అన్వేషించండి

United Politics : వైఎస్ఆర్‌సీపీ సమైక్యాంధ్ర నినాదానికి బీఆర్ఎస్‌కు లింక్ ఉందా ? జరగుతున్న రాజకీయం దేనికి సంకేతం ?

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం డైనమిక్‌గా మారిపోతోంది. ఒకేసారి ఏపీ అధికార పార్టీ సమైక్యాంధ్ర నినాదం తీసుకు రాగా తెలంగాణ అధికార పార్టీ.. జాతీయ వాద బావంతో తమ పార్టీ పేరు మార్చేసింది. ఇది దేనికి సంకేతం ?

United Politics :  విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మధ్య ..  కలుద్దాం..కలిసి ఉందాం అన్న స్లోగన్‌ మళ్లీ తెరపైకి వచ్చింది. ఉన్నట్టుంది ఇప్పుడెందుకు మళ్లీ ఒక్కటవుదాము అన్న మాటలు ఏపీ అధికారపార్టీ నేతల నుంచి  వస్తున్నాయనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ. నిన్నటివరకు నీళ్లు, సరిహద్దు వివాదాలు ఇలా ఒకటేమిటి పలు విషయాలపై మాకు అన్యాయం జరుగుతోందంటే మాకు జరుగుతోందని రెండు తెలుగురాష్ట్రాల నేతలు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఒక్కటవుదాం..ఒక్కటిగా ఉందాం అన్న మాటలు ఏపీ పాలకుల నుంచి వినిపించడంతో రాజకీయ వాతావరణం మారిపోయింది. 

రెండు రాష్ట్రాలు కలిసిపోవాలన్నదే తమ విధానమంటున్న వైఎస్ఆర్‌సీపీ

ముందస్తు ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాలు కసరత్తులు చేసుకుంటున్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.  తెలంగాణ, ఏపీల్లో ఎవరి రాజకీయాలతో వాళ్లు బిజీగా ఉన్నారు. కేంద్రంతో తెలంగాణ ఫైట్‌ చేస్తుంటే ఏపీలో అధికార పార్టీ విపక్షాలతో ఢీ కొడుతోంది. ఇలా ఆయా రాష్ట్రాల అధికా రపార్టీల నేతలు ఎవరి హడావుడిలో వాళ్లు ఉంటే ఇప్పుడు సరికొత్తగా రెండు రాష్ట్రాలు కలిసిపోతే బాగుంటుందన్న వాదన తెరపైకి వచ్చింది. విభజన చట్టంలోని హామీల గురించి ప్రస్తావిస్తూ ఏపీ వైసీపీ నేతలు మరోసారి కలిసి ఉండాలన్న ఆకాంక్షను బయటపెట్టారు. మళ్లీ ఇంతకు ముందులాగా ఏపీ రాష్ట్రంగా రెండు తెలుగురాష్ట్రాలు ఉండాలన్నదే మా పార్టీ ఉద్దేశ్యమని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. 

