అన్వేషించండి
Brahmamudi Serial Today October 23rd: కావ్యకు దొరికిపోయిన అనామిక - రాజ్ కి తిప్పలు మొదలు!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today Episode
1/9

CEO గా వచ్చిన కావ్యను చూసి రాజ్ ఫైర్ అవుతాడు. కావ్య కూడా అంతే ధీటుగా సమాధానం చెపబుతుంది. జాయినింగ్ లెటర్ చూసి ఇరిటేట్ అవుతాడు
2/9

పొలమారిన సీతారామయ్య రాజ్ అరుపులు మొదలెట్టినట్టున్నాడు అనుకుని నీళ్లు తాగుతాడు. ఏం జరిగిందో తెలుసుకుందాం అని భార్యతో చెప్పి కావ్యకు కాల్ చేస్తారు.
3/9

నన్ను CEO గా గుర్తించేందుకు అంగీకరించడం లేదని కావ్య ..సీతారామయ్యకు చెబుతుంది. అలాఅయితే మేనేజర్ పోస్ట్ నుంచి తీసేస్తానని బెదిరించమని చెబుతాడు. కంపెనీతో పాటూ నీ జీవితం చక్కదిద్దుకో అని చెబుతాడు
4/9

ఇంటికి కోపంగా వచ్చిన రాజ్..సీతారామయ్యపై ఫైర్ అవుతాడు. రుద్రాణి, ధాన్యలక్ష్మి సపోర్ట్ చేస్తారు. ఎవర్ని అడిగారని రాజ్ అంటే.. నన్ను అడిగి కావ్యను ఇంట్లోంచి పంపించావా? నా అనుమతి తోనే నిర్ణయాలు తీసుకున్నావా అని రివర్సవుతాడు
5/9

అవార్డు కావ్య గెలుచుకుంది..రాజ్ ఇంతకుముందులా సమర్థవంతంగా పనిచేయడం లేదు.. వ్యక్తిగత కోపాన్ని కంపెనీపై చూపిస్తున్నాడు..అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు అని స్ట్రాంగ్ గా చెప్పేస్తాడు
6/9

కళ్యాణ్ ఆటో ఎక్కిన ఇద్దరు అమ్మాయిలు తను రాసిన పాట వింటూ బావుందని మాట్లాడుకుంటారు. అది విని కవి మురిసిపోతాడు. లక్ష్మీకాంత్ రాసిన పాట అనుకుంటారు వారిద్దరూ..రాసింది తను అని చెప్పలేకపోతాడు కళ్యాణ్..
7/9

దుగ్గిరాల కంపెనీ మేనేజర్ తో కలసి అనామిక కుట్రపన్నుతుంది..కావ్యపై కుట్రచేసి ఇంట్లోంచి పంపించేలా చేశావ్. ఇప్పుడు రాజ్ వెళ్లిపోయాడు..ఇక కొత్త బాస్ కూడా వెళ్లిపోయేలా చేయాలని మాట్లాడుతుంది.. ఆ పక్కనే కావ్య నిల్చుని ఉంటుంది ...అది ఆ మేనేజర్ గమనించడు
8/9

దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కావ్య..ఆ ఫోన్ తీసుకుని అనామికకు షాక్ ఇస్తుంది. మేనేజర్ చేసిన మోసాన్ని అందరి ముందు బయటపెట్టి తనని సెక్యూరిటీగా పనిచేయమని శిక్ష వేస్తుంది
9/9

బ్రహ్మముడి అక్టోబరు 24 ఎపిసోడ్ లో రాజ్ తిప్పలు మొదలయ్యాయి. కంపెనీ లెక్కలకు సంబంధించి ఓపెన్ చేసి చూద్దాం అనుకుంటే పాస్ వర్డ్ తెలియక అల్లాడిపోతాడు. కావ్యకు కాల్ చేస్తే నేను తెలుసుకున్నట్టే మీరే తెలుసుకోండి అని కాల్ కట్ చేస్తుంది
Published at : 23 Oct 2024 11:07 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
విజయవాడ
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion