికల్లో అగ్రనేతలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే నియోజకవర్గ స్థాయి వరకు కేడర్ క్రమశిక్షణతో పనిచేసింది. కానీ, గ్రామీణ, పట్టణ స్థాయి పోలింగ్ బూత్‌ల వద్ద ముఖాముఖి తలపడే స్థానిక పోరులో కేవలం బాబు-పవన్‌ల భేటీలు, పిలుపులు కింది స్థాయి శ్రేణులను పూర్తిగా ఒకే తాటిపైకి తేగలవా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయంలో అసలైన ప్రశ్న.

జనసేన క్యాడర్ ఆశలు ఎక్కువే!

శాసనసభ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్‌ సాధించిన తర్వాత జనసేన కేడర్ ఆత్మవిశ్వాసం, ఆకాంక్షలు ఆకాశాన్ని తాకాయి. సార్వత్రిక ఎన్నికల సమయాన రాష్ట్ర ప్రయోజనాల కోసం 21 సీట్లకే పరిమితమయ్యామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం తమ  ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వబోమని పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ముఖ్య నేతలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన గ్రాఫ్ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల నాటి  ఫార్ములా ఇక్కడ వర్తించదని కేడర్ ఇప్పటికే తెగేసి చెబుతోంది. 30 శాతానికి పైగా స్థానాలు దక్కించుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో సొంత నాయకత్వాన్ని బలపరుచుకోవాలని జనసేన పట్టుబడుతోంది.

టీడీపీ క్యాడర్ బలం ఉన్న చోట్ల వెనక్కి తగ్గదు!   

అటు తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ఏపీలో ఐదు దశాబ్దాల బలమైన ఓటు బ్యాంకు, బూత్ స్థాయి బలగాలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ వేధింపులు ఎదుర్కొని, స్థానికంగా పార్టీ జెండాను నిలబెట్టిన టీడీపీ గ్రామ స్థాయి నేతలు ఈసారి ఎలాగైనా పదవులు చేజిక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. చంద్రబాబు ఎన్ని సర్దుబాట్లు చెప్పినా.. తమకు దక్కాల్సిన సర్పంచ్, ఎంపీటీసీ లేదా కౌన్సిలర్ సీటును జనసేనకో, బీజేపీకో కేటాయిస్తే ఊరుకునే పరిస్థితి క్షేత్రస్థాయి టీడీపీ నేతల్లో లేదు. ఒకవేళ పార్టీ నుంచి అధికారికంగా బి-ఫామ్ రాకపోయినా 'రెబెల్స్'గా అభ్యర్థులను దింపడానికో లేదా స్వతంత్రంగా పోటీ చేయడానికో స్థానిక టీడీపీ శ్రేణులు వెనుకాడేలా లేవు.  ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఈ కూటమిలోని అసమ్మతిని అనుకూలంగా మార్చుకోవడానికి వేచి చూస్తోంది. నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు, పవన్ ఎంత మైత్రిని ప్రదర్శించినా, పంచాయతీ, వార్డు స్థాయిలో కుటుంబాలు, పాత కక్షలు, వ్యక్తిగత ప్రాబల్యాలే గెలుపోటములను శాసిస్తాయి. కూటమిలో సీటు దక్కని టీడీపీ లేదా జనసేన అసంతృప్త నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయం. ఆ చీలిక ద్వారా తాము పుంజుకోవచ్చని వైఎస్సార్‌సీపీ ఆశిస్తోంది. ఈ రకమైన సాంప్రదాయ స్థానిక వైరుధ్యాలను అగ్రనేతలు పైస్థాయి నుంచి నియంత్రించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

బలమున్న చోట పోటీ

ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు చంద్రబాబు  బలం ఉన్న చోట మిత్రపక్షానికే ప్రాధాన్యం అనే ఫార్ములాను ప్రతిపాదించారు. అయితే, ఒక నిర్దిష్ట పంచాయతీలో లేదా వార్డులో టీడీపీకి ఎక్కువ బలముందా, లేక జనసేనకు ఉందా అని తేల్చడం కత్తిమీద సాము లాంటిది. పార్టీ కమిటీల నిర్వహణ, ఉమ్మడి సర్వేలు, నామినేటెడ్ పదవుల హామీలతో అసంతృప్తిని చల్లార్చాలని బాబు-పవన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, అధికారం తలుపు తడుడుతున్న వేళ పదవుల కోసం ద్వితీయ శ్రేణి నేతల మధ్య పోటీ రాపిడికి దారితీస్తోంది.  రాష్ట్రస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ఐక్యత ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ, స్థానిక ఎన్నికలు అనేది పూర్తిగా కింది స్థాయి నాయకుల ఉనికి, భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పంచాయతీ, మున్సిపాలిటీ స్థాయిలో చోటుచేసుకునే  ఫ్రెండ్లీ ఫైట్లు  లేదా తిరుగుబాట్లు ప్రధాన కూటమి ఐక్యతను దెబ్బతీయకుండా, కేడర్‌ను సమన్వయం చేయడమే అమరావతి పెద్దలకు రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు కానుంది.
 
 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Elections: పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
పోలింగ్‌కు ముందే 17 చైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.. విజేతల పూర్తి వివరాలు
Karnataka Political Sting Operation 2026: కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ కలకలం - సొంత పార్టీ నేతలపై సిద్ధరామయ్య ఆరోపణలు.. అసలేం జరుగుతోంది?
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
AIMIM AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
ఏపీ స్థానిక పోరులో ఎంఐఎం - కడప, హిందూపురంలో బరిలోకి ఒవైసీ.. వైసీపీకి ఊహించని దెబ్బ?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 3 రోజులు సెలవులు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Embed widget