వైఎస్ఆర్‌సీపీపై ఘాటుగా స్పందించిన తెలంగాణ విపక్ష పార్టీలు

ఇప్పుడిదే తెలంగాణలో అగ్గి రాజేసింది. వైసీపీ నేతల తీరుపై టీఆర్‌ ఎస్‌ తో పాటు కాంగ్రెస్‌, బీజేపీ కూడా అహనం వ్యక్తం చేశాయి. తిట్టని తిట్టు తిట్టకుండా ఓ రేంజ్‌ లో ఆడేసుకున్నారు. తెలంగాణ నేతలు. మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతకాక మా రాష్ట్రంపై పడి ఏడుస్తారా అని అధికార టీఆర్‌ ఎస్‌ విమర్శించింది. అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ గా ఉన్న తెలంగాణని మళ్లీ సొంతం చేసుకోవాలన్న కుటిలబుద్ధితోనే వైసీపీ ఈ డ్రామాలాడుతోందని ఆరోపించింది. ఇక బీజేపీ అయితే ఇదంతా కుట్రలో భాగమనేనని తేల్చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం నుంచి డైవర్ట్‌ చేసేందుకే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకాలాడుతున్నారని విమర్శించింది. అటు కాంగ్రెస్‌ కూడా వైసీపీ నేతల మాటలను తప్పుబట్టింది. ఆనాడు రాష్ట్రం విడిపోతే తెలంగాణకే నష్టమని చెప్పిన వాళ్లు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్లీ ఇలాంటి మాటలు మాట్లాడతారని ఎద్దేవా చేసింది.  సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న విభజనచట్టం హామీపై వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న వాదనలు లేకపోలేదు. కేంద్రంతో విభజన హామీలపై తేల్చుకోకుండా ఇలాంటి అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు. ఇక విడిపోయినవాళ్లు కలిసే ప్రసక్తే లేదని పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఎలా వదలుకుంటామని తెలంగాణ ప్రజాసంఘాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఈ వి’భజన’మాటలు ఆపకపోతే వైసీపీకే నష్టమన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. 

ఆ మాటల వెనుక మర్మేమేమిటీ? 

తెలుగురాష్ట్రాలు కలవాలన్న ఆలోచన వైసీపీదా? లేదా టీఆర్ఎస్ దా? లేక కేసిఆర్ - వైసీపీ నేతలతో అలా పలికిస్తారా? ఉండవల్లి అరుణ్ కుమార్ తెరమీదకు తెచ్చిన ఈ అంశం వెనుక భారీ స్కెచ్ ఉందనే టాక్ నడుస్తోంది. అటెక్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అలవాటు పడిన రాజకీయనాయకులు తెలుగు రాష్ట్రాల మద్య సున్నితమైన అంశాలను అప్పుడప్పుడు మాట్లాడి ప్రజల అటెక్షన్ ను డైవర్షన్ చేస్తున్నారనే వాదనలు, సంఘటనలు లేకపోలేదు. ఉండవల్లి, సజ్జల కామెంట్స్ పై తెలంగాణలో అన్నీ పార్టీలు స్పందించాయి కానీ బీఆర్ఎస్ మాత్రం స్పందించలేదు ఎందుకో? అసలే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మారిన హడావుడిలో ఆ పార్టీ ఉంటే ఇప్పుడే ఎందుకు ఈ విభజన అంశం గురించి ఎందుకు అనుకున్నదో? ఏమో? మొత్తానికి సైలెంట్ అయిపోయింది ఆ పార్టీ. 

షర్మిల ఘాటు స్పందన మరింత ఆశ్చర్యకరం

తెలంగాణ వైఎస్ ఆర్ పార్టీ అధ్యక్ష్యురాలు వై.ఎస్. షర్మిల మాత్రం ఉండవల్లి, సజ్జల కామెంట్స్ పై ఘాటుగానే స్పందించారు. ఎప్పుడూ ఏపీ ప్రభుత్వాన్ని కానీ, వైసీపీని కానీ డైరక్ట్ గా విమర్శించిన ధాఖలాలు లేవు. మొదటిసారి షర్మిల ఈ అంశంపై మాట్లాడి, వైసీపీ పార్టీని విమర్శించడం కొసమెరుపు. ఈ సమైక్యవాద రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Maruti Victoris రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ - సిటీలో ఎంత ఇచ్చింది?, హైవేపై ఎంత చూపించింది?
Akshaye Khanna Dhurandhar : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అక్షయ్ ఖన్నా 'ధురంధర్' మూవీ 'Fa9la' సాంగ్... అర్థం ఏంటో తెలుసా..?
Car Skidding: వర్షంలో అకస్మాత్తుగా కారు అదుపు తప్పిందా? అది ఆక్వాప్లానింగ్‌! - ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి
తడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా స్కిడ్‌ కావడానికి కారణం ఇదే! - డ్రైవర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు
Post Office RD Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో రోజుకు రూ.333 ఆదా చేస్తే మీరే లక్షాధికారి!
Embed widget