By: Harish | Updated at : 07 Feb 2023 10:53 AM (IST)
బుధవారం ఏపీ క్యాబినెట్ భేటీ- రాజధాని షిఫ్టింగ్‌పై ప్రధానంగా చర్చ!
ఆంధ్రప్రదేశ్ క్యాబినేట్ రేపు సమావేశం కానుంది. విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అంశంతోపాటు అసెంబ్లీ సమావేశాలపై చర్చించనుంది. దీంతోపాటు వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఇన్వెస్టమెంట్ సమ్మిట్ పై కాబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోనుందని అధికార వర్గాలు అంటున్నాయి.
రేపు(బుధవారం) జరిగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఫిబ్రవరి నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. అయితే మార్చి మొదటి వారంలో వైజాగ్‌లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనుంది. ఆ సమ్మిట్ తర్వాత అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో చేస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
సమ్మిట్‌కు ముందు పూర్తి స్థాయి కసర్తతు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు, మంత్రులు అంతా సమ్మిట్‌పైనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లి సమావేశాలకు రెడీ కావటం ఇబ్బందిగా ఉంటుంది. పూర్తి స్థాయి సమాచారం సేకరించటం కూడా ఆలస్యం అవుతుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేయటం ఇబ్బందిగా మారుతుందని భావించిన ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ తరువాత అసెంబ్లి సమావేశాలు నిర్వహించటం బెటర్ అనే ఉద్దేశానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.
సమ్మిట్‌లో మంత్రులకు కీలక బాధ్యతలు..
విశాఖపట్టణంలో వచ్చే నెల మొదటి వారంలో జరిగే ఇన్వెస్టమెంట్ సమీట్‌ను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగ కొంతమంది మంత్రులకు ఈ సమావేశాలకు సంబంధించి కీలక బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలు.. సంక్షేమ పథకాలు, జగన్ జిల్లా టూర్లు పై కూడా చర్చిస్తారు. కొన్ని విధానపరమైన నిర్ణయాలు కూడా క్యాబినెట్‌లో తీసుకోనున్నారు
కీలకంగా విశాఖపట్టణం రాజధాని...
విశాఖపట్టణం కేంద్రంగా రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో జగన్ విశాఖ కేంద్రంగా రాజధాని అని అక్కడకే తాను కూడా వెళ్తున్నానని స్పష్టం చేశారు. దీంతో రాజధాని అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీఎం విశాఖ షిఫ్టింగ్‌పై కూడా క్యాబినేట్‌లో కీలకంగా చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది తర్వాత సీఎం వారానికి మూడు రోజులు వైజాగ్‌లో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం సింగల్‌గా వైజాగ్ వెళితే పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే అంశంతో పాటుగా మిగిలిన శాఖల షిఫ్టింగ్‌పై కూడా చర్చిస్తారని కూడా తెలుస్తోంది. రాజధాని అంశం ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. దీంతో సుప్రీం నిర్ణయం కూడా కీలకంకానుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
సైలెంట్ గా రాజధాని రైతులు...
సుప్రీం కోర్టులో రాజధాని వ్యవహరం విచారణలో ఉండటంతో అమరావతి రైతులు కూడా ఉత్కంఠగా ఏదురు చూస్తున్నారు. ప్రభుత్వం విశాఖ కేంద్రంగా రాజధాని అంటూ ప్రకటన చేయటం, సమ్మిట్‌కు కూడా విశాఖను కేంద్రంగా చేసుకొని ఏర్పాట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది.
‘‘ఓట్ ఫ్రం హోం’’ కాన్సెప్ట్‌పై లక్ష్మీనారాయణ ప్రశంస- ఆ పని కూడా చేయాలంటూ ఈసీకి సూచన
నడ్డా తెలంగాణ పర్యటన రద్దు- 8న రానున్న ప్రధానమంత్రి
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్‌కు పవన్ సూచన
ట్విటర్ వేదికగా కేటీఆర్-బండి మాటల యుద్ధం- మధ్యలో కాంగ్రెస్ కౌంటర్!
మోదీ మిత్రుల ఖజానా నింపేందుకు పెట్రోల్ ధరల పెంపు- మంత్రి కేటీఆర్
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత
YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు
Seediri Appalraju : సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి అత్యవసర పిలుపు - ఏం జరుగుతోంది ?