అన్వేషించండి

What is happening in YSRCP : ఎమ్మెల్యే పదవికే కాదు వైసీపీకి కూడా ఆళ్ల రాజీనామా - వైఎస్ఆర్‌సీపీలో ఏం జరుగుతోంది ?

Alla Ramakrishna Reddy : ఎమ్మెల్యే పదవితో పాటు వైఎస్ఆర్‌సీపీకి కూాడా రాజీనామా చేసినట్లుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో వైసీపీలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

 

Alla Ramakrishna Reddy resign :   మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి  ( Alla Resign ) రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనమా చేసినా చేయకపోయినా అసలు విషయమే కాదు. ఎందుకంటే మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ( Assembly Elections ) ఉన్నాయి. కానీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడమే ఇక్కడ విశేషం. పార్టీకి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమిటన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ అయింది. 

సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఆళ్ల కుటుంబం

ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగరి ( Mangalagiri ) నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో సారి ఆయన లోకేష్‌పై గెలిచారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. కోస్తా జిల్లాల బాధ్యతలన్నీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డినే చూసుకుంటారు. ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి అనుబంధం ఉంది. ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఆయన కుటుంబసభ్యులు రాంకీ సంస్థ యజమానులు. 

వైఎస్ఆర్‌సీపీ తరపున కోర్టుల్లో పిటిషన్లు వేసిన ఆళ్ల 

ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీపై పోరాటం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా పలు రకాల పిటిషన్లు కోర్టుల్లో వేశారు. అమరావతిపై ఎన్జీటీలో పిటిషన్లు వేసిన వారికి సాయం అందించారు. టీడీపీ హయాంలో ఓ అధికారి ఏసీబీకి పట్టుబడిన సమయంలో .. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఊార్య పేరు వెలుగులోకి వచ్చింది.ఆ అధికారి ఆస్తులకు ఆమె బినామీగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. ఆ కేసు విషయంలోనూ వివాదమయింది. అప్పటి డీజీపీపై ఆళ్ల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు కూడా  చేశారు. అలాగే.. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని అసైన్డ్ భూమలుు, ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలు అంటూ ఫిర్యాదులు చేశారు. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. వైసీపీ హైకమాండ్ కు ఇంత సన్నిహితుడు అయిన ఆళ్ల ఇప్పుడు పార్టీకి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. 

వచ్చే ఎన్నికల్లో ఎక్కడా టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పారా ?

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నఆళ్లకు ఈ సారి టిక్కెట్ ఇచ్చేది లేదని సీఎం జగన్ చెప్పినట్లుగా  ప్రచారం జరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతగా ఉన్న గంజి చిరంజీవిని ఇటీవల వైసీపీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో తనకు మంగళగిరిలో కాకపోతే మరో చోట సీటు కేటాయిస్తారని అనుకున్నారు. కానీ ఈ సారి సీటు ఇచ్చేది లేదని స్పష్టత ఇవ్వడంతో అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లుగా భావిస్తున్నారు.  

లోకేష్ పై గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానన్న జగన్ - ఇప్పుడు సీటుకే ఎసరు

నిజానికి 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో లోకేష్ పై ఆళ్ల  రామకృష్ణారెడ్డిని  గెలిపిస్తే.. మంత్రిని చేస్తానని సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో  చెప్పారు. మంత్రి పదవి ఇస్తారేమోనని ఆళ్ల ఆశపడ్డారు.కానీ పదవి లేకపోగా అసలు టిక్కెట్ లేదని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget