అన్వేషించండి
తర్వాతి సినిమాకు రెడీ అయిన లెజెండ్ శరవణన్ - కొత్త లుక్ చూశారా?
తమిళ హీరో, లెజెండ్ స్టోర్స్ యజమాని శరవణన్ తర్వాతి సినిమాకు రెడీ అయ్యారు.

లెజెండ్ శరవణన్
1/6

తమిళ నాట శరవణ స్టోర్స్ అంటే తెలియని వారు ఉండరు. అవి చాలా ఫేమస్ అన్న మాట. వాటి అధినేత శరవణన్ 2022లో సినిమాల్లో కూడా అరంగేట్రం చేశాడు. ‘ది లెజెండ్’ అనే సినిమాతో వెండితెరకు విచ్చేశాడు.
2/6

కానీ ఆ సినిమాకు విపరీతమైన నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. క్రిటిక్స్ ఈ సినిమాను ఏకి పడేశారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా ఆశించిన వసూళ్లు రాబట్టడంలో విఫలం అయింది.
3/6

జేడీ, జెర్రీ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్, ఎడిటర్ రూబెన్, మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ వంటి హేమాహేమీలు ఈ సినిమాకు పని చేశారు.
4/6

ఊర్వశి రౌతేలా, ప్రభు, వివేక్, యోగిబాబు, సుమన్, నాజర్, విజయ్ కుమార్, తంబి రామయ్య, రోబో శంకర్ వంటి స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఈ సినిమాలో నటించారు. కానీ ఈ సినిమాను కాపాడలేకపోయారు.
5/6

లెజెండ్ వచ్చిన ఏడాదిన్నర తర్వాత శరవణన్ కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా కూడా ప్రకటించారు. కొత్త లుక్‌లో కొన్ని ఫొటోలు కూడా షేర్ చేశారు.
6/6

ఈ ఫొటోల్లో ఆయన ఎక్కడో మంచు కొండల్లో ఉండటం చూడవచ్చు. కొత్త సినిమా గురించిన వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇది ఆయన ఫ్యాన్స్‌కు కచ్చితంగా గుడ్ న్యూసే.
Published at : 22 Jan 2024 04:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
నిజామాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion