అన్వేషించండి
Lok Sabha Elections 2024: కంగనా రనౌత్ To అరుణ్ గోవిల్- ఎంపీలుగా గెలిచిన సినీ స్టార్స్ వీళ్లే!
తాజా లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు జయకేతనం ఎగురవేశారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మొదలుకొని, హేమా మాలిని, అరుణ్ గోవిల్, రచనా బెనర్జీతో పాటు మరికొంత మంది విజయం సాధించారు.

ఎంపీ అభ్యర్థులుగా విజయం సాధించిన సినీ స్టార్స్(Photo Credit:x)
1/8

బాలీవుడ్ టాప్ స్టార్ కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
2/8

ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని మధుర నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ దంగర్ పై 2.4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
3/8

బెంగాల్ లోని అసన్‌సోల్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎస్‌ఎస్ అహ్లువాలియాపై టీఎంసీకి చెందిన శతృఘ్నసిన్హా విజయం సాధించారు.
4/8

‘రామాయణం’లో శ్రీరాముడిగా నటించిన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సునితా యాదవ్ మీద 10 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విన్ అయ్యారు.
5/8

భోజ్‌పురి నటుడు రవి కిషన్ యూపీలోని గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థి కాజల్ నిషాద్‌పై లక్ష ఓట్ల తేడాతో విజయం సాధించారు.
6/8

ఈశాన్య ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై విజయం సాధించారు.
7/8

బెంగాల్‌లోని హుగ్లీ స్థానం నుంచి టీఎంసీకి చెందిన రచనా బెనర్జీ బీజేపీకి చెందిన లాకెట్ ఛటర్జీపై 60 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
8/8

బెంగాలీ నటుడు సతాబ్ది రాయ్ బెంగాల్‌లోని బీర్భూమ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేబ్తాను భట్టాచార్యపై విజయం సాధించారు.
Published at : 05 Jun 2024 09:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
న్యూస్
విజయవాడ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion