అన్వేషించండి

jagtial News : మలుపులు తిరుగుతున్న జగిత్యాల రాజకీయం - అభ్యర్థులెవరు ?

జగిత్యాల జిల్లాలో అభ్యర్థులపై అన్ని పార్టీలు ఓ అంచనాకు వస్తున్నాయి. కవిత అసెంబ్లీకి పోటీ చేస్తే జగిత్యాల నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.


 jagtial News : తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల  అసెంబ్లీ నియోజకవర్గం ప్రత్యేక స్థానం పొందింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓడిపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని భారీ మెజారిటీతో సాధించుకున్నారు. జీవన్ రెడ్డి టీఆర్ఎస్ లో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య వివాదం తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం నియోజకవర్గ పర్యటనలను, నిరసనలను మినహా పార్టీ బలోపేతంపై దృష్టిసారించకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారనుంది. 

జగిత్యాల నుంచి కవిత పోటీ చేస్తారా ? 

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈసారి టీఆర్ఎస్ టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని ఇద్దరు ముఖ్య నేతలు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత జగిత్యాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది టీడీపి నేత ఎల్. రమణటి టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన కూడా జగిత్యాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వస్తుంది. నిజామాబాద్ ఎంపీగా అరవింద్ గెలిచాక జగిత్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.  కొంత ఊపు పెరిగినా వర్గ విబేధాలు ఎక్కువయ్యాయి .

వారసులకు టిక్కెట్లు ఇప్పించేందుకు ఇతర నేతల ప్రయత్నాలు !

కోరుట్లకు విద్యాసాగర్ రావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కోరుట్ల నుంచి తన కుమారుడు అయిన సంజయ్ ను పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే సంజయ్ హైదరాబాదులో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఎన్నికల వాతావరణం రావడంతో సంజయ్ ఇప్పటినుంచే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. కాంగ్రెస్ నేతలు మూడు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు కొడుకు నరసింగరావు పోటీకి రెడీ అవుతున్నారు. బీజెపి నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన టికెట్ రావాలని ఆశిస్తున్నారు. 

ధర్మపురి నుంచి వివేక్ ప్రయ.త్నాలు ! 

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం ధర్మపురికి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ లో స్థానిక చర్చనీయాంశంగా మారాయి.గత ఎన్నికల్లో కేవలం 441 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి మీద కొప్పుల ఈశ్వర్ గెలిచారు. కొప్పుల ఈశ్వర్ చేతిలో ఓటమి పాలైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు.అయితే ఇటీవల కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది.ఎలాగైనా ఈసారైనా కొప్పుల ఈశ్వర్ ని ఓడించాలని లక్ష్మణ్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు.టిఆర్ఎస్ లో వర్గ విభేదాలు కొప్పుల ఈశ్వర్ కు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి.కాళేశ్వరం link 2 లో భాగంగా పైప్ లైన్ వేసిన భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపిస్తోంది. రోడ్ల వెడల్పు లో ఇల్లు కోల్పోయిన వారికి పరిహారం అందక వారు అధికార పార్టీ మీద కోపంగా ఉన్నారు ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లోటిఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది మొత్తం 15 వార్డులో టిఆర్ఎస్ 8,కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు తర్వాత బీజేపీలో చేరిన గడ్డం వివేక్ కు రెండు పార్టీ కార్యకర్తలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి.దీంతో ధర్మపురిలో బీజెపి తరపున గెలవాలని ఆయన కోరుకుంటున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget