AP PCC Chief Sharmila Comments: జగన్ పార్టీలో వైఎస్‌ఆర్ లేరు ఉన్నది ఆ ముగ్గురే- యుద్ధానికి "సిద్ధం"- చేతనైంది చేసుకోండి- వైసీపీకి షర్మిల సవాల్
Sharmila comments On Jagan And YSRCP: వైసీపీలో వైఎస్‌ఆర్ లేరని... ఉన్నది ఆ ముగ్గురే అన్నారు షర్మిల. యుద్ధానికి సిద్ధం అంటు ఆ పార్టీ చేపట్టిన ప్రచారంపై కూడా స్పందించారు.
YS Sharmila Comments On YSRCP: ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నది YSR కాంగ్రెస్ పార్టీ కాదని... Y అంటే YV సుబ్బారెడ్డి అని... S అంటే సాయిరెడ్డి...R అంటే రామకృష్ణా రెడ్డి... అన్నారు. ఆ పార్టీలో వైఎస్‌ఆర్ లేరని అన్నారు. మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ...ప్రజలను పట్టించుకోని పార్టీ అంటు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ...వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ అన్నారు.
తనపై ముప్పేట దాడి చేస్తున్నారని... అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు షర్మిల. నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని ఆవేదన వ్యక్తంచేశారు. నా బిడ్డలను, ఇంటిని పక్కన పెట్టా.. వైసీపీ నీ నా బుజాల మీద వేసుకున్న... మనసు పెట్టీ పని చేశానని గుర్తు చేశారు. నా రక్తం దారపోశా..నా చెమటను దారపోశా... అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుందని ఆరోపించారు. నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడనని... ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని... భయపడే వాళ్ళు ఎవరు లేరని హెచ్చరించారు. మీకు చేతనైంది చేసుకోండిని అని చీదరించుకున్నారు.
వైసీపీ చేస్తున్న యుద్ధానికి సిద్ధం సభపై కూడా ఫైర్ అయ్యారు షర్మిల. నేను రెడీ...ఈ యుద్ధానికి మేము రెడీ అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి.. ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి... విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి తెలిపారు. రైతు రాజ్యం రావాలనే వైఎస్సార్ బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందన్నారు.