అన్వేషించండి
Satyabhama Serial Today September 20th: సత్య అడిగిన ప్రశ్నకు క్రిష్ సమాధానమేంటి - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 20 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో హైలెట్స్ ఫొటోస్ తో సహా చూసేయండి...
Satyabhama Today Episode Photos (Image Credit: star maa/Disney + Hotstar)
1/7

క్రిష్ పరిస్థితి చూసి సత్య అల్లాడిపోతుంటే..కుటుంబ సభ్యులంతా పగ, ప్రతీకారం అని మాట్లాడుతుంటారు..వారిపై ఫైర్ అవుతుంది సత్య. మీరు తీయాల్సిన ప్రాణం గురించి కాదు..లోపలున్న ప్రాణం గురించి ఆలోచించండి అని వేడుకుంటుంది..
2/7

చిన్నా గురించి నీకు మాత్రమే ప్రేమ ఉందా...మాకు లేదా నీ మామని తప్పుపడతావా అని మండిపడుతుంది అత్త. మీ అందరకీ క్రిష్ ని బతికించడం కన్నా రౌడీలను పట్టుకోవడమే ప్రధానమా అని సత్య నిలదీస్తుంది.
3/7

ఒకరు అటాక్ చేశారని మరొకరు పోటాపోటీగా వెళితే ఈ గొడవలు ఎప్పుడు సర్దుమణుగుతాయని అడుగితే..అంతే అని రిప్లై ఇస్తారు క్రిష్ తల్లి తండ్రి... ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ తో క్రిష్ ఆరోగ్యం గురించి ఆరాతీస్తుంది
4/7

కుటుంబం అంతా లోపకలు వెళతారు..హాస్పిటల్ బెడ్ పై క్రిష్ ని చూసి అల్లాడిపోతుంది సత్య...నీ ప్రాణం నీ ఒక్కడిదే కాదు నాది కూడా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..క్రిష్ సత్యని ఓదార్చుతాడు..
5/7

లడ్డూ తినేదగ్గరే ఆగిపోయింది..తింటుంటే మత్తు వచ్చిందంటూ తల్లితో అంటాడు..కంగారు పడిన క్రిష్ తల్లి నువ్వు రెస్ట్ తీసుకో మేం పోయి వస్తాం అని వెళ్లిపోతూ...నా కొడుకు పక్కన కూర్చుని మా వంతు ప్రేమని కూడా నువ్వే చూసుకో అంటుంది
6/7

అటాక్ లు జరగడం మొదటిసారి కాదు చివరికాదు జరుగుతూ ఉంటాయ్ అని పనిమనిషితో అంటుంది క్రిష్ తల్లి. ఆ తర్వా హాస్పిటల్ నుంచి భర్తను తీసుకుని ఇంటికొస్తుంది సత్య. నీ భార్య మమ్మల్ని చాలా మాటలందంటూ సత్యపై కంప్లైంట్స్ చేస్తారు క్రిష్ కుటుంబ సభ్యులు...
7/7

ఓ ప్రాణం గురించి ఆరాటపడడం భయం కాదు ప్రాణానికి ఇచ్చే విలువ అని సమాధానం చెబుతుంది. ప్రాణం విలువ తెలుసు కాబట్టే నా తండ్రి ప్రాణం కాపాడాలి అనుకున్నా అంటాడు క్రిష్. నీ భర్తకి సేవలు సరిగ్గా చేయమన్న తల్లితో..సేవలు ఎలా చేయాలో సత్య దగ్గరే ఎవరైనా నేర్చుకోవాలంటాడు క్రిష్. నీకు జరగకూడనిది ఏమైనా జరిగితే నేను ఏమైపోవాలి నా గురించి ఆలోచించలేదా అని బాధపడుతుంది సత్య...
Published at : 20 Sep 2024 10:23 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
సినిమా
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















